Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్‌ఎస్ అడ్‌హక్ కమిటీ సభ్యులు హన్మంత్‌రెడ్డి
నవతెలంగాణ - ఉప్పల్
శ్రీ కృష్ణా ఫార్మా కంపెనీలో కార్మికుల సమస్యలు పరిష్కారించాలని, కార్మికుల అక్రమ బదీలీలను వెంటనే నిలిపి వెయ్యాలని టీఆర్‌ఎస్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు మేకల హన్మంత్‌రెడ్డి అన్నారు. శ్రీ కృష్ణా ఫార్మ కంపెనీలో కార్మికులు చేపడుతున్న రిలే నిరహర దీక్షలకు ఆయన మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించి, కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కారించాలని లేని పక్షంలో ఉన్నత అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. కార్మికులకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సంతోష్, బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయూస్ యునియన్ నాయకులు ప్రభు నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ సీఐటీయూ నాయకులు జె.వెంకన్న, బాబు, రవీందర్‌రెడ్డి, శ్రీను, రాజయ్య, అమరేందర్, గణేష్, పాండరీ, దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.