Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మైత్రీవనం | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Nov 28,2020

మైత్రీవనం

ఊరిలో ప్రతి సమస్యను తన సమస్యగానే భావించి అవి తీర్చడానికి పూనుకున్న వ్యక్తి మోహనరంగా. చీకటి బతుకుల్లో వెలుగులు నింపే ఆయుధం చదువని బలంగా నమ్మినవాడు. ఉద్యోగం చేస్తే తానొక్కడే బాగుపడతాడని, చదువుకున్న విజ్ఞానంతో నిరక్షరాస్యుల పక్కన నిలబడితే ఊరే బాగుపడుతుందని ధైర్యంగా నిలబడినవాడు. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలున్నట్లే నలుగురి కోసం పాటుపడే వాడికి ఎదురుదెబ్బలు సహజమే!
రంగాను ఎవరో కొట్టారని, ఆస్పత్రిలో చేర్పించారని, ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడన్న విషయం అతని స్నేహితుడైన విజయ్ కు ఫోన్‌ చేసి చెప్పాడు శోభన్‌. దాంతో కంగారుగా లాప్‌టాప్‌లో చేస్తున్న పనిని ఆపేసి బయలుదేరాడు విజయ్.
''ఎవర్రా ఫోను! ఏమైంది?'' గాభరాగా అడిగాడు పరమేశ్వరరావు.
''శోభన్‌ ఫోన్‌ చేశాడు నాన్నా.. రంగానెవరో కొట్టారంట.. ఆస్పత్రికెళ్తున్నాం.. వాణ్ణి కొట్టాల్సిన అవసరం ఎవరికొచ్చిందో..''బట్టలు మార్చుకుంటున్నాడు విజయ్.
''చెప్తే వినేవాడికి చెప్పొచ్చు. రంగాకెన్ని సార్లు చెప్పినా వినలేదు. అందుకే జరిగుంటది. ఏం చేస్తాం, వాడి ఖర్మ...'' గత సంఘటనలేవో గుర్తు చేసుకున్నాడు పరమేశ్వరరావు.
''అంటే... ఎవరో మీకు తెలుసా?'' చొక్కా గుండీలు పెట్టుకుంటూ ఆశ్చర్య పోయాడు విజయ్.
''ఇంకా దేని గురించి ఉంటుందిరా... మనూరి చెరువు గురించే...'' దీర్ఘంగా శ్వాస వదిలాడు పరమేశ్వరరావు.
''మళ్ళా ఏమన్నా గొడవైందా?'' పర్సు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు విజయ్. ''ఆ ఫ్యాక్టరీ వస్తే ఎదురుగానున్న మనూరి చెరువు పాడైపోతుందని ఐదేళ్ళ కిందట కుల పంచాయితీ పెట్టించి గొడవ చేసిన సంగతి నీకు తెల్సు కదా! పెద్దోళ్ళతో మనకెందుకని అందరూ వదిలేసినా రంగా మాత్రం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడంట. మొన్నీ మధ్య తహశీల్దార్‌ ఆఫీసులో కంప్లయిట్‌ చేశాడట. అలా చేస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా?'' తీర్మానించాడు పరమేశ్వరరావు.
''ఊళ్ళో సమస్యలన్నీ వీడికే కావాలి. చెప్తే వినడు. అయినా వాడు కంప్లయిట్‌ ఇచ్చిన సంగతి ఫ్యాక్టరీ వాళ్ళకెలా తెలిసిందో?'' గబగబా చెప్పులు వేసుకున్నాడు విజయ్.
''తెలియకపోవడానికి అదేమన్నా బ్రహ్మ పదార్థమా? మంచిగా పండే పొలాల్ని రైతుల దగ్గర మాయ చేసి కొన్నారు. పంచాయితీ పెద్దలకు, తహశీల్దారుకి డబ్బులు ముట్టజెప్పి ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి తెచ్చుకున్నారు. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినోళ్ళు ఆ మాత్రం విశ్వాసం చూపరా?'' విషయాన్ని తేలికగా పరిష్కరించినట్లు చెప్పింది అతని తల్లి పార్వతి.
