Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పుట్టిన ఊరు | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Dec 20,2020

పుట్టిన ఊరు

'ఛి... దీనెమ్మ జీవితం రాత్రి నిదరుండదు. పగలు సుఖముండదు' నిద్రలేస్తూ స్వగతమే అయినా బహిరంగంగా చెప్తున్న నాదముని మాటలు వింటూ క్షణం గుమ్మం ముందు కల్లాపి చల్లటం ఆపింది రేణుకమ్మ. ఆ తర్వాత యథాప్రకారం కల్లాపి చల్లి, ముగ్గులేసి లోపలికి కదిలింది. అప్పటికి నాదముని పళ్లు తోముకొని చద్దన్నం కోసం సిద్ధంగా కూర్చొని వున్నాడు.చద్దన్నం గిన్నె తెచ్చి ముందు పెట్టింది రేణుకమ్మ. ఉదయాన్నే చద్దన్నం యిష్టంగా తింటాడు నాదముని. కాని యివాళ ముద్ద గొంతు దిగటం లేదు. తలలో కోలం కడుపులోకి దిగిపోయింది. అప్పుడే భార్య ఉల్లిపాయ తెచ్చి యిచ్చింది.
''వద్దులే..'' అంటూ గిన్నెముందు నుంచి లేచిపోయాడు నాదముని.
''తినేసి వెళ్లు. మధ్యాన్నం దాకా ఖాళీ కడుపుతో ఎట్లా పని చేస్తావు?'' రేణుకమ్మ ఒకమాట అంది.
''ఆ దొరబాబులకి కావలసింది అదేగదా! మనం తిన్నా తినకపోయినా, వాళ్లు పిలిచిన వెంటనే పెట్టె చేతబట్టుకొని గీకటానికి రెడీగా వాళ్ల గుమ్మంలో నిలబడాలి. ఇంకా తెల్లారకుండానే కబురు పంపుతారు'' భార్యతో నెమ్మదిగానే మాట్లాడుతున్నా కడుపులో దిగివున్న కోపం మాటల్లో బైటికొస్తున్నట్టుగా అనిపించింది నాదమునికి.
''ఏం... చేస్తావు.. నువ్వు చేసే పని అదేనాయె. మంగలివాళ్లని వుదయాన్నే కాకపోతే మిట్ట మధ్యాహ్నంగా పిలుస్తారా? ఎవరైనా. ఆ మాత్రం దానికి చద్దన్నం మీద కోపం చూపితే సరిపోతుందా? నాలుగు ముద్దలు తినేసి వెళ్లు. ప్రెసిడెంటు పొద్దెక్కాక కాని నిద్దరలేవడు. రా.. కూర్చొని తినెరు.. నేను పిల్లలిద్దర్నీ బడికి సిద్ధం చేయాలి'' భార్యకి దేవుడు యింత సహనం ఎందుకిచ్చాడో ఇప్పటివరకూ అర్థం కాలేదు నాదమునికి. కోపాన్ని పక్కనపెట్టి వెళ్లి చద్దన్నం గిన్నె ముందు కూచున్నాడు.
కొండకిందపల్లె గ్రామంలో మహా అంటే మూడొందలు గడపలుంటాయి. ఆ వూరికి ఏకైక నాయీబ్రాహ్మడు నాదముని. పంచాయితీ కాకపోయినా ప్రెసిడెంటు మాత్రం ఆ వూళ్లోనే వుంటున్నాడు. ప్రెసిడెంటు గారి కోసం ఆయన యిద్దరు తైనాతీలు కూడా అక్కడే కాపురం పెట్టారు. ప్రతిరోజూ ఆ ముగ్గురికీ గెడ్డం గీకవల్సింది నాదమునే. అప్పటి వరకు చెట్టుకింద బంకు తెరవటానికి వీల్లేదు. ఇలా అని శాసనం ఏదీ లేకపోయినా, ఆ ఆనవాయితీ మాత్రం శాసనంగానే చెల్లుబాటు అవుతూ వస్తుంది యిప్పటిదాకా. ఉదయం కోడికూతకు ముందే ఏదో వొకింటి నుండి కబురొస్తుంది. ఎప్పటిలానే విసుక్కుంటూ నిద్దరలేస్తాడు నాదముని. ఆ తర్వాత కార్యక్రమం షరామామూలే.
