నవతెలంగాణ-సిరిసిల్ల : నిత్య జీవితంలో వైజ్ఞా నిక స్పృహ అవసరమని జిల్లా సైన్స్ అధికారి వంతడుపుల ఆంజనేయులు అన్నారు. జనవిజ్ఞా న వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా గురువా రం మండల స్థాయి పరీక్షను పట్టణంలోని గవ ర్నమెంట్ హైస్కూల్లో నిర్వహించారు. అనంత రం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా సైన్స్ అధికారి వంతడుపుల ఆంజనేయులు బహుతు లు ప్రదానం చేసి, సర్టిఫికెట్లు ఇచ్చారు. అనంత రం జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సంప తి రమేష్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో నిర్వహించిన పరీక్షలకు వెయ్యి మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. సమావే శంలో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మార్వాడి గంగరాజు, కనకయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాకాల శంకర్‌గౌడ్, వసంత కుమారి పాల్గొన్నారు.
తంగళ్లపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ పా ఠశాలలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టెస్ట్‌లో మండలంలోని పది పాఠశాలలకు చెందిన విద్యా ర్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు.
వీర్నపల్లి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ప్రతిభ కనబరి చిన విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్టు ఇన్‌చార్జి హెచ్‌ఎం లక్ష్మీనారాయణ తెలిపారు.
చందుర్తి : చెకుముకి విజ్ఞాన పరీక్షలు నిర్వహిం చడం అభినందనీయమని ఎస్‌ఐ సునీల్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ పాఠశాలలో చెకుముకి పరీక్షల్లో ప్రతిభ కనబరి చిన విద్యార్థులను ఎంపిక చేశారు. జనవిజ్ఞాన జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ పీజీ హెచ్‌ఎం తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Authorization