Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముగ్గు | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Jan 30,2021

ముగ్గు

''జాబ్‌లో చేరి ఐదు వెళ్లి ఆరో నెల వస్తోంది.. ఇంకా నీకు పని అలవాటు కాలేదు. ఒక్క మంచి వార్త ఇచ్చావా ఈ రోజుకి'' డెస్క్‌ ఇన్‌చార్జి అడిగేసరికి అందరి ముందు తలదించుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను..
సర్‌.. ఇస్తాను... నీళ్లు నములుతూనే చెప్పాను..
ఎప్పుడింకా నువ్విచ్చేది.. తెల్లారిందంటే చాలు ఎడిషన్‌ ఇన్‌చార్జి ఫోన్‌ చేసి నానా మాటలు అంటున్నాడు... ఎవరెవరు ఎన్ని స్టోరీ ప్లాన్స్‌ ఇస్తున్నారు, ఇప్పటి వరకూ ఎన్ని ఇచ్చారు చెప్పు అంటూ లెక్కలు అడుగుతున్నారు.. హ్యుమన్‌ యాంగిల్‌ స్టోరీస్‌ ఇప్పటివరకూ నువ్వెన్నిచ్చావో చెప్పమంటున్నారు.. ఏం చెప్పమంటావ్‌... నీ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు.. ఉద్యోగంలో చేరాక ఒక్క బంబార్డ్‌ ఐటం ఏమన్నా ఇచ్చావా అంటే... ఎప్పుడూ సప్పటి కూరల్లాంటి వార్తలేనాయే అనుకుని తల బాదుకుంటున్నాడు...
అది కాదు సర్‌... ఇస్తాను అన్నాను నిమ్మళంగా...
నా కర్మ కాకపోతే మరేంటి చెప్పు.. ఎన్ని సార్లని వెనకేసుకు రమ్మంటావ్‌.. లాక్‌డౌన్‌ కదా... కుటుంబ పరిస్థితి బాలేదంటే పెద్దాయన్ని ఒప్పించి చిన్న రిపోర్టర్‌గా ఉద్యోగం ఇప్పించాను.. నా పరువు నిలువునా తీసేస్తున్నావ్‌ గదయ్యా..
నన్ను తిడుతూనే టేబుల్‌ మీద ఉన్నవన్నీ సర్దేసి.. నా ముఖానికేసి సూటిగా చూసి... విన్నావ్‌ కదా.. ఇంక నీ ఏడుపు నువ్‌ ఏడువ్‌... అనేసి తల బాదుకుంటూ చారు తాగడానికి కిందకి వెళ్లిపోయాడు... కాసేపు నన్ను నేను తిట్టుకుంటూనే అక్కడ కూర్చుని ఆ రోజుకో నాలుగు స్పాట్‌ వార్తలుంటే టైప్‌ చేసి ఇచ్చేసి బయల్దేరాను... నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటుంది.. ఏ పని చేసినా అందులో నేను కనబడాలనుకునే టైపు... అందుకే కొంచెం లేటుగా కాదు కాదు చాలా లేటుగా చేసినా దానికొచ్చే పేరు ప్రఖ్యాతలు నన్ను వేరే లెవెల్‌కి తీసుకెళ్తాయంటే మీరు నమ్మరు... ఎన్ని హ్యూమన్‌ యాంగిల్‌ స్టోరీస్‌ ఇచ్చినా ఈ ఎడిషన్‌ ఇన్‌చార్జికి దాహం తీరదు.. ఇంకా ఇంకా కావాలని పోరుతూనే ఉంటాడు... అసలు వార్తంటే ఎలా ఉండాలి... చదివిన వారెవరైనా అందులో తమను తాము చూసుకోవాలి.. ఆ బాధ వాళ్లకే జరిగిందన్నట్లుగా భావించాలి.. చదివిన వాళ్ల మనస్సుల్లో ఆ కథ ఎప్పటికీ చెరగని ముద్ర వేయాలి. అదే నేను నేర్చుకున్నది... అదే ఇప్పటికీ నేను అమలు చేసేది... కాని హడావుడిగా స్టోరీలు, స్టోరీలు అని వెంటబడితే అందులో ఉండాల్సిన కన్నీళ్లు, లోతైన గాథలు, ఎక్కడుంటాయి.. మొక్కు బడిగా రాసేసి డెస్కులో ఇచ్చేయాలంటారు... అలా రాసినం దుకు తర్వాత జనాలు నన్ను చీవాట్లు పెట్టకుండా ఉంటారా... ఛ... మనసులోనే అనుకుంటూ ఇంటికి బయల్దేరాను...