ఆపాటికి పిల్లలిద్దర్నీ స్కూలుకు సిద్ధం చేసింది రేణుకమ్మ. వాళ్లకి తలదువ్వి, పౌడరురాసి, యూనిఫాం తొడిగితే వాళ్లు ఏ గొప్పింటి పిల్లల్లాగో కనబడుతున్నారు. కన్నార్పకుండా తన యిద్దరు పిల్లల్నే చూస్తూ నిలబడ్డాడు నాదముని.
''ఏందయ్యా! నీ పిల్లలు కానట్టు కొత్తగా చూస్తున్నావు వాళ్లని. నీ దిష్టే తగిలేట్టు వుంది వాళ్లకి'' రేణుకమ్మ మాటలకి వులికిపడ్డాడు నాదముని.
''నిజమే. నా దిష్టే తగిలేట్టుంది. బుగ్గన కాటుక చుక్క పెట్టు పిల్లలకి. అసలే వాళ్ల అయ్యోరమ్మ కళ్లు మంచివి కావు. గొడ్డుమోతు కళ్లు'' అన్నాడు తేరుకొని.
''పెట్టానులే అరికాళ్లకి. నువ్వు కదులు. స్కూలు గంట కొట్టే వేళయింది'' భార్య మాటలకి ఓసారి గడియారం వైపు చూస్తూ బైల్దేరాడు నాదముని పిల్లలతో పాటు.
పిల్లలిద్దర్నీ స్కూలు వద్ద దిగబెట్టి ప్రెసిడెంటు గారి యింటికి చేరుకొనే వేళకి పెరట్లో రెడీగా కూచొని వున్నాడాయన. ఆ కళ్లు చూడగానే అర్థమైపోయింది నాదమునికి, అవెందుకంత ఎర్రబడ్డాయో.
''ఈ పిలకాయలకి చదువెందుకే ఎట్టాగూ పెద్దయ్యాక మన కులవత్తే కదా చేసుక బతకాల్సిందని చిలక్కి చెప్పినట్టు చెప్పినా మా యింటిది యినుకోదయ్యా! ఇదిగో వాళ్లని స్కూలు దగ్గెర దిగబెట్టి వచ్చేతలికి యింత లేటయింది''.
''ఏటన్నావూ... సర్లే కూర్చో..'' పొడిపొడిగా మూడు ముక్కలు చెప్పేసి చెంబెట్టుకొని వెళ్లిపోయాడు ప్రెసిడెంటు.
ఎక్కడో కాలినట్టయింది నాదమునికి. పిల్లలు జీడి కోసం ఆ తీరుగ యేడుస్తున్నా ఆలస్యమైపోతుందని వాళ్లని స్కూలు దగ్గిర దిగబెట్టి వచ్చాడు. ఆ పసివాళ్ల ముఖమే కళ్లలో తిరుగుతుంది యింకా. అప్పటికే ఏదో మునిగిపోయినట్టు ముఖం పెట్టిన ప్రెసిడెంటు తీరా తాను పెట్టె తెరిచే సరికి 'సర్లే కూర్చో.. వస్తాను..'' అని చెంబెట్టుకెళ్తుంటే అరికాలి మంట నడినెత్తికి చేరింది. 'పల్లెటూళ్లో పుట్టి కులవత్తి చేసుకొంటున్న పాపానికి యిలాంటివి యింకెన్ని భరించాలో' అనుకున్నాడు నాదముని. అటు రచ్చబండ దగ్గిర బంకు ముందు ఎంత మంది ఎదురుచూస్తున్నారో అన్న ఆలోచన వచ్చే సరికి ప్రెసిడెంటు మీదా పీకలదాకా కోపం వచ్చింది.
కాని పేదవాడి కోపం పెదవికి చేటు.
 
బంకు తెరిచేసరికి సూర్యుడు నెత్తికెక్కాడు. అప్పటికే వొకరిద్దరు కస్టమర్లు తిరిగి వెళ్లిపోయారని తెలిసి ప్రెసిడెంటుకి శాపం పెట్టాలన్నంత కోపం వచ్చింది. మూడొందల గడపల్లోంచి రోజుకి వచ్చేదే పదిమంది. ఆ పదిమందిలో ముగ్గురో నలుగురో అరువు బేరాలుంటాయి. అలా రోజుకి రెండొందలో, రెండొందల పాతికో చేతబట్టుకొని యింటికెళ్లి పెళ్లాం చేతిలో పెడితే ఆమె వొదిలే దీర్ఘ నిస్పహ చూళ్లేక చాలా మార్లు ఊరొదలి పట్నం వెళ్లిపోదామన్న ప్రస్తావన తీసుకొచ్చాడు నాదముని.
''పట్నం బోతే పట్నమంత ఖర్చులు కూడా వుంటాయి. వద్దులెయ్యా! కలో గంజో యిక్కడే కాచుకొని తాగుదాం. పరిగెత్తి పాలు తాగటం దేనికి?'' అంటూ కొట్టి పారేసింది రేణుకమ్మ.
అలా అలా ఆ సమస్య భార్యాభర్తలిద్దరి మధ్యా నానుతూనే వుంది. కొద్దిగా భార్య తన ఆలోచన్ని సమర్ధించి వుంటే ఈ పాటికి పట్నంలో ఎక్కడో ఓ చోట సెటిల్‌ అయిపోయి వుండేవాడు నాదముని. ఆ సమర్థత లేకపోబట్టే యింకా కొండమీద పల్లెలోనే బండరాయిలా మిగిలిపోయాడు.
చెప్పుకోవాలంటే ఆ రోజు నాదముని ఆదాయం అక్షరాలా నూటా యిరవై రెండు రూపాయలు. అదే పట్నంలో అయివుంటే చివర మరో సున్నాచేరి వెయ్యిన్ని రెండొందల యిరవై రూపాయలు అయివుండేది. రాత్రి బంకు మూసుకొని ఇంటికి వెళ్తుంటే నాదముని కళ్లలో నీళ్లు తిరిగాయి. బరువెక్కిన గుండెతో అలా గుడి ముందు నుండి వెళ్తుంటే పట్నం వెళ్లే బస్సు అప్పుడే వచ్చి ఆగింది. సన్నాబత్తిని వెంకటేశ్వర్లు బస్సు దిగి యెదురొచ్చాడు. పట్నంలో వడ్రంగి పని చేస్తుంటాడు. నెలకోసారి వూరికొచ్చి అమ్మానాన్న చేతుల్లో సంపాదనంతా పెట్టి తిరిగి మరునాడు పట్నం వెళ్లిపోతుంటాడు.
''ఏంటి నాదమునీ! యింటికేనా?'' పలకరించాడు వెంకటేశ్వర్లు.
''ఔను వెంకటేశూ! నువ్వు పట్నం నుంచేనా?'' ముగించేలోగానే ''ఆ.. అమ్మానాన్నకి డబ్బులిచ్చి వెళ్దమని వచ్చా'' అన్నాడు వెంకటేశ్వర్లు.
''ఎలా వుంది పట్నం?'' అని అడిగాడు మళ్లీ.
''నువ్వెన్ని చెప్పు నాదమునీ! పట్నం పట్నమే. అంతా మహరాజ భోగమే అనుకో. ఎంత అదష్టం చేసుకొంటే పట్నంలో పుడతాడో మనిషి'' అలా వర్ణిస్తున్నప్పుడు వెంకటేశ్వర్లు ముఖంలో కోటిసూర్యుళ్లు వెలగటం గమనించాడు నాదముని.
''అంతేగా మరి. వెళ్లొస్తా వెంకటేశూ!'' అంటూ వీధి మలుపు తిరిగాడు నాదముని.
ఆ రాత్రంతా నాదముని దీర్ఘ తపస్సులోకి వెళ్లిపోయాడు. రేణుకమ్మ వొకటికి నాలుగుసార్లు పలకరించినా బదులివ్వలేదు. భర్త వేదన అర్థం చేసుకున్నట్టు రేణుకమ్మ పట్నం వెళ్లే పనుల్లో మునిగిపోయింది.
 
