Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఆర్టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్)-2017, పీహెచ్‌సీ తుది ఫలితాలు ప్రకటించి వెంటనే నియామకాలను చేపట్టాలని అభ్యర్థులు ఆందో ళన బాట పట్టారు. ఫలితాల విడుదలలో టీఎస్ పీఎస్సీ జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్ ఎదుట 200కుపైగా అభ్యర్థులు శాంతియు త నిరసన చేపట్టారు. టీఆర్టీ-పీహెచ్‌సీ ఫలితాల జాబితాను వెంటనే ప్రకటించి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఏ, ఎస్జీటీ అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం..536 పీహెచ్‌సీ వికలాంగ అభ్యర్థుల ఫలితాలు ఇవ్వకపోవడం దారుణమని అభ్యర్థులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫలితాల విడుదలపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆయా పోలీసు స్టేషన్‌లో తమ నిరాహార దీక్ష కొనసాగిస్తామని పీహెచ్‌సీ అభ్యర్థులు పేర్కొన్నారు.