Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
ప్రమాదకరంగా మారిన తుకారాంగేట్ సింగిల్ రైల్వే ట్రాక్ వద్ద రైల్వే గేటునకు అధికారులు మంగళ వారం ఏర్పాట్లు చేశారు. కొన్నేండ్లుగా ఆ ప్రాంతంలో రైల్వే గేట్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటు లేకపోవడంతో తొందరగా వెళ్లాలని చాలా మంది ప్రయాణికులు రైళ్లు వస్తున్న సమయంలో ట్రాక్ దాటేందుకు యత్ని ంచి ప్రమా దానికి గురవుతున్నారు. రైల్వేగేటు వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులకు ఫిర్యా దులు ఎక్కువగా అందడంతో స్పందించిన రైల్వే అధికారులు వెంటనే చర్యలు చేపట్టి తుకారాంగేట్ సింగిల్ రైల్వే ట్రాక్ వద్ద గేటును పూర్తి చేశారు. ఇకమీదట ఆ ట్రాక్ నుంచి ట్రైన్ వస్తున్న సమయంలో గేటు వేస్తామని, భవిష్యత్‌లో ప్రమాదాలను తగ్గించే ందుకు చర్యలు చేపడుతామని అధికారులు పేర్కొన్నారు.