Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొల్లపెల్లి : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మండలంలోని పలు కళాశాలలు, పాఠశాలలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా విద్యా సంస్థల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గంగాధర : మండలంలోని మ్యాల కొండన్న పల్లె గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మను ఆడి తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలను ప్రతిబింబింపజేశారు. మండల కేంద్రంలోని సురభి, వివేకానంద పాఠశాలల్లో విద్యార్థులు రంగురంగుల పూలతో రంగులు అద్ది ఎంతో అందంగా బతుకమ్మను పేర్చి పాఠశాలల ఆవరణలో పెట్టి ఆటాపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఆదర్శ పాఠశాలకు జెడ్పీటీసీ ఆకుల శ్రీలత, సర్పంచి ఉప్పుల అంజలి, గర్షకుర్తి సర్పంచి కల్వకోట కవితాదేవి, రంగరావుపల్లి సర్పంచి బండ అన్నపూర్ణ, రవీందర్,ల పాఠశాల ప్రిన్సిపాల్ బల్జీర్‌కౌర్, ఉపాధ్యాయులు సురభి, వివేకానంద పాఠశాలలో ప్రిన్సిపపాళ్లు వీరేశం, నర్సయ్య, లక్ష్మారెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.
జమ్మికుంట : పట్టణంలోని పలు పాఠశాలలు ,కళాశాలల్లో శుక్రవారం ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వొక్సోపాప్, రామకృష్ణ, ఎస్వీ, న్యూమిలీనియం, ట్రినిటి, గార్డియన్, ఏకశిల, ఆదిత్య, కాకతీయ, జయభారతి లోటస్‌పాండ్ పాఠశాలల్లో పాఠశాల ఆవరణంలో బతుకమ్మ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆనందింపజేసాయి. కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల కరస్పాడెంట్లు రమణారెడ్డి, ఆవిర్నేని సుధాకర్‌రావు, ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ పుల్లూరి సంపత్‌రావు, ఏబూషి శ్రీనివాస్, ముసిపట్ల తిరుపతిరెడ్డి, మల్లాడి మల్లారెడ్డి, రావుల తిరుపతి, మల్లేషం, కృష్ణారెడ్డి, రమేష్ పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
విస్‌డమ్ కళాశాలలో స్థానిక విస్‌డమ్ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజేందర్‌రెడ్డి, ఛైర్మన్ దబ్బెట రవీందర్, వైస్‌ఛైర్మన్ బండి ప్రభాకర్, ,కరస్పాండెంట్ మల్లాడి మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి కిషన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కోహెడ : మండలంలోని చెంచల్‌చర్వుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. పాఠశాలలకు త్రైమాసిక పరీక్షలు ముగియడంతో చివరిరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బి.శంకర్, తిరుపతి, జాగృతి ఉపాధ్యాక్షుడు అక్కెనపల్లి రవిందర్, భుక్య రవిందర్, శ్రీనివాస్, శంకరయ్య, మల్లేషం, వెంకటేశ్వర్లు, సర్పంచ్ మల్లారెడ్డి ఉన్నారు.
తిమ్మాపూర్ : మండలంలోని రామకృష్ణకాలనీలోని ఉన్నత ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జెడ్‌పిటిసి ఉల్లెంగుల పద్మ ఎంపిపి బూడిద ప్రేమలత పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పండుగలను విస్మరించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటిలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యమ్రంలో ఎంపిడీఓ కిషన్ స్వామి, ప్రధానోపాధ్యాయులు కోల రామచంద్రారెడ్డి, వివిధ గ్రామల సర్పంచ్‌లు,ఎంపిటీసీలు పాల్గొన్నారు.
మెట్‌పల్లి : బాలికల వసతి గృహంలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ పద్మవతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతకమ్మ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు.
