Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నేను తిన నీకు బెట్ట | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

నేను తిన నీకు బెట్ట

జోగులాపురంలో ఆంజనేయులు అనే వ్యాపారి ఉండేటోడు. అతను కిరాణా వ్యాపారం, మిత్తి వ్యాపారం జేసి రెండు చేతుల సంపాదించి లక్షలు కూడబెట్టిండు. కానీ అతను పరమలోభి. అన్నం తినే చేత్తో కాకిని తరిమితే అన్నం మెతుకులు ఎక్కడ కింద పడతాయో అని భయపడేటోడు. పిల్లికి బిచ్చం బెట్టి ఎరగడు. అతని భార్య నరసమ్మ, అతనికి ఇద్దరు కొడుకులు అజరు, విజరులు. అతని పిసినారితనాన్ని రోజు తిట్టుకొనేవారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం, ఇంట్లో పండగలు కానీ, పిల్లల పుట్టినరోజులకు కానీ ఒక్క వేడుక జరిపించే వాడు కాదు. ఉన్న సంపదనంతా ఇనప పెట్టెలో దాచి పెట్టి రోజు చూసుకుంటూ మురిసిపోతూ, పైకి మాత్రం ఏమీలేని కటిక దరిద్రుడిగా కనిపించేటోడు. పిల్లలకు కూడా ఏడాదికి ఒకసారైనా బట్టలు కొనేటోడు కాదు. చినిగిన బట్టలు వేసుకుని వాళ్ళు బడికి పోవాల్సివచ్చేది. భార్య, బిడ్డలకు తిండి కూడా సరిగా పెట్టేటోడు కాదు. ఊర్లో అంతా అతన్ని పిసినారి ఆంజనేయులు అనేటోళ్లు.
ఊర్లో కానీ, పక్క ఊర్లలో కానీ కాస్త ముఖ పరిచయం ఉన్న వాళ్ళు అయినా, దూరపు చుట్టాలైనా సరే మాటవరసకు వాళ్ళ ఇళ్లలో జరిగే వేడుకలకు ఆంజనేయులును పిలిస్తే చాలు, మొత్తం కుటుంబంతో సహా హాజరై విందుభోజనం చేసి, ఆ పూటకు భోజనం ఖర్చు మిగిలింది అని ఆనందించేవాడు. తాము ఎవరిని ఏ వేడుకకు పిలువక, ముఖ పరిచయం కూడా లేని వాళ్ళ వేడుకలకు ఆంజనేయులు బలవంతం మీద వెళ్లి, అక్కడ విందుభోజనం తినేదానికి అతని భార్య, పిల్లలు సిగ్గుతో చచ్చేటోరు. పిసినారి ఆంజనేయులు పిల్లలు అని అందరు గుసగుసగా అనుకుంటుంటే వాళ్ళకి తల తీసేసినట్టు ఉండేది. ఆంజనేయులు మాత్రం ఎవరేం అనుకున్న మొహమాటం లేకుండా తిని, విందు భోజనంలో మిగిలినవాటిని పొట్లం కట్టించుకుని మరి ఇంటికి తెచ్చుకునేవాడు. అలా నెలలో సగం రోజులు వాళ్ళ ఇంటిలో పొయ్యి వెలిగేది కాదు.
ఆంజనేయులుకు రోజులు ఇలా గడుస్తుండగా ఓ రోజు పొరుగూరిలో దూరపు చుట్టాల ఇంటిలో పెళ్లి అన్న సంగతి గుర్తుకు వచ్చింది. ఎప్పుడో నెల రోజుల క్రితం సంతలో ఎదురైనా చుట్టం మొహమాటానికి వాళ్ళ బిడ్డ పెళ్లి అని శుభలేఖ ఇస్తే అది గుర్తుపెట్టుకుని ఆ రోజు సాయంత్రం ఆదర బాదర గా భార్య, బిడ్డలతో పక్కూరికి బయలుదేరిండు. పెళ్లి వేకువజామున అవడంతో ఆ రాత్రికి వాళ్ళు పెళ్ళివాళ్ళ ఇంటిలోనే ఉండిపోయారు.
పక్కరోజు పొద్దున ఇంటికి వచ్చిన ఆంజనేయులుకు ఇంటి తాళం తీసినట్టు ఉండడంతో గుండె గుభేలుమని ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇంకేం ఉంది. ఇనుప పెట్టి తాళం పగులగొట్టి డబ్బునంతా ఎవరో దొంగలు దోచుకుపోయారు. డబ్బు, నగలే కాకుండా, ఇంటి ముందర ఉన్న కిరాణా అంగడి సామానంతా దోచుకుని ఇంటిని ఆగమాగం జేసీపోయిండ్రు తాను తినక, ఇంకోళ్ళకి పెట్టక కూడబెట్టిన సొమ్మంతా దొంగలు దోచుకుపోయేసరికి నెత్తి, నోరు బాదుకుంటూ భార్య, పిల్లలతో కట్టుబట్టలతో నిలబడ్డాడు ఆంజనేయులు. పిసినారి ఆంజనేయులుకు తగిన శాస్తి జరిగింది అని ఊరివాళ్ళు సంతోషించినా, సహదయురాలు అయిన అతని ఇల్లాలు నరసమ్మ, అమాయకులైన పిల్లల ముఖాలు చూసి జాలిపడి ఊరివాళ్ళు అందరు తలా కొంత చందాలు వేసుకుని కొంత సొమ్ము ఆంజనేయులుకు ఇచ్చారు. ఇంతకాలం తాను మిత్తీల కోసం ఊరివాళ్లను పీడించినా వాళ్ళందరూ తనకి సాయపడడం చూసి ఆంజనేయులుకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత కాలం తాను ఏం కోల్పోయాడో తెలిసి వచ్చింది. ఎవరో కవి చెప్పినట్టు ''తనుతినక, ఇతరులకు పెట్టక కూడపెట్టిన సొమ్మంతా తుదకు దొరలపాలౌనో, దొంగలపాలౌనో, తేనెటీగలు కూడపెట్టిన తెనేనంతా తెరువరులకు ఇచ్చినట్టు'' తన సొమ్ము అంతా దొంగల పాలైయింది అని ఆంజనేయులు బుద్ధి తెచ్చుకుని ఆ రోజు నుండి మిత్తీ వ్యాపారం మానేసి, ఊరివాళ్ళు ఇచ్చిన సొమ్ముతో, పిల్లలిద్దరి సాయంతో కష్టపడి కిరాణా వ్యాపారంని చేసి అనతి కాలంలోనే మళ్ళీ ధనవంతుడు అయినాడు. ఇప్పుడు మాత్రం సంపాదించినా పైసలును తాను, తన కుటుంబం అనుభవించడమే కాకుండా, కొంత సొమ్మును అవసరం అని అడిగిన వాళ్లకు సాయం చేయడం అలవాటు చేసుకున్నాడు. దాంతో ఆంజనేయులు ఇపుడు పిసినారి ఆంజనేయులుగా కాకా దానం చేసే ఆంజనేయులుగా పేరు తెచ్చుకున్నాడు.

- రోహిణి వంజరి,
9000594630

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు
ముసుగు
మృగరాజు ఎన్నిక
పరిమళించిన మానవత్వం
అమ్మమ్మ కథ..!!
సావిత్రి
శత్రుత్వం మరచి... స్నేహంతో
గెలుపు గీతం
1974 లవ్‌ స్టోరీ
ప్రతిబింబం
అమ్మకం అదిరింది..!
ఎవరు హీరో
మైత్రీవనం
అమ్మ మాట
అగ్గువ బతుకులు

తాజా వార్తలు

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.