Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అమ్మమ్మ కథ..!! | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Dec 13,2020

అమ్మమ్మ కథ..!!

భారంగా ఉంది నా కనురెప్పలు తెరవాలని ఉంది... కానీ, ఎందుకు తెరవలేకపోతున్నాను. కనీసము నాచేయి కూడా కదపలేకపోతున్నాను. గుండె పట్టేసినట్టుగా ఉంది. గొంతు ఎండిపోతున్నది నా నాలిక పిడుచగట్టుకుపోతున్నది... కడుపులో ఏమిటి.?!.. ఈబాధ... ఇది. అదే....నాకు ఆకలేస్తున్నట్లున్నది. ఆకలా!!?....... నా కండ్ల నుంచి నీరు ఏకధాటిగా కారుతున్నాయి. ఉబికి వచ్చే.. ఈ యద ఘోష.. వ్యధ... ఎవరికి చెప్పను..? వాడికి నాకు ఆకలి వేస్తుందని తెలియదు.
లేకుంటే.. నాకీ బాధ ఉండేది కాదేమో...!? వాడు నా గొట్టములో ఏదయినా ఇంత నా ఆకలితీరడానికి పోసె ఉంటాడు. మరి ఎందుకిలా ఉంది. ?!
పిల్లలు అటు ఇటు పరుగెడుతున్నట్లు చప్పుడౌతుంది. నాదగ్గరకు రారేంటి.?!.. వాళ్లకు నేను ఎంత చేసాను.. ఏడవడానికి శక్తిలేక ఆ కన్నీళ్లు కూడా నాపై జాలి చూపి ఇంకినట్లున్నాయి.. నా కోడలనుకుంటా.. ఆయా అడుగుల చప్పుడు. అవును. గెంతుతున్నట్టు ఇంకెవరు నడుస్తారు.. ఇంట్లో అంగలేసే గుర్రమని అందుకేగా అంటారు ఆయన.
అలా.. నన్ను ఎవరు పట్టించుకోరే... వాడు ఆఫీసుకు వేళ్ళాడేమో లేకుంటే... పడుకుని ఉన్నాడేమో. ఇంతలో... సుమా.. అన్న పిలుపు వినిపిస్తుంది. అయ్యో వచ్చాడా సరే... నా దగ్గరకు వస్తాడు. లేదు లేదు నేనే పిలుస్తాను.. అనుకుంటూ... ఏరా... ఇలా రావు.. ఆ... నామాట రావట్లేదే... తుస్‌... ఏంటి ఇది గాలి వస్తున్నది. బైటికి... అమ్మ ఈ... నొప్పి... ధన్‌... అని ఇంతలో... తలుపు వేసిన చప్పుడవుతుంది... ఆ గదిలో.. అప్పటివరకు ఏదో.. ఉన్న ఆ అలజడి కూడా మౌనము వహించింది. అంటే రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు... నేను ఎట్లా ఉన్నానో కనీసము చూడలేదు.. నా దగ్గరకు రాలేదు వాడు. ఇంతలో... సుమా.. వెళ్ళొస్తా.. అన్న పిలుపు మల్లి వినిపించింది.. ఇక ఆశేలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో... లీలగా ఊహకి వచ్చేసరికి.. నాకు అంత తెలిసిపోయింది. నా హదయ స్పందన వారికి అక్కర లేదు. చిన్నప్పుడు వాడు ఏమవుతాడు.. ఎట్లా.. అని పెంచా. చివరికి ఇలా నా గతి కాలింది. కనీసం నా బాధ చెప్పుకోవడానికి అది కూడా నా దగ్గర లేదు.. కదూ..!!? దూరంగా ఉంది. నిజమే...
