Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పరిమళించిన మానవత్వం | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Dec 13,2020

పరిమళించిన మానవత్వం

కూతురి నవ్వు చూస్తుంటే కడుపు నిండిపోయింది వీరస్వామికి..
''వర్షీ ఇలా రా..'' నాన్న పిలుపుతో వర్షిత నాన్న దగ్గరికి వెళ్ళింది..
''ఏం ఆలోచిస్తున్నావ్‌ రా..? నాకు తెలుసులే నీ రాజ కుమారుడి గురించే కదా...''
''నాన్న ముందు నా చదువు తర్వాతే పెళ్లి..''అంటూ నాన్నతో చెప్పింది వర్షిత.
''సర్లే రా నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నాం.. నా బంగారానికి ఇష్టం ఉంటేనే.. ఇప్పటి నుండి చూస్తేనే కదరా..మంచి సంబంధం కుదిరేది.''
''మీ ఇష్టం నాన్న'' అని వర్షి అన్న ఒక్క మాటతో.. సంతోషంతో బిడ్డను ప్రేమగా తలనిమిరాడు వీరస్వామి..

భార్య ఝాన్సీ ''ఏవండోరు.. మీ తండ్రీ, కూతుర్ల ప్రేమ బాగుంది.. ముందు ఈ టీ తెచ్చా తీసుకోండి'' అంటూ టీ అందజేసింది ఝాన్సీ.
భార్య అందించిన టీని ఆస్వాదిస్తూ వీరస్వామి తన గతంలోకి జారుకున్నాడు.
వీరస్వామి, ఝాన్సీల వివాహం అయిన ఐదు సంవత్సరాల తర్వాత మొదటి కాన్పు అందింది..
మొదటి, రెండు కాన్పుల్లో పురిట్లోనే బిడ్డలను కోల్పోయింది..
ఈ సమాజంలో శుభకార్యాలకు వెళ్లిన ఒక స్త్రీని పిల్లలు లేకపోతే ఆమెని సూటిపోటి మాటలతో సూదుల్లాంటి చూపులతో గుచ్చడం.. ఇలా.. వారనే మాటలకు ఝాన్సీకి చాలా బాధగా ఉండేది..
ఎంత బాధపడే మాటలు ఎదుటివారు అన్నా.. ఒక్క తన భర్త అండగా, తనతో ధైర్యంగా ఉంటే చాలు.. అన్నీ మర్చిపోవడానికి.. ఝాన్సీకి భర్త ప్రేమ మెండుగా దొరకడం ఆమె సంతోషానికి కారణం.. మూడవ ప్రసవం..
హాస్పిటల్‌కి బయలుదేరే సమయంలో ఝాన్సీ అత్తగారి మాటలు.. ''ఈ సారైనా సక్కగా జరిగేనా ప్రసవం.''
ఈ మాటతో వీరస్వామి కోపంతో.. ''నువ్‌ నోరు మూయవే.. సాటి స్త్రీగా కోడలికి ధైర్యం చెప్పేదిబోయి అపశకున పక్షిలా.. నువ్వూ. నీ ఆలోచనా విధానం..
పరమేశ్వరా.. ఈ సారైనా.. నా భార్యకు క్షేమంగా ప్రసవం జరిగేలా చూడు స్వామీ..''
హాస్పిటల్‌ లోపలికి తీసుకెళ్లారు..
నర్సు బయటికి వొచ్చింది.. ఏం వార్త చెప్తుందో ఏమోనని వీరస్వామి చేతులు వణుకుతున్నాయి.. ఈ సారి నా భార్య క్షేమంగా ప్రసవం కాకపోతే.. ఆ మాట విని నిబ్బరంగా ఉండగలిగే ధైర్యం నా భార్యకు లేకపోతే.. చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదయ్యా.. నువ్వే కాపాడు..
నర్సు క్లాప్స్‌ కొట్టి..
''మీ భార్య పండంటి బిడ్డకి జన్మనిచ్చింది'' అంటూ.. కంగ్రాట్స్‌ చెప్పింది..
ఆ మాటతో వీరస్వామి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు..
టీ తాగాక పేపర్‌ చదవడం మొదలు పెట్టాడు..
ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.. ''వామ్మో.. వాయ్యో.. ఈ కరోనా మహమ్మారి ఇండియాకి కూడా వొచ్చిందోరు.. మొన్నటి వరకు చైనాకు పరిమితం అయింది.. ఇప్పుడు దేశ దేశాలకు అంటుకుంటుంది..''
లాక్‌ డౌన్‌ నెల రోజులు ఉంటుందట.
రేపటి నుండే ప్రారంభం...
సరుకులు తేవాలి అన్నావ్‌ కదా.. ముందే చెప్పు వెళ్లి తీసుకొని వొస్తా..''
వర్షిత ''నాన్నా..రేపు హైద్రాబాద్‌ వెళ్ళాలి పుస్తకాలకు...'' అనగానే..
వీరస్వామి..''అమ్మా కరోనా కేస్‌ పాసిటివ్‌ వొచ్చింది ఎక్కడ అనుకుంటున్నావ్‌..? హైదరాబాద్‌లోనే పాజిటివ్‌ నమోదు అయింది.. నీ పీజీ ఎంట్రన్స్‌ పుస్తకాలు తర్వాత అయినా తీసుకోవొచ్చు..
వామ్మో నువ్వు ముందే మన ఊరుకు రావడం మంచిది అయింది. అక్కడ ఉంటే ఎంత ఇబ్బంది అయ్యేది. పక్కింటి ప్రభాకర్‌ చెప్పాడు. వాళ్ళ కూతురుని ఇంటికి పంపించడానికి కూడా అనుమతి లేదంటా.. చాలా బాధపడ్డాడు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఆ మహమ్మారి మన దగ్గరికి చేరకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఉన్న పుస్తకాలు చదువు'' అనగానే..
అమాయకమైన మొహంతో లోపలికి వెళ్ళింది వర్షిత.
''అవునే ఈ వారం అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వొస్తున్నారు.. గుర్తుందా..''అంటూ భార్య వైపు చూసాడు వీరస్వామి..
ఝాన్సీ ఒక్క చూపు చూసి ..
''ఏవండీ ఈ కరోనా సమయంలో.. ఎలా రమ్మంటారండీ'' అనడంతో..
ఏముందే కాల్‌ చేసి నోటితో రమ్మని చెప్పడమే అన్నాడు భర్త
ఝాన్సీ ''ఈ వెటకారంకి తక్కువేం లేదు. అయినా ఒక్కగానొక్క కూతురు. అంబరాన్నంటేలా వివాహం చేయాలి. ఈ సమయంలో పెళ్లి చూపులేంటండీ. కుదిరినా.. బంధువులు ఎవరూ లేకుండా... అయినా ఇప్పుడు పెళ్ళికొచ్చిన ఆరాటం ఏమి లేదు. దాని పీజీ కానివ్వండి. వాళ్ళకి కాల్‌ చేసి రావొద్దు చెప్తాను'' అనడంతో ఆమె మాటకి ఏకీభవించాడు వీరస్వామి..
క్లర్కుగా ఉద్యోగం చేస్తున్న వీరస్వామికి వార్తలు చూడటం, పేపర్‌ చదవడం వల్ల ఆరోగ్య సూచనల పట్ల అవగాహన ఉంది..
సరుకులు కొనడానికి చేతులకు శానిటైజర్‌ చేతులకు రాసుకొని, మొఖానికి మాస్క్‌ కట్టుకొని బైక్‌ మీద బయలు దేరాడు..
క్యూ లైన్‌ లో సరుకులు తీసుకోవడానికి నిలబడ్డాడు..
''కరోనా పట్ల జాగ్రత్త పాటించండి.. దూరం పాటించక పోతే సరుకులు ఇవ్వమని చెప్తున్నాడు షాపు యజమాని..
ఈ లోగా వీరస్వామి పక్కన ఉన్న ఒక వ్యక్తి మాస్క్‌తోనే తుమ్మాడు..
జాగ్రత్త వహించిన వీరస్వామి జేబులో ఉన్న శానిటైజర్‌ తీసుకొని చేతులకు రాసుకొని హమ్మయ్య.. ఈ కరోనా నా దగ్గరికి రాదని ధైర్యంగా ఉన్నాడు..
సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో.. వొచ్చే దారిలో లాక్డౌన్‌ వల్ల ముందు రోజుల్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన కొందరు రాజకీయ పార్టీ వారు సరుకులను అందజేస్తున్నారు...
వీరస్వామి వెంటనే.. అయ్యో అనవసరంగా సరుకులు తీసుకున్నాను.. ముందు తెలిసినా.. డబ్బులు మిగిలేవి కదా..
అయినా ఏముంది లైన్‌లో నిలబడి సరుకులు తీసుకుంటా.. బండి కనిపించకుండా దూరం పెడితే పేదవాడు అనుకొని సరుకులు ఇస్తారు.. నా భార్య మరో నెల రోజులకు సరిపడే సరుకులు తెచ్చాడు అంటూ సంతోషిస్తుంది అనుకుంటూ.. లైన్‌లో నిలబడి వారు అందజేసిన నెలకి సరిపడా సరుకులు తీసుకున్నాడు.
ఇలా బయటికి వొస్తుంటే.. మాసిన దుస్తులతో ఒక స్త్రీ తన చంటి బిడ్డని తీసుకొని లైన్‌లో నిలబడినా.. అప్పటికే ఆమెకు సరుకులు అందకపోవడం గమనించాడు.
ఒక్క క్షణం ఆలోచించాడు.. ''నేను ఒక ఉద్యోగస్తుడిని. సరుకులు కొనుక్కునే స్థోమత ఉన్నవాడినై ఉండి ఈ సామాగ్రిని తీసుకోవడం తప్పు .. ఆమె చంకలోని బిడ్డని, ఆమెను చూస్తుంటే బాధగా అనిపించిన వీరస్వామి అతను తీసుకున్న సరుకులను, తన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలను చంటిబిడ్డ తల్లికి ఇచ్చాడు.
ఆమె ''దండాలయ్యా అంటూ''.. రెండు చేతులను జోడించి నమస్కరించింది...
ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు వీరస్వామి..
భార్య నా భర్త మనసు బంగారం అంటూ.. భర్త పాదాలకు నమస్కరించింది..
కూతురు నాన్న నుదురుపై ముద్దుపెట్టింది..
ఆ పార్టీ వారు ఇచ్చిన సరుకులు ఇంటికి తెస్తే..వీరి కళ్ళలో మానవత్వపు పరిమళం వికశించే ఆనందం చూసేవాడిని కాదంటూ.. వీరస్వామి కళ్ళలో నీళ్ళు తిరిగాయి...

- పెద్దపల్లి తేజస్వి,
9603329474

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు

తాజా వార్తలు

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.