నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
కరీంనగర్ కమిషనరేట్‌లో చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం మంత్వ్రశాఖ ఈ ఫలితాలను ప్రకటించింది. పోలీసులు అన్నివర్గాల ప్రజలకు రక్షణ, భద్రత చర్యలు కల్పించడంతో పాటు అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించడం, నేరాల నియంత్రణ, ఛేదనలో తనకంటూ ఒకప్రత్యేకశైలిని కొసాగిస్తూ ముందుకు సాగుతున్న కరీంనగర్ కమిషనరేట్‌లో చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశంలో 08వస్థానం సాధించింది.
దేశవ్యాప్తంగా 15 వేల 666 పోలీస్‌స్టేషనల్‌లలో దేశంలో 77 పోలీస్టేషన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 77లో రాష్ట్రంలో 3వ స్థానం పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి ఎంపికై దేశవ్యాప్తంగా పోటీకి అర్హత సాధించింది. ఢిల్లీ నుంచి పోలీస్‌స్టేషన్లకు వచ్చిన బృందం పోలీసులు ప్రోయాక్టివ్, రియాక్టివ్ చర్యలను పరిగణించడం, టెక్నాలజీ వినియోగంతోపాటు సౌకర్యాలు, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకోవడంతోపాటు ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించారు. ప్రజల రక్షణ, భద్రతలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, పీడీయాక్ట్ అమలుతో రెండోస్థానం సాధించిన కరీంనగర్ కమిషనరేట్ తాజాగా చొప్పదండి పోలీస్‌స్టేషన్ దేశంలో 8 వస్థానం సాధించి నూతనోత్సాహంతో ముందుకుసాగుతున్నది. అన్నివర్గాల ప్రజల సహకారంతో ఇది సాధ్యమైందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Authorization