Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వరల్డ్ కప్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కపిల్‌ కామెంట్స్
  • నాలుగురు ప్యానెల్ స్పీకర్లు వీరే..
  • రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ
  • రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
స్వర్గం, నరకం కల్పిత లోకాలు మాత్రమే! | జాతర | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతర
  • ➲
  • స్టోరి
  • Jun 12,2018

స్వర్గం, నరకం కల్పిత లోకాలు మాత్రమే!

పురాణాల్లో స్వర్గం ప్రస్థావన అనేకసార్లు కనిపిస్తుంది. సామాన్యుణ్ణి మతం గుప్పిట్లోకి తీసుకురావడానికి స్వర్గం, నరకం అనే భావనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ధనవంతులు ఈ భూమి మీద పొందుతున్న అన్ని విలాసాలను సామాన్యులు స్వర్గంలో పొందవచ్చు అనే ప్రచారం జరగడం ద్వారా సామాన్యుల్లో ఆశ చిగురిస్తుంది. ఫలితంగా దేవుడి మత్తులో పడిపోయారు. అట్లాగే నరకం అన్న భావన మనుషుల్ని భయపెట్టింది. బతికి ఉన్నప్పుడు అనుభవించే కష్టాలకు తోడు చనిపోయాక కూడా బాధలు పడటమా అని దేవుణ్ణి ఇంకా గట్టిగా నమ్మడం ప్రారంభించారు సామాన్యులు. పుణ్యం కోసం దేవునికి మొక్కాలి. పూజలు, వ్రతాలు చేయాలి. బ్రాహ్మణుడికి దానధర్మాలు చేయాలి. ఇవన్నీకూడా పూజారి వర్గంవారు తమ భుక్తికోసం ప్రజల్లో వ్యాప్తిచేసిన ప్రచారాలు.
ప్రాచీన వేదమంత్రాల్లో రుషులు (రుషి అన్న పదం రష్యా నుండి వచ్చింది. రుషులు విదేశీయులు అనడానికి ఇదొక ఉదాహరణ) ఏదో ఒక దేవతను స్తుతించేటప్పుడు ఆ దేవతకు అనేక మంచి గుణాలను కట్టబెట్టేవారు. ప్రస్తుత కాలంలో వ్యక్తుల గొప్పతనం పెరిగినట్టుగానే ఆయా కాలాల్లో ఆయా దేవతలు గొప్పగా పూజింపబడ్డారు. వేదకాలంలో ఇంద్రుడు, ఉపనిషత్తుల కాలంలో బ్రహ్మ, ఆర్యులు-అనార్యుల తగాదాలప్పుడు శివుడు, విష్ణువు సర్వోత్తములుగా గుర్తింపు పొందారు. గుప్తుల కాలంలో దేవలోకం మృత్యులోకానికి ఒక కల్పిత రూపంగా ఉంది. దీన్ని బట్టి రెండు విషయాలు మనకి అర్థమవుతాయి. ఒకటి రుషులు దేవుళ్లవటానికి ఏ అడ్డంకి లేదు. అట్లాగే రెండోది16 వేల భార్యలున్నవాడు, రాసలీలాలోలుడు అయిన కృష్ణుడు దేవుడు అవడానికి ఎటువంటి అవరోధం లేదు. రాజులు, చక్రవర్తులు కూడా తమని తాము దేవుడిగా చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఈజిప్టులో ఫారో చక్రవర్తులు స్వయంగా తామే దేవుళ్లం అని చెప్పుకున్నారు.
వేదమంత్రాల్లో వేదపురుషుని శిరస్సు, చేతులు, తొడలు, పాదాల నుంచి చాతుర్వర్ణాలు పుట్టాయని చెప్పారు ఆర్యులు. కానీ ఆనాటి ప్రజలు అంత అమాయకులు కారు. వేదకాలంలో ఈ వర్ణ వ్యవస్థను ఎవరూ నమ్మకపోగా ఎదురుతిరిగారు. అయినప్పటికీ దేవుడు తన ఇష్టప్రకారం గొప్పవారిని, తక్కువ వారిని పుట్టిస్తాడని, అది వారి వారి పూర్వజన్మ కర్మ ఫలం అని చెప్పేవారు. ఆనాటి మూలవాసి ప్రజలు బ్రాహ్మణ పురోహితుల మాటలకు ఎదురు ప్రశ్నించేవారు. దేవుడు ఒకరిని గొప్పవారిగా, మరొకరిని తక్కువవారిగా ఎట్లా పుట్టిస్తాడని నిలదీసిన ప్రజల నిందారోపణ నుంచి దేవుణ్ణి రక్షించడానికి ఉపనిషత్తుల కాలంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని కల్పించారు. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడెందుకయ్యాడంటే అతడు గత జన్మలో దానం-పుణ్యం చేశాడన్నమాట. సమాజాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పునర్జన్మ పేరిట హిందు మతం ప్రయోగించినంత గట్టి ఆయుధాన్ని ఏ మతమూ ప్రయోగించలేదు. స్వర్గాన్ని ఒక సుఖదాయకమైన సామంత కుటుంబంగా చిత్రించారు.. వైకుంఠం ఒక రాణివాసం లాగా, ఎప్పటికీ మురికిపట్టని సుందర వస్త్రాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, పుష్పాలు- సుగంధాలను వెదజల్లే శరీరం,, నృత్యం, గానం, అప్సరసలు వంటి స్వర్గ భావనలన్నీ కూడా ఆనాటి చంద్రగుప్త విక్రమాదిత్యుని రాణివాసపు చిత్రాలుగా భావిస్తునారు కొందరు.
రామానుజుని వైకుంఠం గద్యం చదివితే- అది ఒక చక్కని భాషలో భయకంపితుడైన ఆస్థాన కవి రాసిందే అనిపిస్తుంది. అది హర్షర్థనుని లేదా రాజేంద్ర చోళుని అంత:పుర వర్ణన మాత్రమే అని ప్రముఖ చరిత్రకారులు రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంటారు. బౌద్ధుల నిర్వాణం, జైనుల శిద్ధిశిల దేవలోకం కంటే చాలా ఉన్నతమైనవే అయినప్పటికీ వారుకూడా దేవలోకాన్ని కాదనలేకపోయారు. వారి దేవలోకంలో క్రీ.శ5, 6 శతాబ్దాల సామంతరాజుల సుఖభోగ వర్ణన ఉంది. ఇక మిగతా మతాలలో పేర్కొన్న వర్ణనలూ ఆయా స్థలకాలోల్లో ఉన్న పాలకుల వైభోగాన్ని పతిబింబించేవిగానే చెప్పుకోవచ్చు.
ఈ ఉదాహరణలన్నింటినీ చూసినప్పుడు స్వర్గం, నరకం వంటివి అభూతకల్పనలే అని అర్థమవుతుంది. నిజానికి మనిషి ఈ భూమ్మీద సుఖంగా, ఆనందంగా బతికినన్ని రోజులూ స్వర్గమే. లేని స్వర్గం, నరకం మాయలో పడి మనిషి తన ఆలోచనాశక్తిని కోల్పోతున్నాడు. ఏవిషయాన్నయినా శాస్త్రీయ దృక్పథంతో అవగాహన చేసుకోవాలి తప్ప గుడ్డిగా మూఢంగా విశ్వసించకూడదు. వేల ఏండ్లుగా మనిషికి పూర్వజన్మ, పునర్జన్మ ఉన్నాయని చెప్పే మతాలు మనిషికి ఉన్న జీవితాన్ని ఒక క్షణకాలమైనా పెంచగలిగాయా? మనిషిని చావు నుండి, రోగాల నుండి ఏ దేవుడు కాపాడలేదు. సైన్స్‌ మాత్రం రోగాలకు మందు కనుక్కొని మన జీవిత కాలాన్ని రెండింతలు చేసింది. మనిషికి ఉన్నది ఒక్కటే జన్మ. పునర్జన్మంటూ ఏదీ లేదు. ఏ జీవి అయినా చనిపోయాక ఈ మట్టిలో మట్టిగా కలిసిపోవలసిందే. ఆనాటి మానవుని మేధస్సు అంతవరకే పరిమితం కనుక దానికి తగ్గట్టే ఆనాటి భావజాలం ఉంది. నేడు మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే నేటి మనిషి భావజాలం ఉండాలి. కానీ మన దేశంలో పాతకాలపు మనిషి నమ్మకాలను పెంచి పోషించి ప్రజలను ఇంకా మూఢత్వంలోనే ఉంచే స్వార్థపు వ్యవస్థ తయారయింది. ప్రజలు ఎంత మూఢులుగా ఉంటే ఈ వ్యవస్థకు అంత రాబడి వస్తుందన్నమాట!

