Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారు అనుకున్న గమ్యానికి చేరుకుంటారని న్యూ ఎజ్ ఫౌండేషన్ అధ్యక్షులు నవీన్ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌మార్గ్‌లో శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఈ అవగాహన ద్వారా విద్యార్థులలో మానసిక పరివర్తన, ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవకుండా శ్రద్ధగా చదవాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ బి.ఆంజనేయులు మాట్లాడుతూ.. విద్యతో పాటు ప్రతి రంగంలో రాణించే విధంగా వారికి శిక్షణ అందిస్తున్నామన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యను అందిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సంపత్, సహయ కార్యదర్శి సాయినాథ్, స్పీికర్ ఖాసీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.