నవతెలంగాణ-చొప్పదండి అకాల వర్షంతో తడిసిన ప్రతి ధాన్యం గింజనూ చివరి వరకు కొనుగోలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాగంపేట, అర్నకొండ గ్రామాలలోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షం లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చూపెట్టిన ఉత్సాహం కొనుగోళ్లలో ఎందుకు లేదని ప్రశ్నించారు. 15 రోజులైనా ధాన్యం కొనుగోళ్లలే ఏమాత్రమూ శ్రద్ధ చూపడం లేదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప శ్రీనివాసరెడ్డి. ఎంపీటీసీ సింగిరెడ్డి కష్ణారెడ్డి. పట్టణాధ్యక్షుడు ముద్దం తిరుపతి గౌడ్. కౌన్సిలర్ కొట్టే అశోక్. భీమయ్య. దొంతి రాజయ్య. సోమి డి శ్రీనివాస్ పాల్గొన్నారు.b