Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ రిపోర్టర్ : ప్రముఖ గాయకుడు ఘంటసాల దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జంటనగరాలకు చెందిన ప్రముఖగాయనీ గాయకులు డీఏ. మిత్రా గీతాంజలి, సుధామయి తదితరులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభరతి అతిథిగా పాల్గొని ఘంటసాలకు పుష్పగిరి పీఠానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఎస్.శైలజ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా వంశీరామరాజు స్వాగతం పలికారు.