ఇంట్లో వాళ్లకి ఈ బాధలు తెలియవు కాబట్టి ప్రశాంతంగా నాతో నాలుగు కబుర్లు పంచుకుంటారు. అదే నాకు కొంతలో కొంత ఆనందాన్నిచ్చే విషయం... నేను కట్టుకున్న ఈ చిన్న పెంకుటింటిలో అడుగుపెడితే చాలు ఉదయం నుంచి ఎవరితో ఎన్ని తిట్లు తిన్నా అవన్నీ మరిచిపోతాను.. కాస్త అన్నం తిని అలా నులక మంచమ్మీద నా కూతురితో కబుర్లు చెబుతూ పడుకుంటే వచ్చే సంతోషం నాకు ఎందులోనూ దొరకదు..
చెప్పులు బయట విడిచి చేతులు, కాళ్లు కడుక్కుని అమ్మా.. బంగారం... ఎక్కడా అనగానే కాళ్లకు చుట్టేసుకుని నడుం చుట్టూ చేతులేసి నన్ను గిరగిరా తిప్పేసి 'ఇక్కడే ఉన్నా...' అంది కిలకిలా నవ్వుతూ...
ఏంటి తల్లి.. ఆమ్‌ తిన్నావా.. బుగ్గల మీద ముద్దులిస్తూ అడిగాను. లేదు నాన్నా.. నీకోసమే కూర్చున్నాను అనడంతో.. ఏం తల్లి ఎందుకు నాకోసం కూర్చున్నావ్‌.. 'అమ్మా నాన్నొచ్చాడు అన్నం పెట్టు' అరిచేసరికి.. 'వస్తున్నా...' అంది సుమతి.
పళ్లాలు, కూరగిన్నెలు వంట గదిలోంచి తెస్తూ.. 'ఈ రోజు ఆన్‌లైన్‌ క్లాసులో రైతుల గురించి చెప్పమని టెస్ట్‌ పెట్టారు వాళ్ల టీచర్‌.. గుక్క తిప్పుకోకుండా టకటకా చెప్పేసింది.. వాళ్ల టీచర్లు, ప్రిన్సిపాల్‌ అందరూ బాగా మెచ్చుకున్నారు.. ఆ సంతోషం పట్టలేకే నీ కూతురు ఈ రోజు నీతో కలిసి భోజనం చేస్తానందయ్యా...' అని చెప్పేసరికి 'నిజమా... గుడ్‌ వెరీ గుడ్‌...నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ చాలా ఆనందంగా ఉందిరా తల్లి నిన్ను చూస్తుంటే' అన్నాను... నేను మా డెస్క్‌ ఇన్‌ చార్జి పేరు నిలబెట్ట లేకపోయినా నువ్వు మాత్రం ఈ నాన్న పేరు నిలబెట్టావ్‌ అనుకుని మనసులోనే ఆశీర్వదించా...
ఆ... ఎవరి కూతురు మరి.. ఒక రిపోర్టర్‌ కూతురు కదా.. మీలాగే అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువ.. ఊరంతా చుట్టబెట్టి వస్తుంది... అలాగే అదిగో ఆ ఊరి మూల ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు కాని కొద్ది రోజులుగా ఓ పిచ్చిది దాని కొడుకు అక్కడుంటున్నారు... నీ కూతురు వెళ్లి ఏం మాట్లాడిందో, ఏం తెలుసుకుందో రైతు గురించి గడగడా గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. అదలా చెప్తుంటే నేనే ఆశ్చర్య పోయాను..అంది సుమతి బుగ్గలు నొక్కుకుంటూ...
నిజమా సుమతి... నమ్మలేకపోతున్నాను... నాన్న పోలికలు కూతుళ్లకే వస్తాయంటారుగా... ఎక్కడికి పోతాయి మరి... తింటా ఉండు... ఒడియాలు వేయించుకొస్తానంటూ వంటగదిలోకెళ్లింది సుమతి... బంగారానికి ముద్దలు కలిపి అలా అన్నం పెడుతుంటే ఏంటో నా కంట్లోంచి నీళ్లు అలా పొంగుకొచ్చేశాయి...
