Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కొండవీడు రైతు ఆత్మహత్యలో పోలీసుల ప్రమేయమేలేదు..
  • స్టార్టప్‌లకు ఏంజెల్‌ట్యాక్స్‌ మినహాయింపు
  • ఇంజనీర్లను అవమానించిన రాహుల్, అఖిలేష్
  • ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు రాహుల్‌గాంధీ
  • అక్క పాత్రలో రేణుదేశాయ్..?
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
జాతి పరిణామానికి కారణాలు | జాతర | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతర
  • ➲
  • స్టోరి
  • Jun 05,2018

జాతి పరిణామానికి కారణాలు

మానవ జాతి మూలం ఒకటే అయినా కాల క్రమంలో రకరకాల జాతులుగా అది అభివృద్ధి చెందింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్లనే ప్రపంచంలో కొత్త జాతులు అవతరించడం, ఉన్న జాతులు నశించి పోవడం జరుగుతున్నది. ఆ విశేషాలను తెలిపే వ్యాసమే ఇది.
సమాజంలో పాక్షిక దృక్పథం ఉన్న వ్యక్తుల లేదా వర్గాల మధ్య కృత్రిమమైన కట్టుబాట్ల ద్వారా జాతి అభివృద్ధిని అదుపులో ఉంచడాన్ని సాంఘిక వరణం అంటారు. అటువంటి సాంఘిక ప్రమాణాలకు చెందిన వ్యక్తుల మధ్యనే ఈ పద్ధతిలో సంపర్కం ఏర్పడుతుంది. దాదాపు అన్ని రకాల సమాజాల లోను వ్యక్తుల లేదా వర్గాల మధ్య సాంఘిక వ్యత్యాసాలు ఉంటాయి.
చాలా సమాజాల్లో వివాహమనేది ఇష్టం వచ్చినట్లు జరగదు. సాధారణంగా చాలా కట్టుబాట్లతో ముడివడి ఉంటుంది. అయితే ఈ కట్టుబాట్లు ఆ సమాజాలలోని వివిధ వర్గ వ్యత్యాసాలకు అనుకూలంగా ఉంటాయనేది సహజం. ఉదాహరణకు అమెరికా లోని నలుపు, గోధుమ వర్ణం, పసుపు వంటి ఎన్నో రకాల రంగు జాతులవారున్నారు. సమాజపరయైన కట్టుబాట్లు ఈ వివిధ వర్గాల వాళ్లను ఒకరికొకరు దూరంగా ఉండేటట్లు చూస్తాయి. ఈవిధంగా కట్టుబాట్లనేవి వేర్పాటు శక్తులుగా పనిచేసి, జనాభా లోని ఆయా వర్గాల మధ్య పుట్టుకతో వచ్చిన వ్యత్యాసాలు బాగా నాటుకొనిపోయేటట్లు చేస్తాయి.
ఆకస్మిక మార్పు
వివిధ రకాలైన లక్షణాలు అకస్మాత్తుగా ఉద్భవించే పద్ధతిని 'ఆకస్మిక మార్పు' అంటారు. ఈ పద్ధతిలో ఒక ప్రత్యేకమైన జన్యువు ఒకరకమైన శాశ్వతమైన మార్పుని పొందుతుంది. ఇది ఒక పాత లక్షణానికి చెందిన కొత్తరూపం ఉనికికి దారితీ స్తుంది. ఈ 'మార్పు' అనేది పరిణామదశకు కావలసిన సామగ్రినంతా సిద్ధం చేస్తుంది. ఈ మార్పనేది లేకపోతే పరిణామ దశలో చెప్పుకోదగిన తేడా కనిపించదు. జనాభాలో ఈ మార్పులను ప్రవేశపెట్టడానికి ఏదో ఒక ప్రతినిధి అంటూ ఉండాలి.ఈ ప్రతినిధినే ఒకవిధమైన వరణం (సెలెక్షన్‌)గా చెప్పుకోవచు.
ఆకస్మిక మార్పులలో రెండు రకాలున్నాయి. ఒకటి జీనిక్‌ మ్యుటేషన్‌, 2 క్రోమోజోమల్‌ మ్యుటేషన్‌. ఒకజన్యువులో వచ్చే రసాయనిక మార్పు జీనిక్‌ మ్యుటేషన్‌ అవుతుంది. క్రోమోజోమ్‌ నిర్మాణంలోగాని లేదా క్రోమోజోమ్‌ సంఖ్యలో గాని వచ్చే మార్పు క్రోమోజోమ్‌ మ్యుటేషన్‌ అవుతుంది. ఒక కొత్త జన్యువు తయారయితేనే దానిని స్థూలంగా జీనిక్‌ మ్యుటేషన్‌ అని చెప్పవచ్చు. ఈ కొత్త జన్యువు తన తల్లి జన్యువు కంటె భిన్నమైన లక్షణాలను చూపిస్తుంది.
ఇప్పుడు నీగ్రోలకున్న చిక్కుల జుట్టు అనుకూలన విలువ ఉన్న ఒక మార్పు ఫలితమే. అంటే ఈ నీగ్రోల పూర్వులైన ఆదివాసు లకు నున్నని వెంట్రుకలు ఉండి ఉంటాయి. కాలక్రమంలో జన్యువుల్లో వచ్చిన మార్పు వల్ల నీగ్రోయిడ్‌ జాతిలో ఈ కొత్తరకం జుట్టు వచ్చింది.
ఆదిమానవులు చాలా చిన్న చిన్న గుంపులుగా జీవనం సాగించి నారు. అటువంటి చిన్న చిన్న గుంపులలో ఈ మార్పు (దానికి వరణాత్మక శక్తి ఉన్నట్లయితే) చాలా త్వరగా పాతుకొని పోయి, మొత్తం జనాభాలో అంతా అల్లుకొని పోతుంది. అటువంటప్పుడు ఆ లక్షణం ఆ జాతికంతటికీ ప్రత్యేక లక్షణం అవుతుంది.
