Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-వనస్థలిపురం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని సామాజిక వేత్త బ్లెస్సో సామ్యూల్ అన్నారు. శుక్రవారం ఎల్‌బినగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలి పురంలో నివాసం ఉంటున్న 35ముస్లిం నిరుపేద కుటుం బాలకు నిత్యవసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సామ్యూల్ మాట్లాడుతు బాధ్యతగల ప్రతిఒక్కరు సామాజిక సేవాదృక్పథంతో పేదలను ఆదుకో వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనంచేసే చిన్న సహ యమే నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నున్న జాన్, గౌతమ్‌రాజు, జాన్ కెన్నెడీ తదిత రులు పాల్గొన్నారు.