'ఎందుకు నాన్న ఏడుస్తున్నావ్‌..' అంటూ కళ్లు తుడిచింది..
ఏం లేదమ్మా... ఏం లేదు తిను.. తిను అంటూ గబగబా ముద్దలు పెట్టాను.
నాన్న చాలు నా పొట్ట నిండిపోయింది.. ఇంక చాలు, చాలు అంటున్నా నా చెవికెక్కలేదు.. ఇంకా పెట్టు, పెట్టు అన్నట్టుగా వినిపించి రోజు బంగారం తాను తినేదాని కంటే నేను నాలుగు ముద్దలు ఎక్కువ పెట్టేశాను... బంగారంతో పాటు నేను ఎక్కువగానే లాగించేశాను... మేం చేతులు కడుక్కుని వచ్చేసరికి సుమతి వరండాలో నులక మంచమ్మీద దుప్పట్లు, దిండ్లు రెడీ చేసి ఉంచింది... నేను నడుం వాల్చాను... నా గుండెల మీద తలపెట్టుకుని ఆకాశం వంక చూస్తూ అంది బంగారం.. నాన్నా నక్షత్రాలన్నీ భలే బాగున్నారు కదా ఇవ్వాళ.. అమ్మ గుమ్మంలో తెల్లవారే పిండితో పెట్టే చుక్కల్లా ఉన్నాయి కదా... అంది నవ్వుతూ... అవును అచ్చం అమ్మ పెట్టే చుక్కల్లానే ఉన్నాయి... భలే కనిపెట్టేశావే... నువ్వెంత తెలివైన దానివో నాలాగే అంటూ ముద్దు పెట్టుకున్నాను...
ఐతే మనమొక రాకెట్‌ తయారు చేసుకుని అమ్మని అందులో ఎక్కించుకుని చుక్కల దగ్గరకు తీసుకెళ్లి ముగ్గేయిస్తే బావుంటుంది కదా అనే సరికి హే దొంగా నీకెన్ని ఐడియాలో కదా అంటూ చక్కలిగింతలు పెట్టేసరికి గలగలా నవ్వుతోంది...
బంగారం ఇంతకీ ఆ పిల్లాడు నీకేం చెప్పాడు రైతు గురించి అడిగాను.. నువ్వేం చెప్పావ్‌.. రైతంటే అన్నం పెట్టేవాడని... దేశానికి మొదటి అమ్మ రైతేనని అంటూ నిద్రలోకి జారిపోయింది. ఆలోచిస్తూనే నాకూ నిద్ర పట్టేసింది. అంత ప్రశాంతంగా ఎప్పుడూ నిద్ర పోలేదు నేను.. లేచేసరికి ఎనిమిదై పోయింది. దిండు కింద పెట్టుకున్న ఫోను తీసి చూశాను. వామ్మో ఐదు మిస్డ్‌ కాల్స్‌.. చచ్చాన్రా భగవంతుడా... ఇవాళ కూడా తప్పదేమో తిట్లు అనుకుంటూ.. అనవసరంగా ఫోన్‌ సైలెంట్‌లో పెట్టాను... ఇవాళ నాకు మూడిందే అనుకుంటూనే కాల్‌ బ్యాక్‌ చేశాను.. ''సర్‌ చెప్పండి..'' కొంచెం నెమ్మదైన స్వరంతో..
తమరికి ఇప్పుడు తెల్లారిందా సర్‌ అన్న వెటకారం ధ్వనించింది అవతల నుంచి... అయితే వినండి.. రేపు సెకండ్‌ శాటర్‌ డే, ఎల్లుండి సండే.. పేజీ మంచి కలర్‌ ఫుల్‌గా డిజైన్‌ చేయాలంటూ పెద్దాయిన ఫోన్‌ చేశారు. అర్ధమయ్యింది... మంచి ఆఫ్‌ బీట్‌ స్టోరీస్‌, ఫోటోస్‌ ఉంటే తీసుకుని రావాలి... వాటికి మంచి కథనం రాయాలి...'' అర్ధమయ్యిందా... నిష్టూరంగా అనేసరికి... 'లేదు సర్‌.. సారి ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి కూరగాయలు తేవడానికి వెళ్లాను..' అప్పటికి ఏదో చెప్పి తప్పించుకున్నా...