''సరే... నేనోసారి కలిసొస్తాను'' అని చెప్పి శోభన్‌తో పాటుగా ఆస్పత్రికి వెళ్ళడానికి ఆటో ఎక్కాడు విజయ్. ప్రాణ స్నేహితుడు రంగా గురించి ఆలోచనలు జోరీగలా తిరగసాగాయి. చాలామంది సమస్యలను తీర్చినట్లే విజరు సమస్యనూ తీర్చాడు మోహనరంగా...
 
పచ్చని పొలాలు ఫ్యాక్టరీకి ఆవాసాలుగా మారబోతు న్నాయని తెలిసి, శంకుస్థాపన చేసే రోజున నిరాహారదీక్షకు దిగాడు మోహనరంగా. తమ పనులకు అపశకునంగా మారిన రంగాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు యాజమాన్యం. అతన్ని పట్టుకుని స్టేషన్‌లో పెట్టారు. విషయం తెలుసుకున్న రంగా తండ్రి నారాయణ, పక్కూరి మునసాబుగారి కాళ్ళావేళ్ళా పడ్డాడు. దాంతో కరిగిన మునసాబు, తన పరపతిని ఉపయోగించి బెయిల్‌ పేపర్స్‌ ఇప్పించాడు. ఎస్‌.ఐ. నాలుగు చివాట్లు పెట్టాక బెయిల్‌ పేపర్స్‌ తీసుకొని రంగాని వదిలిపెట్టాడు.
ఆరోజు సాయంత్రమే చెరువుగట్టు దగ్గర వంతెన మీద కూర్చుని, చెరువు వంకా ఆర్తిగా చూస్తున్నాడు మోహనరంగా. అతని భుజంపై చేయి పడడంతో వెనక్కి తిరిగి చూశాడు.
పక్కనే కూర్చోమని సైగ చేసి, ''చూడరా! నిండు గర్భిణిలా ఉన్న మన సంజీవని ఇక తెల్లారబోతుంది. అట్టాగే మన బతుకులు కూడా...'' రంగా కంటి నుంచి నీరు బయటకు వద్దామా, వద్దా అని ఆలోచిస్తూ కనుకొలకల్లో ఆగిపోయింది.
''ఒరేయ్ రంగా! బలవంతుల ముందు బలహీనులు నెగ్గలేరురా! మనమెంత, మన బతుకెంత!'' ఓదార్చే ప్రయత్నం చేశాడు విజయ్.
''అలా అంటావేంటిరా? వేసవి కాలమొస్తే ఈ చేరువులోనే ఈత కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. వర్షాలకు రాలిన మామిడి కాయలు కాలవలగుండా ఈ చెరువులోకి వస్తే దేవుని ప్రసాదమని తినేవాళ్ళం. మన అస్థిత్వానికి ఈ చెరువే కదరా చిరునామా! ఇది లేకుండా మన గూడెం ఇక్కడ ఉండేదా? మన దాహార్తిని తీర్చిన చెరువును కాపాడలేకపోతున్నారా...'' అనుభూతుల్ని గుర్తుచేసుకుంటూ బాధపడ్డాడు రంగా.
''గతం గతః అన్నార్రా! అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు! ప్రతి ఇంటికీ కుళాయి నీరొస్తుంది. మినరల్‌ వాటరొస్తుంది. అటువంటప్పుడు చెరువు ఏమైపోతే ఏంటిరా?'' చెరువుతో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకున్నట్లు మాట్లాడాడు విజయ్.
''ఒరేయ్ ఫూల్‌! ఇక్కడ ఏం వచ్చింది, దేన్ని మార్చింది అని కాదురా! రేపటి తరానికి మనమేం అందివ్వబోతున్నాం అనేదే ముఖ్యం! ప్రతి ఊరికి చెరువే జీవనాధారం. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని అందుకే అంటారు. మన పూర్వికులు ఊరికో చెరువు చొప్పున ఏర్పాటు చేసుండకపోతే మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్లేవా? నువ్వూ నేను ఇట్టా తీరిగ్గా ఉండేవాళ్ళమా?'' రంగాలో అసహనం పొంగింది.
