Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథలాపూర్ : చివరి గింజ వరకూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మెన్ లోక బాపురెడ్డి అన్నారు. మండలంలోని పెగ్గెర్ల, కలికోట, తాండ్రియాల, బొమ్మెన గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మెన్ లోక బాపురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్నీ అమ్ముకొని మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు.
జగిత్యాల టౌన్: జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని శనివారం జగిత్యాల ఎంపీపీ మ్యాదరి వనిత ప్రారంభించారు. వైస్ ఎంపీపీ లక్ష్మీ, సర్పంచ్ జయ, ఏపీఎం రజిత, ఏఈఓ రాకేష్, సీసీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి: మండలంలోని కొస్నూర్‌పల్లె, జైన గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. శనివారం జైన సహకార సంఘం అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో 66వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మగ్గిడి స్కూల్లో 6 గ్రామాల పరిధిలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. జైన సహకార సంఘం సీఈఓ బలమురి సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.