సర్లే ఏదో ఒకటి తగలడు. అర్ధమైందిగా నేను చెప్పింది.
తలబాదుకుంటున్న శబ్ధం నా చెవులకి వినిపించింది. నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కావట్లేదు... ఉంటాను సర్‌ అని ఫోన్‌ పెట్టేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేతిలో పెన్ను, బుక్‌ పట్టుకుని భుజానికో బీసీ కాలం నాటి కెమెరాను తగిలించుకుని వెనక జేబులో సెల్‌ పెట్టుకుని వీధిలో పడ్డాను. చుట్టూ పరిసరాలను గమనిస్తూనే వెళ్తున్నాను. బుర్రకేమీ తట్టట్లేదు.. అలా ఎంత దూరం నడిచానో చూసేసరికి ఊరి చివర ఉండే టీ బడ్డీ కొట్టు దగ్గర తేలాను. వెనక్కి తిరిగి చూసుకుని ఇంత దూరం నడిచొచ్చేసానా... ఇంత దూరం నేనెప్పుడూ నడవలేదు... అనుకున్నా... అన్నా ఒక సిగరెట్‌, ఒక ఛారు అని అడిగాను. సిగరెట్‌ వెలిగించి, ఒక దమ్ము తర్వాత ఒక గుటక టీ తాగుతూ నిలబడ్డా... ఆ మూలగా ఒక బాబు కనిపించాడు. ఒంటి మీద ఒక్క నిక్కరు తప్ప ఏం లేదు.. పక్కనే ఒక చినిగిన చీరతో, చింపిరి జుట్టుతో ఒకామె నేల మీద ఏదో గీస్తూ, మధ్య మధ్యలో చిన్నపిల్లలా చప్పట్లు కొడుతోంది. 'చిన్నా చూడు ఎంత బాగా వేశానో కదా..' అంటుంటే 'ఔనమ్మా.. ముగ్గు చాలా బాగా వేశావ్‌' అంటూ వాడు కూడా నవ్వుతున్నాడు...
ఓహౌ రాత్రి సుమతి, బంగారం చెప్పింది వీళ్ల గురించేనా... అనుకుంటూనే కాసేపు అక్కడే వాళ్లను చూస్తూనే బయల్దేరాను. అలా ఆలోచిస్తూ వస్తున్న నాకు కాస్త దూరంలో ఎవరో విసిరేసిన కాగితాలను తీసుకుని వాటిని సాఫు జేసి ఒక కోతి అక్కడున్న గోడ మీద కూర్చుని తిరగేస్తోంది... భలే మంచి ఐటం దొరికిందనుకుని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుని వెళ్లా.. గట్టిగా నడిస్తే నా అడుగుల శబ్ధానికి అదెక్కడ పారిపోతుందో అని భయం వేసి.. ఈ రోజు ఈ కోతే నాకు ఆధారం అనుకుంటూ కెమెరాతో కొన్ని యాంగిల్స్‌లో పోటోలను క్లిక్‌ మనిపించా... తర్వాత సెల్‌తో కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నా.. గుండెల మీద చెయ్యేసుకుని కథనం గురించి ఆలోచిస్తూ నింపాదిగా నడుచుకుంటూ సిటీలోకి వచ్చిపడ్డా... ఆఫీసుకుని వెళ్లి ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి రాయాల్సిన మ్యాటర్‌ను రాసేసి డెస్క్‌ ఇన్‌చార్జి ఫోల్డర్‌లో వేసేసి ఈ రోజుకు పూర్తయిందనిపించి ఇంటికి బయల్దేరా... ఇంటికి దగ్గర పడ్డానో లేదో ఫోన్‌ మోగింది.. 'ఇప్పుడే చూసా నీ ఐటం బావుంది.. రేపటికి ఓకే.. ఎల్లుండి పరిస్థితి ఏంటి...' అంటూ రోజులా కసురుకోకుండా చాలా సున్నితంగా అడిగేసరికి ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్నా...