''బోర్లు లేకుండా కేవలం చెరువునే నమ్ముకున్న ఆ వంద ఎకరాల పొలాలు ఏమైపోవాలి? ఇప్పుడక్కడ ఫ్యాక్టరీ కడితే దాని చెత్తంతా చెరువులోకి చేరి నీరంతా పాడైపోతుంది. పాడై పోయిన ఆ నీళ్ళను పొలాల్లోకి పంపిస్తే పంటలు పండుతాయా? వాటిని మనం తినగలమా? 'రైతే రాజు' అన్న నినాదం నిలబడుతుందా?'' రంగా గుండెలోని ఆర్థ్రత అతని మాటల ద్వారా బహిర్గతమైంది.
''అది పొలం ఉన్నవాళ్ళు పట్టించుకోవాలి! మధ్యలో నీకెందుకు?'' అసహనం ప్రదర్శించాడు విజయ్.
''ఏదో వస్తుందని చేయను. ఏదో పోతుందని మానేయ్యను. అయినా, నువ్వెందుకిలా మారిపోయావ్‌...'' ఆశ్చర్యంగా చూశాడు రంగా.
''నీకో దణ్ణం! ఇకనైనా వదిలెయ్యరా బాబు... శంకుస్థాపన కూడా అయిపొయింది.'' చేతులెత్తి దణ్ణం పెట్టి అభ్యర్థించాడు విజయ్.
''ఎలా వదిలేస్తాంరా? ఎవడబ్బ సొమ్మని చెరువుని ఆక్రమిస్తారు? చెరువులన్నీ కనుమరుగైపోతే భూగర్భజలాలెలా పెరుగుతాయి?'' రంగాలో ఆవేశం అంతకంతకూ పెరుగుతుంది.
''అంటే ఫ్యాక్టరీలు పెట్టడం తప్పా? అవి రావడంతో ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది కదా!'' తర్కంతో మాట్లాడాడు విజయ్.
''ఫ్యాక్టరీలు పెట్టడం తప్పని ఎందుకంటాను. దానికిది అనువైన చోటు కాదంటానంతే! బాగా పంటలు పండే ఇలాంటి చోట్ల కడితే ఏం లాభం? వ్యవసాయమే ఆధారంగా బతికేవాళ్ళ పరిస్థితేంటి? మనకు ధాన్యమెలా వస్తుంది? ఇక్కడ పండడం లేదని ఎక్కువ టాక్సులు కట్టి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి. ఆర్థిక స్వాతంత్య్రం అందరికీ ఉండొద్దా?
కరెంటు ఆఫీస్‌ నుంచి ఫ్యాక్టరీకి కొత్త లైను వేశారు. రోడ్డుకిరువైపులా చెట్లు, వాటి మధ్యనుంచి పెద్ద లైను! వాటి కిందనే ఇళ్లకిచ్చే కరెంటు స్థంభాల లైను! చిన్న షాట్‌ సర్క్యూట్‌ జరిగిందంటే ఊరి మొత్తం కాలిపోతుంది. మొన్న ఏమైందో తెలుసుగా... పక్కూరి ఎరువుల ఫ్యాక్టరీలో కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్లిద్దరే కాదు, ఇక్కడందరూ నిరక్షరాస్యులేనని నీకు తెలియదా? గుడ్డి ఎద్దొచ్చి చేలో మేసినట్లు పనిచేసుకుంటూ పోవడమేకాని వారికేం తెలుస్తుంది చెప్పు? మనిషి ప్రాణమంటే అంత చులకనా?'' జరిగిన సంఘటనలను గుర్తుచేసి బాధపడ్డాడు రంగా.
''ఇప్పుడేమంటావురా...'' స్నేహితుని మనసు మార్చలేక వెనక్కి తగ్గాడు విజయ్.