నిజం చెప్పాలంటే నాదముని చాలా అదష్టవంతుడు. కనుకనే అంతపెద్ద చలువ అద్దాలు బిగించిన ఏ.సి. సెలూన్‌లో కుదురుకున్నాడు. నాగరాజు షాపుకి వోనరన్నమాటే కాని సొంత మనిషిలా నాదమునిని తనవాళ్లలో కలిపేసుకున్నాడు. అతను రావటమే షాపుకి అదనపు విలువ చేకూరినట్టైంది. అతడి వేళ్లలో వేయి మంది కళాకారుల ప్రతిభ గమనించాడు నాగరాజు. అవి కదులుతుంటే ఎవరో పెద్ద ఆర్టిస్టు ప్రపంచాన్ని మురిపించే బొమ్మ గీస్తున్నట్టు ఫీలయ్యాడు. ఆ వేళ్ల కదలికలోని చాకచక్యం తనుకూడా చేసి ప్రయత్నించాడు. కాని ఫలితం మరో విధంగా రావటంతో మానుకున్నాడు.
నాగరాజే చొరవ తీసుకొని తను వుండే కాలనీలోనే ఓ మోస్తరు యిల్లు చూసిపెట్టాడు. పెళ్లాం పిల్లల్ని తీసుకురావటానికి నాదముని అడగకుండానే పైకం సర్ది అతడి చేతుల్లో పెట్టాడు. అతణ్ణి బస్సెక్కించటానికి తన మోటారు సైకిల్‌పైనే తీసుకెళ్లాడు. బస్సులో కొండదిగి పల్లెకి టికెట్టు కొనిపెట్టి, దాంతోపాటు చేతిలో ఓ ఆండ్రాయిడ్‌ పెట్టాడు. నాదముని ఆనందానికి హద్దు లేకుండా పోయింది. రెండు చేతులు జోడించి నమస్కరించాడు నాదముని.
''మన మధ్య యివన్నీ దేనికి గురూ! సాటి వర్కర్ని గౌరవించుకోలేకపోతే యింతపెద్ద నగరంలో బతకటమే దండగ'' అన్నాడు ఎంతో ఆప్యాయంగా.
''పట్నంలో మనుషులే గాని మనసున్నోళ్లు వుండరని మా పల్లెలో అందరూ అంటారు. కాని ఓనరయ్యా! వాళ్లెవరికీ మీలాంటి మనసున్నోళ్లు ఎదురుపడి వుండరు'' అన్నాడు నాదముని.
''నిజమే నాదమునీ! నగరంలో ఎవరి స్వార్ధం వాళ్లది. అందుకే అలా అనుకొని వుంటారు.'' నాగరాజు చెప్పిందీ నిజమే.
''ఏందో ఓనరయ్యా! మిమ్మల్ని, మనోళ్లనీ చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు'' నాదముని మాట ముగిసి పోకముందే డ్రైవరు బస్సెక్కి హారన్‌ కొట్టాడు.
''సరే... సరే.. జాగర్త. క్షేమంగా వెళ్లి త్వరగా వచ్చెరు'' అంటూ చేయి వూపాడు నాగరాజు.
బస్సు కలిదిలింది.
 
