- నగర మేయర్ సునిల్‌రావు
- 31వ వార్డులో పర్యటన
కరీంనగర్ టౌన్: వర్షకాలం వచ్చేలోపు డ్రయినేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, దీనికి గాను తగిన చర్యలు చేపట్టాలని నగర మేయర్ సునిల్ రావు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా 31వ డివిజన్‌లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పూర్తిచేయాల్సిన పనులను గుర్తించారు. డివిజన్‌లో ప్రజారోగ్య శాఖ ఆద్వర్యంలో రూ.4 కోట్లతో నిర్మింస్తున్న మురుగు నీటి కాలువ ( స్టాం వాటర్ డ్రైన్) పనులను సందర్శించారు. అనంతరం కాంట్రాక్టర్, సూపర్‌వైజర్లతో మాట్లాడుతూ మురుగు నీటి కాలువ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాం వాటర్ డ్రైన్ నిర్మాణంకు సంబంధించి పొడవు, వెడల్పు, ఎత్తు , లెవల్స్ వివరాలను అడిగి తెలుసుకొని, స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్, సూపర్ వైజర్‌కు సలహాలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాం వాటర్ డ్రయినేజీ ప్రారంభం నుంచి చివరి వరకు సరైన లెవల్స్ పాటించి నిర్మించాలన్నారు. వర్షకాలం లో వరద నీరు వచ్చినప్పుడు చిన్న చిన్న డ్రైన్‌లు కలిసే చోట బ్యాక్‌వాటర్ వెళ్లకుండా ఇప్పుడే జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. స్టాం వాటర్ డ్రయినేజీ నిర్మాణ పనులపై ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు.కార్పోరేటర్ లెక్కల స్వప్నవేణు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, కాంట్రాక్టర్లు ఉన్నారు.
సీఎం కేసీఆర్ కరోనా కష్టకాలంలో
పేదవాడి ఆకలిని తీర్చారు
కరోనా కష్టకాలంలో ప్రతి పేదవాడి ఆకలిని సీఎం కేసీఆర్ తీర్చారని నగర మేయర్ సునిల్‌రావు అన్నారు. నగరంలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న 33వ డివిజన్ భగత్‌నగర్ పోలీస్‌క్వాటర్స్‌లో రేషన్‌కార్డు లేని పేదలకు మంగళవారం బియ్యం పంపిణీ చేశారు. మే 31 వరకు నాలుగో విడత లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలన్నారు. రేషన్ కార్డు ఉన్న అందరికీ రెండు నెలలు ప్రతి ఒక్కరికి 12 కిలో చొప్పున బియ్యం, కార్డుకు రూ.1500 అందజే శామని అన్నారు. త్వరలో రేషన్ కార్డు లేని పేదలకు త్వరలో కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Authorization