''వదలను. పై అధికారుల దష్టికి తీసుకెళ్తాను. ఒక్కడైనా మన పరిస్థితికి జాలిపడకపోతాడా... నిజాయితీగా పని చేయకపోతాడా... స్పందించకపోతాడా...'' ఆశాభావం వ్యక్తం చేశాడు రంగా.
''చూస్తున్న కళ్ళను, తెలిసిన నిజాలను డబ్బుతో కప్పెట్టేస్తు న్నప్పుడు నీ ఫిర్యాదులు వాళ్ళను స్పందించేలా చేస్తాయా? అంత పెద్ద ఫ్యాక్టరీని కట్టకుండా ఆపేస్తారా? వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అటువంటివాళ్ళకి ప్రాణాలు తీయడం లెక్క కాదు'' రంగా అంతరంగా స్పష్టమయ్యాక బెదిరింపు వాదం వినిపించాడు విజయ్.
''చంపేస్తారని భయపడిపోతామా? ఆ ఫ్యాక్టరీ కోసం ఇరవై ఎకరాలు కొనడంతో చుట్టుపక్కల ఎన్నో ఎకరాలకు దార్లు మూసుకుపోతాయి, తెలుసా? ఫ్యాక్టరీ కాలుష్యం వలన పొలాలు దెబ్బ తింటాయి. వర్షపాతం తగ్గిపోతుంది. బోరు బావుల్లో నిల్వలు తగ్గిపోతాయి. అప్పుడా రైతులు కూడా పంటలు పండడం లేదని అమ్మేసుకోవచ్చు. అలా అమ్మేసుకుంటూ పోతే పరాయి దేశస్తుల్లా అన్నంకు బదులుగా పిజ్జాలు, బర్గర్లు అంటూ కత్రిమమైన భోజనం చేయాలి. అప్పుడు మనిషి కూడా కత్రిమమైపోతాడు. అదే నా బాధ! ఆలోచిస్తుంటే ఆవేశమొస్తుంది! మాట్లాడుతుంటే బాధేస్తుంది...'' చెరువుగట్టు మీదనుంచి పైకి లేచాడు రంగా.
''ఇన్నాళ్ళు నీలోనున్న అతి మంచితనం చచ్చిపోవాల నుకున్నా. కానిప్పుడు నీలోనున్న మూర్ఖత్వం చచ్చిపోవాలను కుంటున్నా. ఒక స్నేహితుడిగా చెప్తున్నా... ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే బతికి బట్టకడతావ్‌...'' కోప్పడ్డాడు విజయ్.
''అవున్రా... నా ఆవేశం, ఆలోచనా మూర్ఖత్వంలానే అన్పిస్తుంది. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. దాని కోసమే ఈ పోరాటం! మరి నీకేం ఉంది? కాసేపు జాబు చేస్తానంటావ్‌, మరికాసేపు ఏదైనా బిజినెస్‌ చేస్తే బావుంటుందంటావ్‌, కాసేపు ప్రైవేటు జాబు అంటావ్‌, మరికాసేపు గవర్నమెంట్‌ జాబు అంటావ్‌. నీకంటూ ఒక స్పష్టమైన ఆలోచన ఉందా? హైదరాబాదు నుంచి ఇంటికి తిరుగుతూనే ఉన్నావ్‌. నువ్వేదో వెలగబెడుతావని మీవాళ్ళు ఎదురుచూస్తున్నారు. నీపేరులోనే విజయం ఉందికాని నీలో కాదు. నీలో ఏమాత్రం కసి ఉన్నా ఈపాటికే ఏదో ఒకటి సాధించేవాడివి. అలా సాధించిన రోజున నువ్వు చెప్పింది చేయకపోతే అడుగు...'' మొదటిసారి స్నేహితుణ్ణి చులకన చేసినట్లు విజయ్ మొహం మీదనే అనేశాడు రంగా.