దానికి నేనంటే చాలా ప్రేమ.. కాని.. రాలేదు. అన్నట్లు ఈ మధ్య వస్తాను అని కమలతో చెప్పిందని నాకు అప్పుడు కమల చెప్పిందే.?!. అయితే మరి ఎందుకు రాలేదు... అంతే.. లే.. ఆయన ఉంటే నాకు ఇలా అయ్యేదా..!? ఈ ప్రశ్నలకు ఎవ్వరు చెప్తారు సమాధానము. దేముడా.. ఇంకెందుకు నాకీ బాధ. తీసుకెళ్ళు భరించలేను. ఇలా ఆవేదనతో.. ఆ తల్లి ఓ మంచముపై అచేతనంగా ఉంటుంది.

ఈ రోజు మనసంతా ఏదో అలజడిగా ఉంది.
హ్మ్మ... అమ్మమ్మతో కనీసము రెండు రోజులకోసారి అప్పట్లో మాట్లాడేదాన్ని... ఆ తరవాత తరవాత వారం ఇంకా ఇలా... ఇప్పుడు పదిహేను కాదు... నెల కాదు కదా అసలు మాట్లాడలేని పరిస్థితికొచ్చింది. ఇప్పుడు కమల కూడా అక్కడ ఈ టైంలో ఉండదు.. ఆమె మాట్లాడలేదు ఏంచేయాలి? ఇలా ఆలోచనలతో దుఃఖము ముంచుకొచ్చింది. ఇలా అనుకుం టూనే.. వాల్‌ మీద ఉన్న క్లాక్‌ వైపుకు చూసా... టైం 12:30 పి.ఎం. అమ్మో అర్థరాత్రి... అబ్బా.. ఏంటిది ఇలా లేచాను. పక్కనే... గాఢనిద్రలో ఉన్న నా కొడుకు వాడి చేయి నా మెడ చుట్టూ పెనవేసి మరి పడుకున్నాడు. చిన్నగా కదిలాను. హ్మ్మ. ఇంకాస్త వాడు జరిగి నా బొజ్జను దిండులా చేసుకుని నా మీదకి వచ్చి అతుక్కుని మరీ పడుకున్నాడు.. తల పక్కకు తిప్పా. నా కూతురు అను.. వెల్లికల.. హాయిగా ఆదమరచి పడుకుని కాలు ఒకటి నాపై వేసి నన్ను బంధించి ఇంకేం నాకూ అన్నట్టు... హాయిగా పడుకుని ఉంది. దాని మొహములో ఇప్పుడే ఆకాశములో చేరిన ఓ చుక్కలా చిన్నగా ఓ నవ్వు మెరిసింది.. నిద్రమధ్యలో...
వారిరువురి నడుమన నాకు ఊపిరాడలా, అయినా అదో హాయి, తెలియని తప్తి నా మనసును తాకింది. ఇక నాకన్నా ఈ ప్రపంచములో గొప్ప అదష్టవంతురాలు ఎవరు లేరు అనిపించింది.. భానుమతి గారి పాట నా మనసును తాకింది. అలా నా ఆలోచనలులో.. ఎంత హాయి.. ఈ రోజు నిండెనో... నా ఆలోచనలలో ఎంత సమయము ఆలా గడచి పోయిందో... అమ్మతో మాట్లాడి వారం అవుతున్నది సరే అని ఫోన్‌ చేశాను. అప్పుడు అమ్మ చెప్పినమాట విని ఒక్కక్షణం ఎం మాట్లాడలేక పోయాను... అమ్మమ్మతో వాళ్లెవరు మాట్లాడటమే మానేశారు. మీ తాత పోయింతరువాత కాస్త నిలదొక్కుకుంది ఈ మధ్యనే...
