Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
ప్రజలు సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమని కార్పొరేటర్ గోపు సరస్వతి అన్నారు. మంగళవారం చిలుకనగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి ఉప కమిషనర్ కృష్ణ శేఖర్, ఈఈ రాజయ్య, ఎసీపీ గజానందం, డీఈ నిఖిల్‌రెడ్డితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీ వాసులు కాలనీలో నెలకొన్న అండర్ డ్రయినేజీచ వాటర్ పైపులైన లీకేజీ వంటి సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ అధికారులను సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా కాలనీలో ఎలాంటి సమస్యలు నెలకొన్న తమ దృష్టికి తీసుకువస్తే అధికారులకు చెప్పి వెంటనే పరిష్కరిస్తామన్నారు.