Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన 36 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2014 సంవత్సర కీర్తి పురస్కరాలు ప్రకటించింది. విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన నిపుణులు సంఘం ఎంపికచేసి సమర్పి ంచిన పురస్కార గ్రహీతల జాబితాను నిర్వహణ మండలి ఆమోదించిందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు రంగాలల్లో సేవా లందించిన 36 మంది ప్రముఖులు కీర్తి పురస్కరాలకు ఎంపికయ్యారన్నారు. పురస్కారం కింద రూ.5,116లతోపాటు శాలువ, పురస్కార పత్రంతో త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించనున్నట్టు ఆయన వివరించారు.