Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ, నల్లకుంట : తెలంగాణ రాష్ట్ర విస్తారంగా వర్షలు కురిసి పచ్చటి పాడిపటలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గంగమ్మ తల్లికి అర్చనలు చేశారు.సోమవారం తిలక్‌నగర్ శ్రీగంగపుత్ర సంఘం అధ్యక్షుడు పూస నర్సింహా ఆధ్వర్యంలో తిలక్‌నగర్ శివాలయంలో గంగమ్మ తల్లికి సామూహిక అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా పూస నర్సింహా మాట్లాడుతూ విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు నిండాలని ఆయన గంగమ్మ తల్లిని కోరామన్నారు. కార్యక్రమంలో ఆత్మబందు అధ్యక్షుడు పెంటం ధర్మందర్, శ్రీగంగపుత్ర యువజన సంఘం అధ్యక్షుడు పెంటంనర్సింగ్‌రావు, అంబర్‌పేట నియోజకవర్గం అధ్యక్షుడు పాక చందర్, గంగభవాణి అసోషియేషన్ అధ్యక్షుడు రాజేష్కర్ , నర్సింగ్‌రావు, శ్రీనివాస్, గుణ్ణమ్మ, మాధవి, రాజయ్య, రామస్వామి, చింతలబాలయ్య పాల్గొన్నారు.