అప్పుడే ఆర్నెలు దాటిపోయాయి నాదముని నగరానికి షిప్ట్‌ అయ్యి. పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూలు చేర్పించాడు. వాళ్ల కోసం స్కూలు బస్సు యింటి దగ్గరికొచ్చి ఎక్కించుకొని వెళుతుంటే రేణుకమ్మ ముఖంలోకి దర్జాగా చూసేవాడు. రేణుకమ్మ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆనందం చూసి లోలోన ఎంతో మురిసిపోయేవాడు నాదముని.
మంచిరోజులు ఎలా గడిచిపోతాయో ఎవరూ గమనించరు. పొద్దు పొడవటమూ పొద్దు వాలటమూ మాత్రమే తెలుస్తుంటుంది. అంతే.
చూస్తూ చూస్తూనే పిల్లలిద్దరూ బీటెక్‌ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో వుద్యోగాలు సంపాదించారు. వాళ్లకొరకు కంపెనీ కార్లు యింటికి రావటం చూస్తుంటే తను వూహించిన దానికన్నా ఎక్కువే సాధించానన్న తప్తి నాదమునికి. పైగా నాగరాజు తను ఇద్దరు కూతుళ్లనీ కోరి మరీ నాదముని కొడుకులకిచ్చి పెళ్లి చేయటం స్వర్గానికి నిచ్చెనలు వేసినంత ఆనందం యిచ్చింది. కాని నగరాల రివాజు నాదమునిలో వొక సైద్ధాంతిక విరక్తి తీసుకొస్తుందని వూహించలేకపోయాడు.
నాగరాజు తన యిద్దరు బిడ్డలకి రెండు ప్లాట్లు అపార్ట్‌మెంట్‌లో కొనిపెట్టి, వాళ్ల కాపురాన్ని విడదీయటంతో నాదమునిలో ఏదో తెలియని విరక్తి తన ప్రమేయం లేకుండానే ప్రవేశించింది. ఒక శ్వాసతో మొదలైన విరక్తి అన్ని శ్వాసల్నీ ఆక్రమించింది. అయినా ఏదో తప్తి. మలుపులెన్ని తిరిగినా తన జీవితంలో కొన్ని సంతప్తులూ వున్నాయి. పిల్లల్ని వున్నతంగా తీర్చి దిద్దాలనుకున్నాడు. ఆ కల నెరవేరింది. కొండకింద పల్లెలో వుండగా మెళ్లో పసుపుతాడుతో మిగిలిపోయిన భార్యని కనకమహాలక్ష్మిగా చూడాలనుకున్నాడు. చూసేశాడు. పట్నంలో తనకంటూ ఓ సొంత యిల్లు వుండాలనుకున్నాడు. అదొక్కటి మాత్రం తీరలేదు. అదీ వొకందుకు మంచిదే అనుకున్నాడు నాదముని. తను పుట్టిన వూళ్లోనే మట్టిలో కలిసిపోవాలన్న ఆనందం అది.
ఇన్నాళ్ల తర్వాత యిప్పుడు తన్నుతాను చూసుకుంటే కొట్టొచ్చినట్టు ఎంతో మార్పు. వెంట్రుకలు తెల్లబడి పోయాయి. ముఖంలో ముడతలతో పాటు ముసలి తనం పనిగట్టుకొని కనిపిస్తుంది. పట్నంలో అడుగు పెట్టిన నాటి దారుఢ్యం, ఉత్సాహం, పట్టదల పేరుకైనా లేదు. వద్ధాప్యం వస్తూ వస్తూ నిలకడలేని ఆలోచనల్ని వెంటబెట్టుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ కొండకిందపల్లె మాటిమాటికీ గుర్తొస్తుంది. కలల్లో కూడా తను పుట్టిన వూరు తనని వెంటాడుతుంది.
ఆ రోజు రాత్రి...
''ఏమే! పట్నంలో మనం వచ్చిన పని అయిపోయిందికదూ!'' అని మాట కదిపాడు నాదముని.
''ఏ పనయ్యా! ఏమై పోయింది?'' ఆశ్చర్యంగా రేణుకమ్మ ప్రశ్న వేసింది.
''అదే... పిల్లల్ని బాగా చదివించాలి. వాళ్లని మంచి వుద్యోగంలో చేర్పించాలి. మంచి యింట్లో పెళ్లిళ్లు చేయాలి. ఇంకేం మిగిలింది చేయాల్సిన పని?'' సమాధానంలోనే ప్రశ్నను సంధించాడు.
''ఏందీ.. యింకేం మిగిలుందా?'' అబ్బో యింకా చాలా చాలా వుండాయి'' రేణుకమ్మ.
''ఇంకా ఏం వుండాయి'' నాదముని.
''నీ కోడళ్లు కనొద్దూ. మనవళ్లతో ఆడుకోవద్దూ. వాళ్లకి మీ అయ్యపేరు, మా అమ్మపేరు పెట్టొద్దూ...'' రేణుకమ్మ ముఖంలో తెలియని ఆనందం.
''ఏమే! నీకు సన్నాబత్తిని వెంకటేశులు గుర్తున్నాడా?'' అడిగాడు నాదముని.
''ఆయనే కదా నీకు పట్నమంటే వల్లమాలిన మక్కువ నూరిపోసింది. ఎందుకు గుర్తు వుండడు మహానుభావుడు'' కొంచెం కోపంగానే అంది.
''వెంకటేశు నెలనెలా వూరికెందుకొస్తాడు అమ్మానాన్నని పలకరించటానికి, పెళ్లాం పిల్లల్ని చూసుకోవడానికి'' ఆ పాటికే అర్థమైపోయింది రేణుకమ్మకి. వెంటనే అంది..
''ఆ..ఆ.. చాల్లే సంబడం. వెంకటేశు పుట్టింది, పెరిగిందీ కొందకిందపల్లెలోనే. నీ పిల్లలు అట్టా కాదు కదా. వాళ్లు వూళ్లో పుట్టినా పెరిగి పెద్దోళ్లైంది పట్నంలోనే. ఆ తేడా తెలుసుకుంటే నీకే అర్థమౌతుంది.''
''అర్థమయ్యిందే కాని ఆ వెంకటేశులు నాన్నని నువ్వు చూల్లేదు కాని, కొడుకు వచ్చి

