నవతెలంగాణ - కరీంనగర్‌టౌన్
కరీం'నగర్'లోని శర్మనగర్‌ను పోలీసులు దిగ్బంధించారు. ఆ ప్రాంతంలో కరోనా పాజిటీవ్ తేలడంతో మరింత అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంత ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, వారికి అవసరమైన అన్ని రకాల నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు. శర్మనగర్ పాజిటీవ్ వచ్చిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. స్వచ్ఛందం గా వారే ముందుకు రావాలని కూడా అధికారులు కోరుతు న్నారు. అనుమానుతులను గుర్తించి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శశాంక కూడా ప్రత్యేక దృష్టిసారించారు. నగర మేయర్ సునిల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి ఆ ప్రాంతంలో సోమవారం పర్యటించారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ప్రయివేటు వైద్యశాలలో తప్పని సరిగా వైద్య సేవలు అందించి వారి వివరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. నియంత్ర త ప్రాంతాలలోని ప్రజలు తప్పని సరిగా ఇండ్లలోనే ఉండాలని కోరారు. వారికి నేరుగా ప్రభుత్వ సిబ్బందే అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తారని చెప్పారు. ఈ పర్యటన లో వారి వెంట కార్పొరేటర్ మొండి శ్రీలత, చంద్రశేఖర్, అర్బన్ తహశీల్దార్ వెంకట్ రెడ్డి, పోలీస్ అధికా రులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఫోన్‌కాల్‌కూ పోలీసులు స్పందించాలి
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి
కరోనా వైరస్‌కు సంబంధించి వచ్చే ప్రతి ఫోన్‌కాల్‌కూ స్పందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి కమిషనరేట్‌లోని వివిధ స్థాయిలకు చెందిన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌నకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే వైద్యబృందా లకు సమాచారం అందించి, సమన్వయంతో సత్వరం సేవలందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం నాడు కమిషనరేట్ కేంద్రంలో నేరసమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులు అందించే సూచనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారకార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కూరగాయల మార్కెట్లు, చికెన్,మటన్,చేపల, సూపర్ మార్కెట్ల వద్ద జనం గుంపులుగా జమకూడి ఉండకుండా భౌతికదూరం పాటించడం, వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగం గా మాస్కుల ను ధరించడం ప్రతిపౌరురని బాధ్యతగా చెప్పాలని తెలి పారు. లాక్‌డౌన్, కర్ఫ్యూలను కఠినతరంగా అమలు చేయా లని ఆదేశించారు. అకారణంగా రోడ్లపైకి వచ్చే వారికి సంబంధించిన వాహనాలను సీజ్‌చేసి జరిమా నాలు విధించాలని చెప్పారు. నిబంధనలు ఉల్ల ఘించే వారి పై తీసుకునే చర్యలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రేయింబవళ్ళు ప్రజలకు సేవలందించేందుకు మానసి కంగా, శారీరకంగా సంసిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
నేరస్తుల సమాచారంపై పుస్తకం ఆవిష్కరణ
కరీంనగర్ కమిషనరేట్‌లో వివిధ నేరాలకు పాల్పడిన నేరస్థుల వివరాలతో క్రైంకంట్రోల్‌స్టేషన్(సిసిఎస్) పోలీసులు 'నో యువర్ క్రిమినల్స్-2020' పేరిట రూపొం దించిన పుస్తకాన్ని సోమవారం పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో స్నాచింగ్, అలవాటుపడిన నేరస్తులు(హెచ్‌బి), దృష్టి మరల్చినేరాలకు పాల్పడేవారు, ఎటియం దొంగతనాలు, ఆటోమోబైల్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడేవారు, సాధారణ దొంగతనాలు, జేబుదొంగలు, షటర్ లిఫ్టింగ్ (బీహార్ గ్యాంగ్), కరుడుగట్టిన నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై అమల్లో ఉన్న పిడియాక్ట్ తో జైల్లోఉన్న నేరస్థుల వివరాలను వివిధ విభాగాలుగా విభజించారు. సీపీఎస్ పోలీసులు కరీంనగర్ కమిషనరేట్ ఏర్పాటు తర్వాత మొట్టమొదటగా నేరస్తుల వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. జిల్లాలోని ఎస్‌ఐ ఆపైస్థాయి అధికారులందరికీ ఈ పుస్తకాలను అందించనున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ పుస్తకంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అవగతం చేసుకున్నట్టయితే నేరం జరిగిన తీరు, ఇలాంటి నేరాలకు పాల్పడే నేరస్తులపై ఒక నిర్ణయా నికి వచ్చి ఆ దిశగా కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు దోహద పడుతుందని అన్నారు. కార్యక్రమంలో అడి షనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్(ఎల్‌అండ్‌ఓ), జి చంద్ర మోహన్ (పరిపాలన), ఎసిపిలు పి.అశోక్, విజయసారధి, మదన్‌లాల్, శ్రీని వాస్, ఎస్ శ్రీనివాసరావు, సోమనాథం, శంకర్‌రాజు, ఎస్‌బిఐ ఇంద్రసేనారెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Authorization