జన్యు సంచలనం (జెనిటిక్‌ డ్రిఫ్ట్‌)
ఈ సిద్ధాంతాన్ని మొదటగా చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన సీవాల్‌ రైట్‌ ప్రతిపాదించాడు. దీనిని సీవాల్‌ రైట్‌ ఫలితం అనికూడా అంటారు. సాధారణంగా ఈ పరిణామం అనేది జనాభాలోని జన్యువుల గతిలో మార్పు వల్ల వస్తుంది. ఈ జన్యువులలోనే జాతి నిర్మాణం మొదలవుతుంది. జన్యువుల సంచలనం అనేది కూడా మానవ జాతిలో అటువంటిదే. ఒక అనూహ్యమైన మార్పు (రాండం వారియేషన్‌) జనాభా తగ్గిపోయేకొద్దీ మూల లక్షణం నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక దంపతుల సంతానం నలుగురూ ఒకే తెగకు చెందినవారనుకుందాం. అంటే నలుగురూ మగపిల్లలు లేదా నలుగురూ ఆడపిల్లలు కావచ్చు. 'ఎక్స్‌' లేక 'వై' కణాలున్న శుక్రకణంతో కలవడానికి దాదాపు ప్రతి అండానికి సమానావకాశాలు ఉన్నప్పటికీ, ఈ విధంగా ఒకే తెగ సంతానం కలగడమనేది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబంలో నలుగురు పిల్లలూ ఒకే తెగకు చెందిఉండే అవకాశం 16లో 1 ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక కుటుంబం లేదా అనేక కుటుంబాలు ఉంటే ఆ పిల్లలలో లైంగిక నిష్పత్తిని కలిపి చూసినప్పుడు ఏకత్వం కనిపిస్తుంది. అంటే ఆడపిల్లలు ఉన్నంతమంది మగపిల్లలు కూడా ఉంటారు. నలుగురు మగపిల్లలు గల కుటుంబాలకు సమానంగా నలుగురు ఆడపిల్లలు గల కుటుంబాలు ఉంటాయి. అయితే మానవ జాతి మొత్తంలో ఆవిధంగా భార్యా భర్తలు, వాళ్ల నలుగురు ఆడపిల్లలు మాత్రమే ఉన్నప్పుడు 'వై' క్రోమోజోములు నశించిపోయి 'ఎక్స్‌' క్రోమోజోములు మాత్రం నిలబడతాయి. దీని ఫలితం మానవ జాతి నాశనం అని వేరే చెప్పనవసరం లేదు. కొన్ని రకాల చెట్లు, జంతువులు నామరూపాలు లేకుండా నశించిపోవడానికి ఈ పరిణామమే కారణం కావచ్చు.
సంఖ్యాబలం బాగా తక్కువ అయ్యేటప్పటికి సహజంగా ఉపయోగపడే లక్షణాలు నశించిపోతాయి. అందువల్ల జనాభా తగ్గిపోతున్నప్పుడు జన్యువుల గతి ఒక తరం నుంచి మారే లేదా సంక్రమించే అవకాశం ఉంది. ఇటువంటి చలనం వల్ల ఒక లక్షణానికి చెందిన జన్యువు బాగా పాతుకుపోవచ్చు; లేదా పూర్తిగా నాశనం కావచ్చు. ఇది జనాభా తక్కువైనప్పుడు లేదా మిగిలిన ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. ఆ జన్యువులో శాశ్వతమైన మార్పు వస్తుంది. ఆ జన్యువులో వచ్చిన మార్పు అందరిలోనూ కనిపిస్తుంది. ఆ జనాభాలో అంతకు ముందుండే లక్షణం పూర్తిగా కనిపించకుండా పోవచ్చు కూడా. అంతేకాక ఒక్కొక్కసారి ఈ అకస్మిక మార్పు చెందిన జన్యువు పూర్తిగా అంతరించిపోవచ్చు. మ్యుటెంట్‌ జన్యువులు ఇట్లా ఎక్కువ కావడం లేదా తగ్గిపోవడం జన్యు పౌన:పుణ్యం (జీన్‌ ఫ్రీక్వెన్సీస్‌)లో ఎన్నో అకస్మికమైన తేడాలకు దారితీస్తుంది. ఈ పరిణామాన్నే 'జన్యు సంచలనం' అంటారు.
ఈ జన్యు సంచలనం ఫలితంగా ఒకే జన్యు లక్షణాలలో ఏర్పడే జనాభాలు ఒకదానికొకటి దూరమైనప్పుడు క్రమంగా కొన్ని వ్యత్యాసాలకు లోనవుతాయి. ఉదాహరణకు పూర్వులు ఒకరే (ఏ, ఎ) అయినప్పటికీ రెండు జాతుల వాళ్లు జన్యు పౌన:పున్యం రీత్యా 'ఏ', 'ఎ' లక్షణాల ద్వారా చాలా దూరంగా విడిపోగలరు. కొంతకాలానికి ఒకరు 'ఏ' వర్గానికి చెందితే, మరొకరు 'ఎ' వర్గానికి చెందుతారు. వివిధ జనాభాలలో పి.టి.సి అనే ఫినైల్‌ థియోకార్బొమైడ్‌ లవణాన్ని రుచిచూడగలగటం లేదా రుచి చూడలేకపోవడం ఆయా జన్యువుల పైన ఆధారపడి ఉంటుంది. దీనిని బట్టి జన్యువులలో వచ్చే అకస్మిక మార్పులను గుర్తించవచ్చు.