ట్రై కాదు కచ్చితంగా ఇవ్వాలి... చూడు కాస్త కళ్లకి ఇంపుగా ఏమన్నా ఫోటోలు దొరుకుతాయేమో వెతుకు అనడంతో కాదనలేకపోయా.. తిట్లు విషయాన్ని పక్కన పెట్టవయ్యా.. ఉద్యోగం నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలిగా నువ్వు కూడా.. నువ్‌ మాటిస్తే చేస్తావని తెల్సు... సర్లే జాగ్రత్తగా వెళ్లు... ఉంటాను. అని ఫోన్‌ పెట్టేయడంతో.. ఊపిరి పీల్చుకున్నా... దారిలో పాత మిత్రులు కనబడితే చాలాసేపు వాళ్లతో బాతాఖానీ వేసి ఇంటికి చేరుకున్నా. శనివారం, ఆదివారం అంటే నాకెందుకో చాలా ఇష్టం... కాని ఈ జర్నలిజంలోకి వచ్చాక రోజులు మర్చిపోయాను. శనివారం అంటే భయం పట్టుకుంది. ఏం ఉద్యోగమో ఏంటో అనుకుని ఒకసారి నా చేతిని పట్టుకున్నా కొంచెం జ్వరం వచ్చినట్టు కాలుతోంది. ఇంట్లోకి వెళ్లి ఫ్యాను, లైటు ఆఫ్‌ చేసి పడుకున్నా... ఇంతలో బంగారం వచ్చి లేపి ఫోన్‌ ఇచ్చింది... ఇంకేముంది తిడుతూ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌... కాల్‌ బాక్‌ చేశా కాని ఆయన అసలు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. మెసేజ్‌ పెట్టా.. రిప్లై కూడా ఇవ్వలేదు. ఆదివారం అంతా అపరాధ భావంతో గడిచి పోయింది.
సోమవారం త్వరగా లేచా... యధాప్రకారం నా కాళ్లు ఊరి చివరికి తీసుకెళ్లి వదిలాయి. ఆ రోజెందుకో వాళ్లు కనబడలేదు. ముగ్గు వేసే స్థలమంతా ఖాళీగా.. చందమామ లేని ఆకాశంలో వెలవెలబోయింది. అన్నా ఇక్కడ ఉండే వాళ్లిద్దరూ ఏరి.. ఇవాళ కనబడలేదు. ఏమైందంటావ్‌.. అడిగాను. ఏమో మరి.. చలికాలం కదా బహుశా ఏమన్నా అనారోగ్యమేమో... అందుకే ఎక్కడికైనా వెళ్లారేమో.. అన్నాడు టీ కప్పు చేతికిస్తూ. ఆ సమాధానం సరైనది కాదనిపించింది. కాని అంగీకరించక తప్పదు. ఎందుకంటే వాళ్ల గురించి నాకేం తెలీదు కదా..అనుకున్నా మనసులో... అక్కడి నుంచి బయల్దేరా.. దారిలో కనిపించిన నాలుగు పూల గుత్తులను, తుమ్మెదల్ని, ట్రాఫిక్‌ సిగల్‌ లెక్కచేయకుండా రోడ్డు దాటుతున్న పిల్లల్ని కొన్ని ఫొటోలు తీసుకుని ఆఫీసుకు వచ్చి నెమ్మదిగా కూలబడ్డా. ఆ రోజు ఎడిషన్‌ ఇన్‌చార్జి, డెస్క్‌ ఇన్‌చార్జి మీటింగనుకుంటా.. ఇద్దరూ కూర్చుని అన్ని జిల్లాల పేపర్లు తిరగామరగా వేస్తున్నారు. ఎందుకైనా మంచిదని బయట ఖాళీగా ఉన్న సిస్టం ఓపెన్‌ చేసి డెస్క్‌టాప్‌ మీద నేను తీసిన ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసి ఒక ఫోల్డర్‌లో పెట్టి మంచి కొటేషన్స్‌ రాసి పెట్టేంతలో మీటింగ్‌ అయిపోయింది. మా పెద్ద బాసు నాకేసి గుర్రుగా చూస్తూ కింది ఫ్లోర్‌లోకి వెళ్లిపోయాడు.
మా చిన్న బాస్‌ లోపలికి పిలిచాడు. ఏమయ్యా.. నన్ను ఉద్యోగంలోంచి పంపించేద్దామనుకుంటున్నావా.. అన్నాడు సీరియస్‌గా.