విజయ్ ఊహించని సమాధానం! ఏం చేసినా పల్లెత్తు మాట అనని వ్యక్తి నుంచి సూటిగా వచ్చిన మాట! ప్రతి విషయంలో తనని సపోర్ట్‌ చేసే స్నేహితుని నోటి నుంచి వచ్చిన మాట! అతని మనస్సును మథించేలా చేసిన మాట! అతన్ని ఆలోచనలో పడేసినమాట! ఎవరెన్ని అన్నా ఎప్పుడూ పట్టించుకోలేదు విజయ్. కానిప్పుడు అతని మనస్సు లోతుల్లో ఎక్కడో తడిమినట్లయింది. పంతం పట్టి కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నాడు. పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపనీలో ఉద్యోగం సంపాదించి ప్రోగ్రామింగ్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగాడు.
ఆరోజు అలా అతని అహాన్ని తడమకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని సందర్భమొచ్చినప్పుడల్లా గుర్తు చేసుకునేవాడు విజయ్. ఈ ఐదేళ్ళలో వాళ్ళ గ్రామంలో ఫ్యాక్టరీ కట్టడం పూర్తవ్వడంతో పాటు చెరువు పూర్తిగా నాశనమ వ్వడమూ జరిగిపొయింది. ఎప్పటికైనా అక్కడ్నుంచి ఆ ఫ్యాక్టరీని తరలించి చెరువుని పునరుద్ధరించాలని సంకల్పించుకున్నాడు మోహనరంగా. ఆరోజు నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నాడు. పర్యవసానమమే ఈరోజు అతనిపై దాడి!
 
జనరల్‌ ఆస్పత్రిలో రంగా ఉన్న వార్డులోకి వెళ్ళారు విజయ్, శోభన్‌. బెడ్‌ పైన అచేతనంగా ఉన్న స్నేహితుణ్ణి చూసి చలించి పోయారు. ఆ దళితవాడలో మోహనరంగానే అందగాడని పేరు! ఛామనఛాయ రంగు. ముచ్చటైన వర్చస్సు. విశాలమైన వదనం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవాడు. ఎక్కడ తథాస్తు దేవతలు 'తథాస్తు' అంటారేమోనన్న భయంతో చెడు మాటలు మాట్లాడడానికి కాని, తప్పుడు పనులు చేయడానికికాని వెనకాడే వాడు. 'స్వామీ! అందరూ బావుండాలి. సుఖశాంతులతో వర్థిల్లాలి. మంచిగా ఉండాలి. గొడవలు పడకుండా చూడు' అంటూ దేవుణ్ణి ప్రార్ధించేవాడు.
అటువంటివాణ్ణి ఆ స్థితిలో చూసేసరికి వారి నరనరాన బాధ ఆవహించింది. అది రంగాకు కనిపించకుండా కళ్ళలోనే దాచేసుకున్నారు. స్పహలో ఉన్న రంగా, వారిని చూశాడు. మాట్లాడే సాహసం చేయలేదెవరూ! రాత్రి వరకూ ఉండి తిరుగు ప్రయాణమయ్యాడు విజయ్. ఒక్కసారిగా అతని చేతుల్ని రంగా చేతులు అదిమి పట్టుకున్నాయి.
''ఒరేయ్ విజయ్! నేనన్న మాట మీద పంతం పట్టి మంచి పొజిషన్‌ లోకి వెళ్ళావ్‌. చాలా హ్యాపీరా! ఒక స్నేహితుడిగా అడుగుతున్నా... నాకో సాయం చేయగలవా?'' ఎక్కడో నూతులోంచి మాటలు వచ్చినట్లుగా రంగా నోటి వెంట మాటలు దీనంగా వెలువడ్డాయి.
''నువ్వు అంతలా అడగాలా! చెప్పరా...'' బెడ్‌ పైన కూర్చుంటూ అడిగాడు విజయ్.
''మనూరి చెరువు! దాన్ని ఎలాగైనా కాపాడాలిరా... సాయం చేయరా?'' ప్రాధేయపడుతున్నట్లు అడిగాడు రంగా.
విజయ్ అనుమానిస్తున్నట్లు రంగా అదే సాయం అడిగాడు. అతని సంకల్ప బలం తగ్గేలా లేదు. అంత బాధలో ఉండి కూడా తన గురించి కాక చెరువు గురించే ఆలోచిస్తున్న రంగాను చూసి, ఓ స్నేహితుడిగా గర్వపడ్డాడు. కాని, స్నేహితుని శ్రేయస్సు కోరుకునేవాడిగా అతని కోరికను అవుననలేక పోయాడు ఆ క్షణం.
''ఒరేయ్ రంగా! ముందు నువ్వు కోలుకోరా... అన్నీ అవే సర్దుకుంటాయి... నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను హైదరాబాద్‌ వెళ్ళాలి. అర్జెంటు ఆఫీస్‌ వర్క్‌. నువ్వు కోలుకున్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం...'' అంటూ ఏదో సర్దిచెప్పి ఇవతలకి వచ్చేశాడు విజయ్.
వచ్చేస్తూ వెనక్కి తిరిగి రంగా వంక చూశాడు. 'నువ్వు కూడా నాకు సాయం చేయలేవా?' అని దీనంగా అడిగినట్లున్నాయి రంగా కళ్ళు. 'నేనేం చేయలేకపోయానే' అన్నట్లుంది రంగా శరీరం. పరోక్షంగా తన నిస్సహాయతను తెలియ జేస్తూ వచ్చిన విజయ్ ను రంగా చూపులు నీడలా వెంటాడసాగాయి.
 
''చూస్తుంటే నిండా ముప్పయ్యేళ్ళు కూడా లేవు. ఇవన్నీ నీకెందుకయ్యా? ఎవరితో పెట్టుకుంటు న్నావో అర్థమవు తుందా?'' హెచ్చరించినట్లుగా అన్నాడు లాయరు.
''ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రతీదీ సమస్యే సార్‌. పరిష్కరించాలంటే దారులను వెతుక్కోవాలిగాని సృష్టించినవాడి బలాన్ని, బలగాన్ని చూసి వెనకడుగెయ్యకూడదు'' అన్నాడు రంగా, అదే చిరునవ్వు వదనంతో.
''వినరయ్యా వినయ్! మీ వయస్సాలాంటిది. ఉడుకు రక్తం. ఏదో చేద్దామని తాపత్రయం. ఏం చేస్తాం. ఇది ఊరి సమస్య. నీ ఒక్కడి వల్ల కాదు కాని సాక్షి సంతకాలు తెచ్చుకో... అప్పుడు చూద్దాం'' సమయానికేదో వంక చెప్పి, వెనక్కి పంపించేశాడు లాయరు.
బయటికొస్తూ, 'ఏం చేయాలా?' అని ఆలోచిస్తున్న రంగాకు ఒక మెసేజ్‌ వచ్చింది. ఫోన్‌ తెరిచి చూస్తే ఫేస్‌బుక్‌ గ్రూపులో జాయిన్‌ అవ్వమని పంపిన ఇన్విటేషన్‌ అది. వాల్‌ పేపర్‌ మీద తమ ఊరి చెరువును పోలి ఉన్న బొమ్మ ఉండడంతో ఆసక్తిగా గ్రూపును ఓపెన్‌ చేశాడు. దాని పేరు 'మైత్రీవనం'.
''ఫ్రెండ్స్‌, ఈ వాల్‌ పేపర్‌లో ఉన్నది మా ఊరి చెరువు. ఐదు సంవత్సరాల క్రితం కళకళలాడుతూ ఉండే చెరువు, దానికెదురుగా వచ్చిన ఫ్యాక్టరీ కారణంగా ఇలా గుర్తుపట్టలేనట్లు అయ్యింది. మాది పేరుకి చిన్న గ్రామమే అయినా సకల సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల పంటలూ పండుతాయి. ఏమైందో తెలీదుకాని, పచ్చగా పండే మా ఊరి పొలాల మీద శీతకన్ను పడింది. రైతుల్ని మాయ చేసి, పొలాలు కొని, అక్కడ ఫ్యాక్టరీ కట్టారు. అది ఊరికి కిలోమీటర్‌ దూరంలోనే ఉంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్దాల కారణంగా చెరువు పాడైపోవడమే కాకుండా ఊరి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఈ దుస్థితిని రూపుమాపాలని నడుం బిగించిన నా ప్రాణ స్నేహితుడు మోహనరంగాని అతి దారుణంగా కొట్టారు. ఎన్నో రకాలుగా హింసించారు. అతనికేదీ అందకుండా చేస్తున్నారు. చాలామంది అధికారులు ఆ ఫ్యాక్టరీ వారిచ్చే తాయిలాలకు దాసోహమయ్యారు. అయినాగాని నా మిత్రుడు పోరాటం ఆపలేదు. ఈ పోరాటంలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడడం లేదు. మాకోసం అతను చేసే పోరాటాన్ని చూశాక, పుట్టిన ఊరికి నా వంతు సాయం చేయాలని సంకల్పించుకున్నాను. అక్కడ్నుంచి ఆ ఫ్యాక్టరీని తరలించడానికి మేము చేసే ప్రయత్నానికి మీ సహాయం కోరుతున్నాను.
