Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోనరావుపేట
వర్గీకరణ బిల్లును వెంటనే అమలు చేయాలని మాదిగ విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్ అన్నారు. మండలకేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన్యశ్రీ కాశీరాం గారి ఆలోచన విధానంతో రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలన్నారు. డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వం బలపరుస్తూ ఎస్సీ వర్గీకరణను సాధించుకోవాలన్నారు. 180 రోజుల్లో వర్గీకరణ అన్న బీజేపీ ఇంతవరకు వర్గీకరణ గురించి నోరెత్తడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని భూస్థాపితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌జేఏసీ మండలాధ్యక్షుడు తాటకర్ల భాస్కర్, సిరిపాక అశోక్, బడుగు బాబు, బడుగు కరుణాకర్, తాటకర్ల శాంతికుమార్, జోసెఫ్, నవీన్, బొల్లె బాబు, బొల్లె రాజేషం, శ్రీనివాస్ పాల్గొన్నారు.