అయ్యో ఎంత మాట. ఉద్యోగమిప్పించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీక... అనేసరికి 'నా ప్రాణానికి భలే తగిలావ్‌.. చూశావ్‌గా.. శనివారం నువ్విచ్చిన ఆఫ్‌ బిట్‌ స్టోరీ చూసి పర్లేదు.. సోసో గా ఉందని వెళ్లాడు. ఇంకా ఇంకా మంచి మంచి ఐటమ్స్‌ వెతికి తెమ్మని నాకు క్లాస్‌ పీకారు. ఈ నెలాఖరు వరకూ నీకు గడువు ఇమ్మన్నారు. ఆలోచించుకో నీ ఇష్టం... నాకు చెప్పింది నీకు చెప్పాను... తర్వాత నువ్వే ఆలోచించుకో... వచ్చే నెల వచ్చే క్వాలిటీ సెల్‌ పుస్తకంలో నీ ఐటం ఉండాలన్నారు. క్వాలిటీ సెల్‌ నుంచి తప్పులున్నాయంటూ ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ రావడానికి వీల్లేదంటూ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. చూసుకో.. మరి... అంటూ బయటికి వెళ్లిపోయాడు...
ఆలోచిస్తూ రోడ్డెక్కాను... నెలాఖరు అంటే ఇంకా పది రోజులే అన్నమాట నాకు గడువు.. ఏం చేయాలి... ఎలా చేయాలి... ఎంత చేసినా తక్కువగానే కనిపిస్తోంది... అంటూ ఇతర పత్రికల్లో తెలిసిన వాళ్లకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాను... లాక్‌డౌన్‌ కదా.. వాళ్లను కూడా ఉద్యోగాల్లోంచి తీసేసారని చెప్తుంటే మనసుకు చాలా బాధ కలిగింది.. ఏదో నిస్సహాయత, నిస్సత్తువ ఆవరించింది... రోడ్డు పక్కన చిన్న పిట్ట గోడ మీద కూర్చున్నాను... ఏం చేయాలి... బంగారం భవిష్యత్తు ఏమిటి... ఇల్లు ఎలా గడుస్తుంది... ఒకటే ఆలోచనలు.. అలా చాలాసేపు కూర్చున్నాక నెమ్మదిగా లేచి బయల్దేరాను. ఇంటికొచ్చి మంచం మీద వాలేసరికి సుమతికి అనుమానమొచ్చి 'ఏమిటండి అలా ఉన్నారు... ఇంటికి రాగానే మమ్మల్ని పలకరించకుండా ఉండరు మీరు.. ఏమైంది...' అడిగింది ఆత్రుతగా... జరిగింది చెప్పాను... పర్లేదులెండి.. మీ ప్రయత్నం మీరు చేయండి... మంచి వార్తలు దొరికితే రాయండి లేదంటే రిజైన్‌ చేసేయండి... అంతేగాని టెన్షన్‌ పెట్టుకోకండి... బంగారం భయపడుద్ది మిమ్మల్ని ఇలా చూస్తే... ఈ లాక్‌డౌన్‌ పుణ్యమాని ఎలాగో ఇంటెనక నాలుగు ఆకుకూరలు, నాలుగు కూరల విత్తనాలు జల్లానుగా అవి సరిపోతాయి... బియ్యం, ఉప్పు, పప్పు అంటారా... కూరల్ని అమ్మితే వచ్చేవి మన ముగ్గురికి సరిపోతాయి.. ఈలోపు ఇంకో ఉద్యోగం దొరక్కపోదు కదా... అనే ధైర్యం చెప్పేసరికి నాలో ఏదో తెలియని శక్తి ప్రవహించింది. రోజుకు నాలుగు స్పాట్‌ వార్తలు, నాలుగు ప్రెస్‌ నోటులు ఇచ్చి వస్తున్నాయి. రోజులు గడిచే కొద్ది నాలో