Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
కుంటంబ కలహాలతో డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్‌లోని లెక్షరర్స్ కాలనీలో నివాసం ఉండే మంతటి రమేష్(36) భార్య భర్తల మధ్య తరచు వివాదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై భర్త మత్తు మందు తీసుకుని ఆత్మహత్య చేసుకున్న .స్వప్నలకు ఒక బాబు సంతానం. ఇతను మార్కాపురంలొని ఓబుల్ రెడ్డి హాస్పటల్‌లో మత్తుమందు ఇచ్చే డాక్టర్‌గా ఎంబీబీఎస్‌గా విధులు నిర్వహించేవాడు.స్వప్న కిమ్స్‌లో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నది.వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ఇంట్లో తరచు గొడవలు జరుగుతుండడంతో ఈనెల 11న అర్థరాత్రి వారి ఇంటిపైకి వెళ్లి మత్తుమందు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.