సరి అయిన తిండి లేదు.. 'అంటే ఏంటి? వాళ్ళు తినరా ఆమెకు పెట్టారా' అన్న నా ప్రశ్నకు బదులుగా, పెట్టరా అని కాదు. వాళ్ళు వండే కారాలు, ఫ్రైలు ఆమెకు నచ్చవు. అందుకని ఏదో అంత.. రోజు మజ్జిగ తాగుతున్నది... అలా అలా ఆమెకి సోడియమ్‌ లెవెల్స్‌ పడిపోయాయి అని చెప్పింది.. అమ్మ. సరే అమ్మ నేను వస్తాను మనమిద్దరం కలిసి ఆమెను బాగా చూసుకుందాము.. మనకి యోగ కూడా తెలుసు... ఫుడ్‌ ఎలా తింటే మంచిదో తెలుసు. నా మాటలు పూర్తికాలేదు.. ఇంతలో.. అమ్మ ఇలా అనింది. ''ఆ ముసలిది దాని ఖర్మ.. కూతుళ్లను దూరం చేసుకుంది... ఆస్థి అంత కొడుక్కి ఇస్తాను అనింది... ఐన నేను చూడలేను. నేనుండే ఈ ఊళ్ళో వైద్యం ఆమెకు లేదు... నా నెత్తికి తేకు... నాకు ప్రేమలేక కాదు... ఎన్నో సార్లు రమ్మన్నా రాలేదు... ఇప్పుడు నేను ఒక్కతిని చేయలేను... మీ నాన్న అటు పుల్ల తీసి ఇటు పెట్టరు.. నీకు తెలుసు కదా. నేను ఉద్యోగం చేస్తేనే నాలుగు వేళ్ళు లోపలి వెళ్ళేది. పైగా నేనుండేది గ్రామం ఇక్కడ ఆమెకు కావాల్సిన వైద్యసాయం ఉండదు నీకు తెలియంది కాదు... ఐన మీ అమ్మమ్మను మీ మామనే చూసుకోవాలి నావల్ల కాదు. ఫో-..'' ససేమిరా అనింది...
ఒప్పుకోలేదు... ఎంతో నచ్చచెప్పాను.. వినలేదు అమ్మ.
నా కన్నీళ్లు ఆగలేదు నా గత జ్ఞాపకాల పరిమలలో నలిగి పోయనిలా.. కన్నది మా అమ్మే అయినా.. నన్ను పెంచింది.. మాత్రమూ.. మా అమ్మమ్మయే.. అందుకు కారణం మా అమ్మను తన మేనమామకే ఇచ్చి చేయడము ఒక కారణమూ.. మా అమ్మ తరవాత వాళ్ళందరి పెళ్లిళ్లు కొంచెమ్‌ నెమ్మదిగా జరగడం వల్ల నేను అందరికి మహారాణిని అయ్యాను. మా అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టము అందుకు కారణం నేను కొంచెం వాళ్ళ అమ్మలాగే ఉండటమే.. ఇంకేముంది నేను అందరి మధ్యలో ఇద్దరు అమ్మల ముద్దుల పట్టినయ్యాను.
చిన్నప్పుడంతా నేను అమ్మమ్మ దగ్గరనే పడుకునే దాన్ని.. ఆమె ఎన్నో పాటలు పాడేది.. లాలీ... పాపాయి నిదుర పోవే.. బంగారు తల్లి నీకన్నా నాకెవరు అంటూ... ఆమె పాడే పాట చల్లటి మత్తును పరిచేది... ఎన్నో కథలు, వేమన, సుమతి శతకాలు వల్లె వేయించేది... ఇంకా మా తాత గారు అయితే నేను ఇరువది ఎక్కాలు చెప్పేదాకా నిద్రపోయేవారు కాదు... ఇంకా పొద్దున్నే కాసేపు అమ్మమ్మ ఇచ్చిన టీ తాగుతూ పుస్తక పఠనం చేసే దాన్ని... అది ఏమి ఎలా? ఉండడేదంటే ఆమె అలా ప్రేమతో ఇస్తే నాకది అమతంలా అనిపించేది. మా ఇంట్లో పొద్దున్నే అంటే కోడి కూడా కుసేది కాదేమో.. మా ఇంటి చావట్లో మా తాతగారు బాయిలేరు వేసేవారు.. ఆ వేడినీళ్లు మాత్రమూ మా అందరి కోసమే. ఆయన మాత్రం ధనుర్మాసం అయినా... సరే.. ఓం... ఓం... అనుకుంటూ కొరికే చలిలో.. చన్నీటి స్నానమే ఆచరించేవారు... ఆ బాయిలేరు నుంచి వచ్చే పొగను చూస్తే నాకు పాత సినిమాలో అంజలి దేవి పాట ఒకటి గుర్తుకువచ్చేది... ''పిలవకురా నలుగురిలో... నను ఓరాజా'' అంటూ నత్యం చేసేదాన్ని. పక్క మిద్దెపై ఉండే కొంటె కోనాంగులకి ఇది తెలుసో తెలియదో గాని.. నన్ను... చూస్తుండే వారు. ఇంతలో అమ్మమ్మ వచ్చే అడుగుల చప్పుడు విని మళ్లీ దుప్పటి తన్నే దాన్ని. చాపపై చేరి... ఇదేమి తెలియని అమ్మమ్మ లేవు అమ్మ అంటూ నా కళ్ళు తుడిచేది... అప్పుడే లేస్తున్నట్లు అమ్మమ్మ వొళ్ళో మళ్లీ కాసేపు గారాలు పోయేదాన్ని... అమ్మ కాదు... లే అమ్మా.... మీ తాత గారు చూస్తే మళ్లీ తంటా అంటూ... లేపేది..
