Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
మండలంలోని ఉద్దెమర్రి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నెల్లూట్ల బాలయ్య ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ బూతు కమిటీ అధ్యక్షులు నేమూరి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్‌రెడ్డి బాలయ్య పార్థివాదేహానికి నివాళ్ల ర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనమోర్చ రాష్ట్ర నాయకులు సుధాకర్‌నాయక్, శ్రీకాంత్, జగన్‌మోహన్‌రెడ్డి, శంకర్ పాల్గొన్నారు.