నవతెలంగాణ-కోల్‌సిటీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంతర్గాం మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్సు సీఐ రాజ్‌కుమార్ తన సిబ్బందితో కలిసి అంతర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. డ్రైవర్లు సతీష్, స్వామి, శేఖర్‌లను అదుపులోకి తీసుకుని ట్రాక్టర్లను అంతర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ముస్తాబాద్ : మండలంలోని మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం ఉదయం ఎస్సై లక్ష్మారెడ్డి పట్టుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఇసుకకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.