Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగిత్యాల టౌన్: ఇంటర్మీడియట్ మార్చి 2019 పరీక్షలకు సంబంధించి ఫెయిల్ అయిన విద్యార్థులు లేదా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు డబ్బు చెల్లించిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఈ ఫీని వాపస్ చెల్లించుటకు నిర్ణయించింది. చెల్లించిన ఫీజును జిల్లా ఇంటర్మీడియట్ అధికారుల ద్వారా తిరిగి ఇచ్చుటకు నిర్ణయించినట్టు జగిత్యాల ఇంటర్ విద్య నోడల్ అధికారి బి.నారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్ టికెట్/మెమో జిరాక్స్, ఫీ చెల్లించిన రశీదు, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలను నోడల్ ఆఫీస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, (బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో) జగిత్యాలకి అందజేయాలని, తర్వాత వారి అకౌంట్‌లోకి డబ్బులు మార్పిడి చేయగలమని తెలిపారు.