వెళ్లిన ప్రతిసారీ వూళ్లో మారాజులా తలెత్తుకు తిరుగుతుంటాడు. సింహం అంటే సింహం లాగా అనుకో'' గర్వంగా నాదముని చెబుతుంటే కథ మొత్తం అర్థం అయిపోయింది రేణుకమ్మకి.
లేచి వస్తువులు సర్దటం మొదలెట్టింది.
 
కొండకింది పల్లెకి నాదముని తిరిగి రావటం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. కారణం పదిహేను, యిరవై యేండ్లనాటి వూరు కాదిప్పుడు అది. అందులోనూ నాదమునికి తెలిసిన వూరూ కాదు. ఊరు మొత్తం మారిపోయింది. అపార్టుమెంట్లు కాకపోయినా అపార్టుమెంటు లాంటి మేడలు వెలిశాయి. మేడలకి కిరీటం పెట్టినట్టు సెల్‌టవర్లు లేచాయి. పట్నంలో లాగ పెద్ద పెద్ద హౌర్డింగులు వెలిశాయి. ఏ.సి. షాపులైతే లెక్కపెట్టుకోనవసరం లేదు. పదేళ్లకిందటే పంచాయితీగా మారిన కొండకింది పల్లె యెదిగి యెదిగి మండల స్థాయికి చేరుకొంది. ఊరి చివర నిర్మించిన సిమెంటు ఫ్యాక్టరీ, గ్రానైట్‌ ఫ్యాక్టరీ పారిశ్రామికంగా వూరికి మంచి పేరు తీసుకొచ్చాయి. చిన్నా చితక గహ పరిశ్రమలు, అగరొత్తుల కంపెనీలు సరేసరి.
తను బంకుపెట్టిన రచ్చబండ యిప్పుడు కూరగాయల మార్కెట్టుగా మారిపోయింది. తన బంకు జాడ కూడా లేదక్కడ. పుట్టినూరు మీద మోజు అన్న మాటే కాని తను పుట్టింది ఈ వూళ్లోనేనా అన్న అనుమానమూ వచ్చింది నాదమునికి. ఎప్పుడో కూలిపోయి, శిథిలాలుగా మిగిలిన రాజులకోటను మళ్లీ కట్టి కొత్తగా రంగులేసి సీరియల్‌ బట్టలతో సింగారించినట్టు వూరు ధగధగలాడి పోతుంది. వొక్కరంటే వొక్కరు కూడా గుర్తుపట్టే ముఖం కనిపించలేదు. లక్షాధికారులు, కోటీశ్వర్లు మూకుమ్మడిగా దాడిచేసి ఆక్రమించుకున్నట్టు కొత్తగా కనిపించింది వూరు నాదమునికి.
కార్లు, బైక్‌ మోటార్ల హడావిడి మధ్య నిరాశగా వెనక్కి తిరిగాడు నాదముని. అతడి చేతిలోని మంగలి పెట్టె అతణ్ణి వెక్కిరిస్తున్నట్టు అనిపించింది.
సిగ్గుతో తలదించుకున్నాడు నాదముని!

- ఈతకోట సుబ్బారావు,
94405 29785

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
ముసుగు

తాజా వార్తలు

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.