Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగిత్యాల జిల్లా వైద్యాధికారిపుప్పాల శ్రీధర్
బుగ్గారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ సూచించారు. మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 37 మంది విద్యార్థులను పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఏ.రాజేశం, హెల్త్ సూపర్‌వైజర్ ఎండీ సిద్ధిక్, హాస్టల్ వార్డెన్ మహేందర్ రెడ్డి, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల టౌన్ : కోరుట్ల పట్టణంలోని నక్కలగుట్ట కాలనీలో శనివారం ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధిపై రోగులకు అవగాహన కల్పించారు. వ్యాధి గ్రస్తులకు తెమడ పరీక్షలు సేకరించి జగిత్యాల ఆసుపత్రిలోని ల్యాబ్‌కు పంపించారు. కార్యక్రమంలో ఆర్‌ఎన్‌టీసీపీ సిబ్బంది ఇమ్రాన్, రియాజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పెగడపల్లి: ల్యాగలమర్రి గ్రామంలో శనివారం మండల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ బాలే సుధాకర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎంపీటీసీ మందపల్లి అంజయ్య, సర్పంచ్ ఉమ్మెంతల వనజ, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, హెల్త్ అసిస్టెం ట్స్ ప్రదీప్, అశోక్ , శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.