నాకులాగే మీకు కూడా పుట్టిన ఊరి మీద ప్రేముందని నమ్ముతు న్నాను. మీవంతుగా మీరు ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని ఈ గ్రూపులో చేర్చి, ఈ సమస్యను వారికి వివరించి, వారి సహాయాన్ని కోరుతూ, వారిలో చైతన్యం కలిగిస్తూ ముఖ్యమంత్రిగారి దష్టికి తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను. ఇది ఉట్టి మాటగా తీసే య్యొద్దు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మరిన్ని వివరాలకు నన్ను సంప్ర దించవచ్చు. ఇట్లు మీ అడ్మిన్‌ విజయ్...'' అని ఆ గ్రూప్‌ స్టేటస్‌ దగ్గర ఉన్నది చదివి వెంటనే విజరుకు ఫోన్‌ కలిపాడు రంగా.
''థాంక్స్‌ రా విజయ్. ఇప్పుడే 'మైత్రీవనం' గ్రూప్‌ చూశా...'' మాట్లాడుతుంటేనే ఆనందబాష్పాలు రాలాయి రంగాకు.
''నీ గురించి, మనూరి గురించి ఆలోచించా... మంచే దేవుడు, చెడే దెయ్యం అని అప్పుడర్థమైంది. మంచి చేస్తే అది దేవుడిలా రక్షిస్తుంది. చెడు చేస్తే అది దెయ్యంలా పీడిస్తుంది. సాయం చేయాలని ఫిక్స్‌ అయిపోయాను. అందుకే టెక్నికల్‌ పర్సన్‌ గా నా వంతు ప్రచారం చేస్తున్నాను. త్వరలో మనూరికి న్యూస్‌ ఛానల్‌ వాళ్ళు కూడా వస్తారు. ఏం చేయాలో, ఎలా నడిపించాలో మన 'మైత్రీవనం' చూసుకుంటుంది. నువ్విక ఈ విషయంలో నిశ్చింతగా ఉండు...'' భరోసానిచ్చాడు విజయ్.
''చచ్చి బతికిన నాకు కొత్త ఊపిరి పోశావురా... థాంక్స్‌...'' అన్నాడు రంగా.
''స్నేహితుల మధ్య అనురాగాలే కాని అభివాదాలు ఉండకూడదురా...'' అంటూ ఫోన్‌ పెట్టేశాడు విజయ్.
మనిషిని గెలిస్తే బానిసత్వం, మనసుని గెలిస్తే ప్రేమమయం. ఆ బంధమే స్నేహం! స్నేహబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాడు రంగా. 'ఇన్నాళ్ళు ఒక్కడినే' అన్న అభద్రతాభావం తుడిచిపెట్టుకుపోయింది. గుండెనిండా ధైర్యం నిండుకుంది.
వర్షం వెలిశాక, కిరణాలు తాకిన పత్రాలు పరవశించి శోభించినట్లుగా వారి స్నేహబంధం కొత్తపుంతలు తొక్కబోతుంది. 

- దొండపాటి కృష్ణ
9052326864

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు

తాజా వార్తలు

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.