నవతెలంగాణ-జగిత్యాల టౌన్
జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద చోరీ చేసిన నగలు, చోరీ చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన మొబైల్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో నిందితుని వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల కథనం ప్రకారం.. మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన బోదాసు మహేశ్ గతంలోనూ అనేక నేరాల్లో నిందితుడు. దొంగతనాలకు అలవాటు పడి ఇదే వత్తిగా మార్చుకున్నాడు. తెలిపారు. మహేష్‌పై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లోను పలు కేసులు నమోదై ఉన్నాయి. గతంలో దొంగతనాలకు సంబంధించి రెండున్నర తులాల బంగారు నగను, ఒక గ్లామర్ వాహనాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. మహేష్ గతంలో ఆస్తికి సంబంధించిన నేరాలు ఉన్నందున కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారని వివరించారు. జగిత్యాల పట్టణంలోని వరుస దొంగతనాల కేసులో విచారణ జరుపుతున్న క్రమంలో బుధవారం జగిత్యాల పట్టణంలోని టవర్ ప్రాంతంలో మహేశ్‌ను అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేయగా వరస దొంగతనాల నిందితుడు మహేష్ అని గుర్తించినట్టు అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
దొంగతనం కేసులో వ్యక్తికి జైలు శిక్ష
లీగల్: దొంగతనం కేసులో ఓ వ్యక్తికి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ప్రదీప్ తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. రేకుర్తి గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి 7 జులై 2019న మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట నిలిపి స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి దగ్గరలో సెంట్రింగ్ పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన మాడవిదలై ద్విచక్ర వాహనం, ఇంట్లో ఉన్న జియో ఫోనును తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనపై హనుమంతరెడ్డి కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాద చేశాడు. మొదటి అదనపు మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ప్రదీప్ కేసు పూర్తి విచారణ అనంతరం నిందితుడికి రెండేండ్ల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Authorization