అమ్మమ్మతో ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా నా దగ్గరకు రమ్మని ఎంతో బామాలేదాన్ని తనని. నేను అమెరికాకా?.. పిచ్చ ఏంటీ...? అనేది.. ఇవాల్టి రోజుల్లో అమెరికాకి అంటే అనకాపల్లికెళ్లినంత ఈజీ అని చెప్పా. జయ పిన్నికి తనకు చెప్పమని కూడా చెప్పా. పిన్ని కూడా చెప్పి చెప్పి విసిగి.. నా వల్ల కాదే అని ఊరుకుంది.. 'నా ఇంట్లో.. నా మొగుడు నాకిచ్చిన ఈ ఇంట్లోనే నా ప్రాణాలు పోవాలి' అని భీష్మించుకుని కూర్చున్నది.
నా గుండె పగిలిపోతున్నది.. ఇప్పుడు. నేను ఏంచేయాలి... నా కన్నీళ్లు అగడములేదు. ఈ బాధ తీరదు ఎవరితోనూ పంచుకోడానికి కూడా నేను సిద్ధముగా లేను. అది నాకు తెలిసి పోతున్నది. పంచుకునే తాను మూగది కూడా అయి నా గుండెను పిండేస్తున్నది. నా మనసు తనకు తెలియదా !?... ఈ మలయ మారుతాలు తెలుపవా?!... నా గుండె సవ్వడి తాను వినలేదా!!.
ఏదో అలికిడి ఐంది..
ఎవరా? అని లేచి చూసాను.. ఎవరు లేరు.. అంతా నిశ్శబ్దము.. బరువెక్కిన గుండెతోనే వంటిట్లోకి వెళ్లి ఓ గ్లాసు నీళ్లు పట్టుకుని తాగా. నా చిన్నతనమంతా మా అమ్మమ్మ దగ్గరే సాగిపోయింది.. ఆరోజు నా పెండ్లి ఆ ఇంట్లోనే జరగాలని ఆరాటపడింది. పెళ్ళికూతుర్ని చేసింది. నా కాళ్లకు పారాణి దిద్దింది. ఆఖరకు నా పెండ్లి కూడా ఆ ఇంట్లోనే జరిగింది. ఆ రోజు మా మామకు అత్తకు ఎవరికీ అది ఇష్టమే లేదు.. కానీ నోరు మెదపలేదు.. అందరు ఆనందంగా ఉన్నట్లుగా కనిపించారు. ఆ నాడే నాకు చెప్పింది తాను.. చూడు స్రవి.. నేను పోయిననాడు వీళ్ళు కాట్రాకుక్కల్లా కొట్టుకుంటారు. అందరు ఒక తాటిపై ప్రేమగా ఉండటానికి నేను చాలా శ్రమ పడ్డాను.. వాళ్ళెవ్వరికి అది ఇష్టమే లేదు. నా ఖర్మ నిన్ను అంత దూరం ఇస్తున్న.. కానీ జాగర్త. నేను పోయినా... ఒక్కటి గుర్తుపెట్టుకో. అందర్నీ ఒక్కలా ఉండేలా చూడు.. ఆ.. ధైర్యము నా నుంచి రావాలా నీకు. నేను లేకున్నా నా ఆశ అదే అంది.