రాయికల్ : రాయికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. అనంతరం ఊరు చివర చెరులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రంలో ఎంపిపి పడాల పూర్ణిమా తిరుపతి, ఎంఈవో నర్సింహరెడ్డి, ప్రదానోపాద్యాయులు కడార్ల లకీëనర్సయ్య, ఉపాద్యాయులు చెరుకు మాహెశ్వరశర్మ, జ్యోతి, రాజ్యలకీë, వేంకటేష్ తదితరులు పాల్గోన్నారు. అలాగే మండలంలోని అల్లీపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటి వైర్మన్ భాగ్యలకీë ఆద్వర్యంలో బతుకమ్మ సణబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రంలో ప్రదానో పాద్యాయులు మాల్హాల్‌రావుఇ రాజేశ్, చిన్నయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హుస్నాబాద్ : మండలంలోని చౌటపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వాహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు సర్పంచి వెల్ది శోభరాణి రంగారవ్, జనగామ వేణుగోపాల్‌రావు బాహుమతులు అందజేశారు. మొదటి బాహుమతి రూ.500, ద్వితీయ, తృతీయ స్థానాల వారికి మూడువందల రూపాయాలను అందజేశారు. కార్యక్రమంలో ఎచ్‌ఎం ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఎంసి ఛైర్మన్ సంతోష, ఉప సర్పంచి అవుల చిన్న వెంకటయ్య, కుక్కల ఏల్లయ్య, గాదర్ల నాగభూషణం, తిరుమల్‌రావ్,ముక్కర సంపత్ పాల్గొన్నారు.
గోదావరిఖని : రామగుండం జెడ్‌పిటిసి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ గ్రామ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ జనగామ నర్సయ్య, హెచ్‌ఎం జ్యోత్స్నలత, ఉపాధ్యాయురాళ్లు జి.లకీë, టి.నిర్మల, వి.విజయలకీë, జి.మాదవి పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలలో బతుకమ్మ ఆటలు ఆడారు. కళాశాల సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.దాదాసలాం, అధ్యాపకులు మయూరి, ప్రశాంతి, శ్రీదేవి, పద్మ, సంతోషిరాణి, స్వప్న, లకీë, వనజ, స్వాతి, విజయలకీë, తిరుమల పాల్గొన్నారు.
ధర్మారం : మండలకేంద్రంలో పాఠశాలల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటలు ఆడారు. మణికంఠ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధదేవి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ బతుకమ్మ ఆడడం అభినందనీయమన్నారు. బ్రిలియంట్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థినులు రహదారిపై బతుకమ్మ ఆడి కోలాటాలు ఆడారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మంజులత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
కాటారం : మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు దసరా పండుగ సందర్బంగా సెలవులు ప్రకటించడంతో ఉపాధ్యాయనీలు, విద్యార్థినులు బతుకమ్మ ఆట ఆడారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా ప్రకటించడంతో స్థానిక కేంబ్రిడ్జి విద్యాలయం, దన్వాడ జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల, వివేకానంద విద్యాలయం, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ఆదర్శ విద్యాలయంలో ఉపాధ్యాయనీలు, విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు ప్రభావతి, తాటి శ్రీనివాస్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, వల్స వెంకటేశ్వర్లు, జనగామ కార్తీక్‌రావు, కవిత, శ్రావణ్‌రెడ్డి పాల్గొన్నారు.
పెద్దపల్లి : తెలంగాణలో బతుకమ్మ త్యాగాలకు ప్రతిరూపమని ఎంపిపి సందనవేని సునిత అన్నారు. మండలంలోని అప్పన్నపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపిపి పాల్గొని మాట్లాడారు. వేడుకల్లో ఎంఇఓ హన్మంతు, నాయకులు సందనవేన రాజేందర్, మాటూరి దుర్గయ్య, బత్తిని లక్ష్మయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
పట్టణంలోని పాఠశాలల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థినులు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మలను తయారుచేసి ఆయా పాఠశాలల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రావూస్, స్మాట్‌కిడ్, జెడ్‌పిహెచ్‌ఎస్‌లో విద్యార్థినులు బతుకమ్మ ఆటలతో అలరించారు.