- మౌక్తిక్‌

జాతి పరిణామానికి కారణాలు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'కిడ్నీస్‌ ఆఫ్‌ ది ల్యాండ్‌ స్కేప్‌' అని ఎలాంటి భూములను అంటారు?
ఓ లింగా.. ఓ లింగా..!
ప్రచారంలో రకరకాల కథలు
మహాత్మా రావణ మైదానం
భావ సంఘర్షణకు ప్రతీక ఎల్లమ్మ కథ
చారిత్రక ఆవశేషాల మాలిక బాసరబాసర
దక్కన్‌ చరిత్ర, సంస్కృతులసై అంతర్జాతీయ సదస్సు
చరిత్ర, సంస్కృతులు ఉమ్మడి ఆస్తులు
ఇదో అద్భుత అంకం
మళ్లీ ఊపందుకుంటున్న జోగిని ఆచారం
బహమాస్‌ సంస్కృతి
ప్రాచీన మార్గాల్లోనే కొత్త రహదారులా!
చెక్క భజన కళారూపం
భయం, విస్మయం, చాతుర్యం కలిస్తే... కాటిపాపలు
అలనాటి గ్రామ న్యాయాధికారి
బంగారాన్ని తయారుచేయాలని...
యుద్ధం తెచ్చిన పరివర్తనతో...
దీవనార్తి నుంచి భాగోతాల వరకు...
జ్యోతి నృత్యం
గోత్రాలవారు ఎవరు?
డబ్బు, అధికారం చేతుల్లో కళ
అనుకరణలు
కుక్కమాంసానికి ఓ ఫెస్టివల్‌
అందాన్ని పెంచుకుంటూ...
నృత్యం అనాది నుండి కొనసాగుతున్న ఒక సహజాతం
రుద్రదమనుని జునాగఢ్‌ శాసనం
హైబ్రీడ్‌ సంస్కృతి సృష్టే ప్రపంచీకరణ లక్ష్యం
కత్తుల నృత్యం
సపాదలక్ష దేశం ఇప్పుడెక్కడున్నది?
వేదాలు లోపాలకు అతీతం కాదని...
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

04:30 PM

కొండవీడు రైతు ఆత్మహత్యలో పోలీసుల ప్రమేయమేలేదు..

04:25 PM

స్టార్టప్‌లకు ఏంజెల్‌ట్యాక్స్‌ మినహాయింపు

04:15 PM

ఇంజనీర్లను అవమానించిన రాహుల్, అఖిలేష్

04:15 PM

ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు రాహుల్‌గాంధీ

04:14 PM

అక్క పాత్రలో రేణుదేశాయ్..?

04:11 PM

కశ్మీర్‌పై మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

04:09 PM

భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : జవాను తల్లి

04:07 PM

పోలవరం పై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ

03:58 PM

అంతర్జాతీయ కోర్టులో కొత్త వాదనకు తెరలేపిన పాక్‌

03:57 PM

యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం... ఏడుగురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.