పో అమ్మమ్మ... అంటూ నువ్వెక్కడికి పోయేది నేనుల్లా.. అంటూ ఏడ్చేసా.. నేను పోవడం నువ్వు అక్కడ ఏడవడమే మిగులు అంతే... అదే జరిగేది.. కాబట్టే చెబుతున్న... ఎదో భవిష్యత్తు తెలిసిందాని మల్లె... ఆలా చెప్తూ తాను బావురుమంది నన్ను కొగిలించుకుని అప్పగింతల వేళ.. అది ఒక్కసారి నాకు గుర్తొచ్చింది. నాకు అందరు కావాలి అందరు కలవాలి మునుపుటిలా అందరమూ ఉండాలి.. ఇలా మాట్లాడుకోకుండా ఎందుకు? ఏముంది? కనుక.. కలిసి ఉంటేనే కదా సరదాలు.. సంబరాలు.. ఆనాడు నా పెళ్ళి తరవాత.. అందరమూ ఇలా ఏంటో.. నాకు తెలియడం లేదు.. మామ చేతుల మీదుగా నేను పెరిగే... ఆఖరకు మామాకొచ్చిన ఫొటోస్‌ పెళ్ళిచూపులవి కూడా నేనే తిరగేసేదాన్ని.
ఓ రోజు మా మామ పెళ్లిచూపులు రాత్రిపూట జరిగాయి అంతేకాక కరెంటు పోయింది కూడా... ఇక మామకు పిల్లను చూడటానికి లాంతరు పెట్టారు. ఆ చీకట్లో.. అసలు మామ అత్తను పెళ్లి చూపుల్లో చూడలేదు.. బాగుందని అత్తను నేనే సెలెక్ట్‌ చేశా.. కానీ ఈ రోజేమైంది.. అత్త నాకు ఫ్రెండ్‌లాగా అనుకుంటున్నా, చెప్పు చెప్పు... మామ చెప్పు చెప్పు... అంటూ త్రుళ్ళిపడి లేచాను... చూసే సరికి నా పిల్లలు మా వారిని హత్తుకుని పడుకోవడం చూసాను... అంత నిశ్శబ్దముగా ఉంది...
జ్ఞాపకాలు ఎంత తీయగా ఉంటాయో అది గుర్తొచ్చి నవ్వుకున్నా... అవేమంటే... చేసుకో మామ అంటూ మా మామ పెళ్ళిలో నేను చేసిన సందడి అల్లరి అంత ఇంతాకాదు... చూసిన వాళ్లు ఏంటిరా దీన్నే చేసుకోవచ్చుగా అని కూడా అన్నారు... మా మామ చెప్పిన మాట ఒక్కటే దాన్ని నా భుజాలు మీద ఎత్తుకు పెరిగా.. అది ఎప్పుడు నాకు చిట్టితల్లే. మా ఇంటి పాపాయి.. అన్నాడు.. మా తాతగారు కూడా ఇలా అన్నారు... పిల్లలేమంటే అదే.. మనదేముంది. అయినా అది నా కూతుళ్ళు ఒకటి కాదు అన్నారు. ఈ విషయం గుర్తొచ్చింది.
