Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జీడిమెట్ల
ప్రగతి నగర్ కార్పొరేషన్ పరిధిలోని అభివద్ధి పను లన్నీ సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులను ఆదేశించారు. జీడిమెట్ల డివిజన్ పరిధి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రగ తి నగర్ కార్పొరేషన్ అధికారులతో అభివద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. పనులన్నీ వర్షాకాలం ముందుగానే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అంబీర్ చెరువు సుంద రీక రణ పనులను వేగ వంతం చేయాలని, బతుకమ్మ ఘాట్ పనులతో పాటు ప్రగతి నగర్ డ్రయినేజీ డైవర్షన్, శాశ్వత పను లను కూడా వెంటనే చేపట్టాలని అధి కారులను ఆదే శించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాం టి ఇబ్బందులూ కలగకూడదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అది óకారులకు సూచించారు. ఈ కార్య క్రమంలో ఈ ఈ, హైదర్ ఖాన్, డీఈ నరేందర్ కుమార్, ఏఈఈ విశ్వం, ఏఈ, రామారావు తదితరులు పాల్గొన్నారు.