దిగులు పెరిగి పోసాగింది. నాతో మా ఇన్‌చార్జి మాట్లాడ్డం మానేశాడు. నేను మాట్లాడదామనుకుంటున్నా కాని నా వల్ల కావట్లేదు. ఎల్లుండి ఆదివారం. ఏదో ఒక మంచి ఆఫ్‌ బీట్‌ పట్టుకొస్తానని నేనే వెళ్లి మా ఇన్‌చార్జితో ధైర్యం చేసి చెప్పాను. తెస్తానా తేనా అనేది తర్వాత సంగతి కాని ముందు మాట్లాడాను అదే చాలు అనుకుని బయటికొచ్చా... అలా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ నడుస్తున్నాను.. రోడ్డు మీద జనం ఎవరూ లేరు. దారిలో ఒక అద్భుతమైన సంఘటన కనబడింది. ఒక చిన్న పిల్ల ఓపెన్‌ టాప్‌ రిక్షాను తోలుతోంది.. దాని మీద ఒక నిండు గర్భిణీ నొప్పులు పడుతూ ఏడుస్తోంది. పక్కనే మరో చిన్న పిల్ల ఏడవొద్దంటూ చేతులు పట్టుకుని బతిమాలుతోంది. గబగబా వెనకాలే పరుగు లాంటి నడకతో వెళ్లా... అన్ని వైపుల నుంచి ఫోటోలు తీసాను... పాపను ఆపి ఎక్కడికి పోతున్నావని అడిగాను. పెద్దాసుపత్రికి అనడంతో జాగ్రత్త.. అంటూ చేతిలో ఒక వంద నోటు పెట్టి ఇవాళ్టికి ఇచ్చిన మాట ఒకటి ఈ పాప రూపంలో నన్ను గట్టెక్కించింది అనుకుంటూ ఇంటికెళ్లా... అప్పటికే బంగారం తినేసి నిద్రపోయింది. కాసేపు తల నిమిరి నేనూ పక్కనే పడుకున్నా.
కోడి కూతకు మెలకువ వచ్చి చూసే సరికి తెల్లవారి ఆరయ్యింది. ఫోన్‌ చూసుకున్నా... రైతుల సమస్యల మీద ఏదైనా మంచి ఫోటో తెమ్మన్నారు... అంటూ మా ఇన్‌చార్జి మెస్‌జ్‌ పెట్టారు. ఓకే సర్‌ అని రిప్లై ఇచ్చాను కాని... అంత స్పెషల్‌ ఐటం కోసం ఎక్కడ వెతకాలి... సరే చూద్దాం అనుకుంటూ నా ప్లేస్‌కి నేను బయల్దేరాను... టీ తాగుతున్న నాకు వాళ్లిదరూ మళ్లీ అక్కడ కనిపించేసరికి చాలా సంతోషం గా అనిపించింది... నిజమే మా ఊరి నుంచి చాలా మంది రైతులు వెళ్లి పోరాటాలు చేస్తున్నారు.. మా ఊళ్లో పొలాలు లేవు, రైతులు లేరు, ధాన్యం కూడా సిటీలకెళ్లి తీసుకురావాల్సి వస్తోంది... పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపటి రోజున నా బిడ్డ పరిస్థితి ఈ దేశం పరిస్థితి ఏంటి... అనుకుం టున్నంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఎద్దు మీదకి ఉరి కింది. కొమ్ము విసిరేసరికి చేతికి పెద్ద గాయమయ్యింది. అంతలో టీ కొట్టతను ముకుతాడేసి దాన్ని గుంజకు కట్టేశాడు. చేతికి కారుతున్న రక్తాన్ని చూసేసరికి ఆ పిల్లాడి తల్లి ఏడుస్తూ వచ్చి ఉన్న చీరలోంచి ముక్క తుంచి చేతికి కట్టుకట్టింది... ఆమె స్పందించిన తీరుకు నా హదయం చలించి కన్నీరై కారింది.