ఏమయితే అది అని మామామకు మెయిల్‌ చేశా... చిన్ననాటి మా... జ్ఞాపకాలన్నీ ఓ మారు గుర్తు చేసాను. ఇక చూడాలి అనుకుంటూ నిట్టూర్పు వదిలా... నాకు ఏమి అర్థం కాలేదు... నైట్‌ పది గంటలు కావస్తున్నది.. నాకు మల్లి అలజడి స్టార్ట్‌ ఐంది. ఈ సారి నేను ఎవరికీ ఫోన్‌ చెయ్యలేదు.. ఎందుకో భయం వేసింది. అలా తెలియని ఆందోళనలతో ఆ గదిలో పడుకుండి పోయాను ఆ రాత్రి. కానీ నిద్ర పట్టలేదు. అలాగని మునుపుటిలా... ఏడుపు రాలేదు.. నా గుండె గట్టిబారి పోయింది.. నా స్థితి నాకే అర్థం కాలేదు. రూమ్‌ చూడ్డానికి ఎంతో హాయిగా అందంగా ఉంది.. మంచం తెల్లటి తివాచి పరిచినట్లుగా ఉంది. మాయాబజారులో వంగర గారు పరిచిన గింబలిని గుర్తుచేసింది..
పిల్లలు బాగా ఎంజారు చేసి ఆదమరచి పడుకున్నారు నా రెప్ప వాలలేదు.. అనుబంధాలు ఆత్మీయతలు తెంచుకుని ఎవరికీ వారై ఏకాంతవాసం గడపడం అందరికి అలవాటైపోయింది. ఈ లక్షణం ప్రకృతి తెచ్చిన విపత్తు కాదేమో.?! మానవుడు చెట్లను నరికి జంతువులకు తావులేకుండా చేసాడు. మట్టిరోడ్లు లేవు. ఉపాధుల కోసం పరాయి దేశాలకు వలసలు పోయి బతుకు పాకులాట!?.. చివరికి బంధాలు ఎలా నిలబడతాయి?!.. ఈ విపత్తుని మార్చే నూతన చైతన్యం రావడం చూడాలి.
ఇంతలో... ఏదో వెలితిగా ఉంది... కానీ... నా కుడి పక్కన కంటికి కనిపించని ఓ వెచ్చని స్పర్శ నన్ను అనుకుని వున్న భావన కలిగింది... ఎవరో... నాపై చేయి వేసి చిచ్చు కొడుతున్నట్లుగా ఉంది.. నా కన్నీళ్లు ఉబికి వచ్చాయి.. జ్ఞాపకాలు ఆగిపోయాయి..
అప్పటిదాకా కనిపిస్తున్న ఎదురుగా వెలుగుతున్న మినుకు మినుకుమనే కాంతి నా కన్నీళ్ల నడుమ ఇప్పుడు కనిపించడం లేదు.. అది అమ్మమ్మలా కనిపించింది. ఏం జరిగిందో ఊహించాను.. ఆమె ఇక నాకు లేదా అని బావురుమన్నాను. అప్పుడు ఆ స్పర్శ ఆ హాయి నాకు జోల పాడటం ప్రారంభించింది... ఈ అమ్మమ్మ వడిలో కమ్మదనం... జో... లాలీ పాపాయి... అంటూ... పాట సాగింది... ఆ.. పాటా... అవును... ఇక నేను ఆనంద తన్మయత్వములో.. అమ్మమ్మకు ఏం జరిగిందో గ్రహించాను... మా కల నిజమైంది. ఆమె నా మీద ప్రేమతో నా దగ్గరికీ... ఇలా ఆత్మలా వచ్చింది... నాకు జోలపాడుతున్నది... అని ఆమె నా ప్రతి పనిలోనూ.... ఆలోచనలోను... వెన్నంటే ఉంటుందని తెలిసింది... ఆమె పాట ఆగలే.. సాగుతూనే ఉంది. ప్రతి రాత్రి ఆ రాత్రి అలా వింటూనే ఉండిపోయాను..
ప్రపంచమంతా కరోనా మందు కోసం ఎదురుచూస్తుంటే నేను మాత్రం కరిగిపోతున్న మన బంధాల కోసం పరితపించే కన్నీటి స్రవంతినయ్యాను ఆ రాత్రి..!!

- రాధికా ఫణి.వంగర, 2697442118
కటీ, టెక్సాస్‌.77494, యూఎస్‌ఏ.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు

తాజా వార్తలు

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.