- మిల్లర్లు రైతులపై పెత్తనం చేయడం తగదు
- పట్టభద్రుల ఎమ్మెల్సీ
జీవన్‌రెడ్డి డిమాండ్
నవతెలంగాణ-జగిత్యాల టౌన్
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఆయన స్వగహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్ప తాలు నెపంతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, వరిధాన్యాన్ని భారత ఆహార సంస్థకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు రైతులను డామినేషన్ చేస్తున్నారనీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలులో మినహాయింపులన్నీ 16శాతం మాత్రమే ఉందని ఆయన వివరించారు. అధికారులు రైస్ మిల్లర్లను అదుపు చేయలేక రైతులను మోసం చేస్తున్నారని, ఏ విధమైన అదనపు తూకం లేకుండా కొనుగోలు జరపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనిసూచించారు. మిల్లర్లకు ధాన్యం విషయంలో ఏమైనా మినహాయింపు కావాలంటే ప్రభుత్వానికి విన్నవించుకోవాలి తప్ప రైతులను మోసగించొద్దని ఆయన హితవు పలికారు. పసుపునకు కనీసం రూ.7వేల మద్దతు ధర కల్పించి మార్క్‌ఫెడ్ ధ్యారా కొనుగోలు చేసి పసుపు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పాల్గొన్నారు.
Authorization