Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగిత్యాల టౌన్
పట్టణంలోని పావని కంటి ఆస్పత్రిలో ఆదివారం రోటరీ, ఆపి క్లబ్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ సంజరుకుమార్ ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. జగిత్యాల, రాయికల్, సారంగాపూర్, మల్యాల, గొల్లపెల్లి, మేడిపెల్లి, బీర్‌పూర్ మండలాలకు చెందిన 26 మందికి నేత్ర శస్త్రచికిత్సలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో టీవీ సూర్యం, ఆపి కోశాధికారి కాశిరావు, కొత్త ప్రతాప్, గుట్రాజెపల్లె మాజీ సర్పంచ్ బలముకుందాం, నక్కలా రవీందర్‌రెడ్డి, డాక్టర్ విజరు కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.