Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్‌రూరల్
లాక్‌డౌన్‌తో కనీసం ఒక పూట కూడ భోజనం చేయ లేని వలస కూలీలకు మేడ్చల్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లా డుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో ప్రధాన భూమిక పోషించిన వలస కార్మికులు నేడు ఉన్న పరిస్థితుల్లో పూట పూట తిండి లేక, సొంత గ్రామాలకు వెళ్ళలేక ప్రభుత్వం ఆదు కోక అనేక ఇబ్బందులు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్‌లో ఉన్న శ్రీనివాస ఫంక్షన్‌హాల్‌లో మంగ ళవారం 200 మంది వలస కార్మికులకు భోజనం, 500 మందికి బిస్కెట్ ప్యాకెట్‌లు అందజేశారు. 50 రోజుల నుం చి పనులు లేక భార్యా బిడ్డలతో ఇండ్ల కిరాయిలు పెట ్టలేక పస్తులు ఉండలేక కాలినడకన వంద లాది కిలోమీటర్లు పిల్లలతో నెత్తిన మూటతో నడుస్తూ వెళుతుంటే కార్మి కుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి వలస కార్మి కులకు భరో సా ఇచ్చి పని కల్పించి ఆదుకోవాలన్నారు. అంతేకాదు ఇక నుండి మూడు రోజుల పాటు వారికి అన్నం పెట్టే బాధ్యత సిపిఎం పార్టీ తీసుకుంటుందన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వలె తమ ప్రభుత్వం కూడా వలస కార్మికులకు రేషన్ కార్డు తో నిమిత్తం లేకుండా నిత్యావసరాలు పంపిణీ చేసి వారికి భరోసా నివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అశోక్, మండల నాయకులు బంటు భాస్కర్, రాజశేఖర్, రమేష్, కొమురయ్య, నర్సింగ్ రావు పాల్గొన్నారు