Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైలు ఎలా వెళ్ళుతుంది అనగానే.. పట్టాలపై వెళ్లుతుంది అని ఠక్కున ఎవరైనా చెబుతారు. కానీ, జర్మినీలోని ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ రైలు గురించి తెలిసిన వారు మాత్రం పట్టాల కింద కూడా వెళ్లుతుంది అని చెబుతారు. రైలు పట్టాలకు వేలాడుతూ పయఁంచే ఈ అద్భుత నిర్మాణం జర్మన్‌లో ఉంది. ఉత్తర జర్మనీలోని రైన్-వెస్ట్ఫాలియాలోఁ ఉప్పర్ నగరం తిరుగుతూ.. ప్రయాణికులను గమ్యస్థానాలకఁ చేర్చుతుంది. ఈ వేలాడే రైలు పూర్తి పేరు ''ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ రైల్వే (సస్పెన్షన్ రైల్వే) విద్యుత్ చార్జింగ్‌తో నడిచే రైల్వే సిస్టం ఇది. దీఁకి 1897లో శంకుస్థాపన జరిగి 1903 నాటికి పూర్తి అయ్యింది. ఈ వేలాడే రైలులో ఏటా ప్రయాణించే వారి సంఖ్య 25 మిలియన్లు అంటే అతిశయోక్తి కాదు. కేవలం ఈ రైలులో ప్రయాణించడానికే అనేక మంది పర్యాటకులు జర్మన్ వెళ్లుతారట. సుమారు 12 మీటర్ల ఎత్తులో ఉండే ఈ రైల్వే ట్రాక్ 13.3 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం ఇరవై రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సుమారు మూడు కిలోమీటర్ల వరకు లోయ పై నుంచి ప్రయాణం సాగుతుంది.
1824లో ఇంగ్లండ్‌కు చెందిన హెన్రీ రాబిన్సన్ పాల్మెర్ విభిన్నంగా ఉండే ఒక రైల్వే వ్యవస్థ రూపొందించారు. ఈ నూతన నిర్మాణం నచ్చిన సస్పెన్షన్ రైల్వే సంస్థ దీనిని నిర్మాణానికి ముందుకు వచ్చింది. స్థానికులకు అందుబాటులో ఉన్న ఈ రైల్వే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ రైల్వేను ప్రపంచ యుద్ధం సమయంలో తీవ్ర నష్టం కారణంగా మూసివేశారు. 1946లో కాస్త ఆధునికరించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొవచ్చారు.
ఏప్రిల్ 12, 1999 న రాబర్ట్ డ్యామ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో రైలు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణిం చగా, 49 మంది గాయపడ్డారు. మూడు రోజుల్లోనే ట్రాక్‌ను పునరుర్ధరించారు. కోల్ పరిశ్రమల వెంట, ఉప్పర్ వ్యాలీ చుట్టూ ఉంటే ఈ రైల్వే ట్రాక్ 486 ఫిల్లర్స్ మీదుగా నిర్మించబడింది. ఈ రైల్వేలో ప్రతిరోజూ సగటున ఎనబైరెండు వేల మంది ప్రయాణిస్తారు. 24 మీటర్ల పొడవు ఉండే రెండు బోగీల సముదాయంగా ఈ రైలు ఉంటుంది. నాలుగు డోర్స్ గల ప్రతి క్యాబిన్‌లో 48 మంది కూర్చోనేందుకు వీలుగా సీట్లు, 130మంది నిలబడే వీలు ఉంటుంది. ఈ రైలులో ప్రయాణం వింత అనుభవంగా పర్యాకులు అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఉప్పర్ వ్యాలీపై నుంచి వెళ్లుతూ.. లోయ అందాలను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందంటారు.