Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ముసుగు | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Dec 13,2020

ముసుగు

'అరవై యేళ్లు దాటిన వారందరినీ షూట్‌ చేసి పారేయాలి- నన్ను తప్ప' అని ఓ రచయిత అన్నాడు. ఆయన బాగా చెప్పాడని అనిపించింది. ఎందుకంటే నా వయసూ అరవై దాటింది మరీ! ఆ వయసులో నాలా నా కాళ్లమీద నేను నిలబడే శక్తి లేనప్పుడు చేతి కక్ర మీద, చేతి కర్రలా మద్దతిచ్చే మనుషుల మీద ఆధారపడాల్సి వస్తుంది.
నా విషయంలో నా కొడుకులిద్దరి మీదా ఆధారపడి బతుకుబంది లాగిస్తున్నాను. పెళ్లయి కాపురాలు చేసుకుంటున్న వాళ్లు నన్ను చెరో ఆరు నెలల పాటు పంచుకుంటారు. మన పట్టణాల్లోని గతుకుల రోడ్ల మీద వాహనంలా నడుస్తూ ఉంటుంది నా జీవన శకటం. నా భార్య ఏదో పుణ్యం చేసుకుని ఉంటుంది ఈ బాధలేమీ లేకుండా ముందే పైకెళ్లిపోయింది.
జీవితంలో నేను ఒకే ఒక తెలివైన పని చేశాను. నా మిత్రుడి సలహాపైన అతను పొలం కొంటూ ఉంటే, అక్కడేనా నాపేరు మీద ఒక ఎకరం పొలం కొన్నాను. ''నీ పేరు మీద ఏదైనా ఉంటేనే, పిల్లలు ముసలితనంలో నిన్ను చూసుకుంటారు. ఎందుకంటే, నువ్వు టపా కట్టేశాక, ఆ ఆస్తి వాళ్లకొస్తుందని! నీ దగ్గర ఏమీ లేదనుకో.. చెప్పలేం పిల్లలు మంచి వాళ్ళయినా, కోడళ్ల ప్రభావం వల్ల వాళ్లు మారిపోవచ్చు. నిన్నెవరూ చూసుకోకపోతే, అప్పుడు పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో. ఈ పొలం పనులు నువ్వేమీ చూసుకోనవసరం లేదు. అవన్నీ నా పొలంతో పాటు చూసుకుని, దాని మీద వచ్చే ఆదారం ఎప్పటికప్పుడు నీ బ్యాంక్‌ అక్కౌంట్‌లో వేస్తాను.'' అని ఆ రోజు నా మిత్రుడు చెప్పిన మాటలు విన్నాను. అందుకే ఇప్పుడు కాస్త నిబ్బరంగా ఉన్నాను.
బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న నా రెండో కొడుక్కి విజయవాడ బదిలీ కావడంతో- అంతవరకూ హైద్రాబాద్‌లో ఆరు నెలల పాటు మా పెద్దబ్బాయితో ఉన్న నేను- విజయవాడ చేరుకున్నాను. ఆ ఐరంటే నాకెంతో మమకారం. అక్కడే నేను ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. వరకూ చదువుకున్నానుజ ఎన్నో యేళ్ల తర్వాత విజయవాడ రావడంతో- అంతా కొత్తగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద భవంతుల సంఖ్య పెరిగింది. రోడ్ల మీద గుడులు దగ్గరగా బిచ్చగాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. మన అభివృద్ధికి సాక్ష్యం వాళ్లే! ఆరోజు చేసే పనేమీ లేదు. కాబట్టి ఊళ్లోకి బయల్దేరాను. ఒక చోట ఆడిటోరియంలో ఏదో ఫంక్షన్‌. బయట బేనర్లు ఓ మంత్రి గారికి స్వాగతం చెబుతున్నాయి. ఏమిటో చూద్దామని లోపలికి వెళ్లాను. అప్పటికే మంత్రిగారి ఉపన్యాసం అయినట్లుంది. వేదిక మీద నుంచి ఆయన దిగుతుంటే ఓ వ్యక్తి మంత్రిగారికి షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ పలకరించిన దృశ్యం నన్ను ఆకర్షించింది.
అతన్ని పరీక్షగా చూశాను. సందేహం లేదు. వాడు గోపీకృష్ణే! నేను విజయవాడ గాంధీజీ మునిసిపల్‌ హౌయర్‌సెకండరీ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నా క్లాస్‌మేట్‌. ఎప్పుడూ క్లాసులు ఎగ్గొట్టి, హైస్కూల్‌ ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో ఆటలు ఆడుతూ ఉండేవాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, వాడికి పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. అది నాకు మిస్టరీగా ఉండేది!
వాణ్ణి ఆ సమయంలో మంత్రిగారితో ఉండడం చూసి ఏదో పెద్ద హౌదాలో ఉండి ఉంటాడని అనుకున్నాను. మినిస్టర్‌ వెళ్లిపోయాడు. అక్కడ హడావుడి కాస్త తగ్గింది. గోపీకృష్ణ ఇంకా అక్కడే ఉన్నాడు. దగ్గరకు వెళ్లి పలకరించాను. వాణ్ణి సస్పెన్స్‌లో పెట్టకుండా నా పేరు చెప్పి, హైస్కూలు రోజులు గుర్తుచేశాను. వెంటనే నన్ను కావలించుకున్నాడు. 'ఎంతగా మారిపోయావు' అన్నాడు. ''పద.. అలా రెస్టారెంట్‌లో కూర్చుని మాట్లాడుకుందాం'' అని దగ్గర్లోనే ఉన్న ఖరీదైన రెస్టారెంట్‌లో ఏసి సెక్షన్‌లోకి తీసుకువెళ్లాడు.
''మినిస్టర్‌తో నువ్వు మాట్లాడడం చూశాను. నువ్వు మంచి పొజిషన్‌లో ఉండడం చూసి సంతోషించాను'' అనేసరికి గోపీకృష్ణ నవ్వాడు.
''ఆ.. నువ్వేం తింటావు.. ఇక్కడ రవ్వ దోసె బావుంటుంది, నువ్వ తింటావుగా'' అన్నాడు- గోపీకృష్ణ. ''నీ ఇష్టం.. ఏమైనా ఆర్డర్‌ ఇవ్వు. కానీ బిల్లు మాత్రం నాదే.. నేను నీకు పార్టీ ఇస్తున్నాననుకో'' అన్నాను నవ్వుతూ.. ముందు వాడు రెండు స్వీట్లు ఆర్డర్‌ చేశాడు. మేం కబుర్లు ప్రారంభించాం- వచ్చినవి తింటూనే.
''ఈ మినిస్టర్‌ ఉన్నాడే.. మన ముందు బచ్చా అనుకో.. నేను చెప్పిన ఫార్ములా ఫాలో అయి మంత్రి అయ్యాడు. అందుకే మనం అంటే మర్యాద. ఇతనిదేముంది.. ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ బ్రదర్స్‌ ఉన్నారు చూడు.. పెద్దోడు ముకేశ్‌.. రిచెస్ట్‌ ఫెలో.. నా సలహాలు వినే అంత పెద్దవాడయ్యాడు. నా మాట వినని అనీల్‌ అంబానీ ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నాడు''అనే సరికి ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. బిజినెస్‌ పీపుల్‌ అనేకాదు, ఫిలిమ్‌ స్టార్స్‌ కూడా నా సలహాలు ఫాలో అవుతారు. ఫరెక్సాంపుల్‌.. మన మెగాస్టార్‌ చిరంజీవికి హిందీ సినిమాలు చేయ్యవద్దనీ తీయవద్దనీ నేనే సలహా ఇచ్చాను. అప్పట్లో చేసి ఉంటే, చాలా ఇబ్బందులు పడేవాడు'' అని చెబుతూ వుంటే నోరెళ్లబెట్టడం నా వంతయింది! అలా కబుర్లు చెబుతూనే ఉన్నాడు. కాఫీ తాగాం. బిల్లు భారీగానే వచ్చింది. నేనే చెల్లించాను. ''అప్పుడు అంత అల్లరి చిల్లరగా ఉండేవాడివి. ఇప్పుడు నిన్ను ఇంత గొప్పవాడిగా చూడడం నాకు సంతోషంగా ఉంది'' అన్నాను బైటికొచ్చాక- గీపీకృష్ణ దగ్గర్నుంచి సెలవు తీసుకుంటూ..
''నువ్వు ఊళ్లోనో ఉంటావుగా.. మళ్లీ మనం కలుసుకుందాం.. డ్రైవర్‌ నా కోసం చూస్తూ ఉంటాడు.'' అని హడావిడిగా వెళ్లిపోయాడు.
మర్నాడు- గవర్నర్‌పేటలో అనుకోకుండా మరో పాత మిత్రుడు నారాయణ కనిపించాడు. అతనూ 9వ తరగతిలో నా క్లాస్‌మేటే! ఇప్పుడు ఫైనాన్స్‌ బిజినెస్‌ చేస్తున్నట్లుగా చెప్పి, తన ఆఫీసుకు తీసుకెళ్లాడు. మాటల సందర్భంలో మా పాత మిత్రుడు గోపీకృష్ణ ప్రసక్తి వచ్చింది. నేను అతని గురించి గొప్పగా చెబుతూ, మంత్రితో మాట్లాడడం అదీ చెప్పాను. నారాయణ నవ్వాడు. ''మంత్రిదేముంది, ఎవరికైనా అలా షేక్‌ హ్యాండ్‌ ఇస్తారు. మీ స్వీచ్‌ బావుందంటే, సంతోషించి ఏదో అనుకుంటాడు. అదంతా గోపీ హౌదా అని నువ్వనుకుని ఉంటావ్‌. వాడు నీకు అంబానీ గురించీ, మెగాస్టార్‌ గురించి కూడా చెప్పి ఉండాలే'' అన్నాడు. ''అవును'' అన్నాను. నారాయణ వంక ఆశ్చర్యంగా చూస్తూ.
''పూర్‌ ఫెలో.. వాడికి ఇద్దరు కొడుకులు. మంచి పొజిషన్‌లోనే ఉన్నారు. ఈ ఊళ్లోనే ఉంటారు. వేర్వేరు కాపురాలు. గోపీకృష్ణ భార్య చనిపోయింది. వాణ్ణి ఏ కొడుకూ పట్టించుకోడు. కోడళ్లు తిడుతూనే తిండి పెడతారని- ఇంట్లో భోజనం చెయ్యడు. రాత్రుళ్లు మాత్రం ఎవరింట్లోనైనా ఓ మూల పడుకుని, పొద్దునే స్నానం చేసి ఊళ్లోకి వచ్చేస్తాడు. అందరితోనూ- పెద్దవాళ్లంతా తనకు తెలుసని గొప్పలు చెబుతుంటాడు. అంతేకానీ ఎవరికీ తన సొంత బాధలు చెప్పుకోడు. వాడి మాటలు నమ్మి ఎవరైనా హౌటల్‌కు తీసుకెళ్తేనే వాడి కడుపు నిండేది'' అన్నాడు జాలిగా. నారాయణ గోపీకృష్ణ చెప్పింది విని షాకయ్యాను. పైకి విలాసంగా ఉన్నట్లు కనిపించే గోపీకృష్ణలో ఇంత విషాదం దాగి వుందా.. తన దయనీయ స్థితికి ఎన్ని అందమైన రంగులు అద్దుతున్నాడు!
మళ్లీ కొన్ని రోజుల తర్వాత- గోపీకృష్ణ మేము ఇంతకు ముందు వెళ్లిన ఆ హౌటల్‌ దగ్గరే కనిపించాడు. ఈసారి ఇద్దరం కలిసి భోజనం చేశాం.. నేను నారాయణ కలుసుకున్న సంగతి, గోపీకృష్ణ గురించిన చేదు నిజాలు నేను తెలుసుకున్న సంగతేది అతనితో చెప్పలేదు. నా కుటుంబ విషయాలు అడిగితే చెప్పాను.
''అన్నట్లు మీ అబ్బాయికి ముకేశ్‌ అంబానీ దగ్గర ఏదైనా పెద్ద ఉద్యోగం కావాలంటే చెప్పు. నేను అంబానీకి లెటర్‌ రాసి ఇస్తాను'' అన్నాడు గోపీకృష్ణ తన మామూలు ధోరణిలో.
నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

- బి.కె.ఈశ్వర్‌,
9885447306

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు

తాజా వార్తలు

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

11:58 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

11:36 AM

ఖమ్మం జిల్లాలో దారుణం..

11:16 AM

బయటపడిన 14 కోట్ల సంవత్సరాల నాటి టిటానోసారస్ అవశేషాలు

10:57 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

10:34 AM

బార్లలో 2+1 స్పెషల్ ఆఫర్లు..

10:13 AM

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.