స్వర్గం, నరకం కల్పిత లోకాలు మాత్రమే!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'కిడ్నీస్‌ ఆఫ్‌ ది ల్యాండ్‌ స్కేప్‌' అని ఎలాంటి భూములను అంటారు?
ఓ లింగా.. ఓ లింగా..!
ప్రచారంలో రకరకాల కథలు
మహాత్మా రావణ మైదానం
భావ సంఘర్షణకు ప్రతీక ఎల్లమ్మ కథ
చారిత్రక ఆవశేషాల మాలిక బాసరబాసర
దక్కన్‌ చరిత్ర, సంస్కృతులసై అంతర్జాతీయ సదస్సు
చరిత్ర, సంస్కృతులు ఉమ్మడి ఆస్తులు
ఇదో అద్భుత అంకం
మళ్లీ ఊపందుకుంటున్న జోగిని ఆచారం
బహమాస్‌ సంస్కృతి
ప్రాచీన మార్గాల్లోనే కొత్త రహదారులా!
చెక్క భజన కళారూపం
భయం, విస్మయం, చాతుర్యం కలిస్తే... కాటిపాపలు
అలనాటి గ్రామ న్యాయాధికారి
బంగారాన్ని తయారుచేయాలని...
యుద్ధం తెచ్చిన పరివర్తనతో...
దీవనార్తి నుంచి భాగోతాల వరకు...
జ్యోతి నృత్యం
గోత్రాలవారు ఎవరు?
డబ్బు, అధికారం చేతుల్లో కళ
అనుకరణలు
కుక్కమాంసానికి ఓ ఫెస్టివల్‌
అందాన్ని పెంచుకుంటూ...
నృత్యం అనాది నుండి కొనసాగుతున్న ఒక సహజాతం
రుద్రదమనుని జునాగఢ్‌ శాసనం
హైబ్రీడ్‌ సంస్కృతి సృష్టే ప్రపంచీకరణ లక్ష్యం
కత్తుల నృత్యం
సపాదలక్ష దేశం ఇప్పుడెక్కడున్నది?
వేదాలు లోపాలకు అతీతం కాదని...
Sundarayya

Top Stories Now

veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు

_

తాజా వార్తలు

10:14 AM

వరల్డ్ కప్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కపిల్‌ కామెంట్స్

10:12 AM

నాలుగురు ప్యానెల్ స్పీకర్లు వీరే..

10:09 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

09:42 AM

విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ

09:25 AM

రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి

09:21 AM

నగరంలో ముదిరిన ఎండలు..

09:17 AM

నకిలీ వెబ్‌సైట్‌తో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

09:14 AM

స్విగ్గీ చేతికి భారత ఉబర్‌ ఈట్స్ విభాగం..?

09:09 AM

జగన్‌పై దాడి కేసు గోప్య విచారణకు ఆదేశం

09:06 AM

భారత్, పాక్‌ మధ్య సంబంధాలు మరీ దారుణం: ట్రంప్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.