Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్ర జానాట్యమండలి ఆధ్వర్యంలో కాచిగూడ నిం బోలి అడ్డా హాస్టల్‌లో దళిత సాంస్కృతికోత్సవా ల్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతి థులుగా ప్రొఫెసర్ కాసిం, ఐక్యకళకారుల సం ఘం చైర్మన్ విమలక్క పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకణుగుణంగా ముందుకు సాగాలన్నారు. కులాన్ని కూకట వేళ్లతో పెకిలిం చినప్పుడే దేశం అభివృద్ధి సిద్ధిస్తుందన్నారు. ప్రపంచంలోని 200దేశాల్లో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలో ఉందని, దానిని పారద్రో లినప్పుడే కుల వ్యవస్థ అంతమౌతుందన్నారు. కులాంతర వివాహాల్ని ప్రోత్సహించాలన్నారు. ప్రజాన్యా టమండలి అధ్యక్ష కార్యదర్శులు పి.కళ్యాన్, ఆర్‌సైదులు, సహయ కార్యదర్శులు కె.భాస్కర్, డీఎంరాజు, సీహెచ్ మహేష్, శేఖర్, బి.పవన్, ఎస్.జనర్ధన్, జి.గోపాల్‌తో పాటు నాయకులు దేవి, ఒబలేశ్వరి, మల్లిక, వినరు, సురేష్, మల్లేష్, కుమార్, కేవీపీఎస్ నగర కార్యదర్శి బి.నర్సింగ్‌రా తదితరులు పాల్గొన్నారు.