- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
- మల్లాపూర్ మండలంలో పర్యటన
- అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకుల యత్నం
నవతెలంగాణ-మల్లాపూర్
రైతుల వద్ద తాలు, హమాలీల పేరుతో రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది రైతుల వద్ద 1శాతం తరుగు తీస్తే ఈ ఏడాది 5-6శాతం తరుగు పేరుతో కోత విధించి మోసగిస్తున్నారని వాపోయారు. రైతుల వద్ద హమాలీల పేరుతో 26-32రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని, రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వమే డబ్బులు పూర్తి స్థాయిలో కేటాయించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే, తరుగు పేరుతో రైతులను మోసగిస్తుందని ఆరోపించారు. అధికారులు, మిల్లర్లు కలిసి మోసగిస్తున్నారు. అనంతరం ధాన్యం కుప్పలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాజోజి భాస్కర్, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జేఎన్.వెంకట్, మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణ, నాయకులు ముత్యాల చంద్రశేఖర్, శ్రీనివాస్, రాజేందర్, లకిë, తిరుపతి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో టీఆర్‌ఎస్ నాయకులు
పసుపు బోర్డుపై మాట మార్చి మండల పర్యటనకు వస్తున్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ముత్యంపేటకు తరలివెళ్తుండగా పోలీసులు మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ రవికుమార్, ఎస్‌ఐ రవీందర్ వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ ఎంపీ అర్వింద్ మాట్లాడుతుండగా పసుపు బోర్డుపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని టీఆర్‌ఎస్ నాయకులు కాటిపెల్లి ఆదిరెడ్డి, ముద్దం శరత్‌గౌడ్ నినాదాలు చేశారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరలించిన వారిలో జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డీలర్ మల్లయ్య, కొమ్ముల జీవన్, చిట్యాల లకëణ్, క్యాతం సురేష్, తక్కళ్ల నరేష్ రెడ్డి, గౌర్ నాగేష్ తదితరులున్నారు.
Authorization