ఊర్లో ఉన్న ఆర్‌ఎంపీ వచ్చి మందులిచ్చి వెళ్లాడు. ఇంట్లో మూలుగుతూ పడుకున్నా... ఓపెన్‌ టాప్‌ రిక్షా ఫోటోలను, వార్తను మా బాస్‌కు ఫార్వర్డ్‌ చేశా... పెద్ద బాస్‌ ఆఫీసుకు రమ్మన్నారంటూ రిప్లై ఇచ్చారు. జరిగిన విషయం చెప్పా... నేను నమ్మినా ఆయన నమ్మడు... అసలే స్టాఫ్‌ని తగ్గించ మంటూ పై నుంచి ఆర్డరంటా అని మళ్లీ రిప్లై పెట్టాడు.. సర్‌ ఈ టెన్షన్‌ తో నేను పనిచేయలేను.. నా శాయశక్తులా పని చేస్తూ మంచి మంచి ఐటమ్స్‌ ఇస్తూనే ఉన్నాను.. ఇప్పుడిలా చేతికి గాయంతో పడున్నాను... నా వల్ల కాదు సర్‌... అని ఫోన్‌ చేసి చెప్పా... రిజైన్‌ లెటర్‌ కూడా వాట్సాప్‌ చేశా... నెల ముగియడానికి ఇంకా రెండు రోజులు ఉందిగా తొందర పడకు.. అని మా బాస్‌ నచ్చజెప్పాడు...
తగిలిన దెబ్బ వల్ల రెండో రోజు బాగా జ్వరం వచ్చేసింది. మూడో రోజు ఇలాగే పడుకుంటే చలికి ఒళ్లు బిగదీసుకున్నట్టు ఉంటుందని నెమ్మదిగా లేచి బంగారాన్ని తీసుకుని నా ప్లేసుకు బయల్దేరి వెళ్లా... అక్కడంతా గందరగోళంగా ఉంది... జనాల్ని తోసుకెళ్లా... అక్కడ ఆ పిల్లాడి తల్లి చచ్చిపడుంది... అందరూ ఏవేవో ఊహించుకుని ఏవేవో నిందలు వేసి ఆమె మీద మాట్లాడుకుంటున్నారు. తల్లి తల దగ్గర ఆ పిల్లాడు ఏడుస్తూ దిక్కులు చూస్తున్నాడు... మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. టీ కొట్టతను కూడా తొందరగానే కట్టేసి వెళ్లిపోయాడు.. నేను ఆ పిల్లాడిని జరిగిన విషయమేంటని ఆరా తీసాను.. వాళ్లది పక్క ఊరు... చాలా పెద్ద ఇల్లు, పొలం ఉందని చెప్పాడు... పోయినేడాది పంట సరిగ్గా పండలేదు. చేసిన అప్పులకు పొలాన్ని లాగేసుకున్నారు. వాళ్ల నాన్నకు పంట పండించడం తప్ప ఇంకో పని రాదు. ప్రభుత్వం ఏవో కొత్త చట్టాలంటందంట అవేవీ నాకు తెలి యవు. మా అమ్మకున్న అరెకరం పొలం కూడా వాళ్లే లాగేసు కున్నారు... మా నాన్న విషం తాగి చనిపోవడంతో అమ్మను బాబారు వాళ్ల ఇంట్లోంచి తోసేశారు... అంతే అమ్మ పిచ్చిదే పోయింది... అమ్మకు, నాన్నకు పొలమంటే ఎంతో ఇష్టం అంటూ ఏడుస్తూ చెప్తుంటే నా కళ్లు చెమ్మగిల్లాయి. దళారులు, కార్పొరేట్లు, అధిక వడ్డీలు వసూళ్లు చేసే వాళ్లున్నంత కాలం ఈ వ్యవసాయం పరిస్థితి బాగుపడదు... ఛ... వీళ్లంతా అన్నం తిని బతకకుండా ఏం తిని బతుకుతారో నాకర్ధం కావట్లేదు... మనసులోనే వాళ్లను తిట్టుకుని బాబుని, బంగారాన్ని లేవదీసి ఇంటికి బయల్దేరదామనుకుని ఒకసారి వెనక్కి చూశా.. ఎప్పటి లాగే ఏదో ముగ్గు... దగ్గరికెళ్లా... పెద్ద పల్లెటూరు... అందులో ఒక రైతు.. ఈ విశ్వం మొత్తాన్ని అరచేతిలో పెట్టుకుని అన్నం ముద్దలు పెడుతున్న దశ్యం.. ఇది కదా అసలైన పోరాట మంటే.. అనుకున్నాను.. వాటిని ఫోటోలు తీసి మంచి టైటిల్‌ పెట్టి క్యాప్షన్‌ రాసి ఆ బాబుని ఫొటో తీసి మా బాస్‌కు పంపించా... ఇన్ని సమస్యలతో పోరాడుతూ ప్రాణాలొదిలే స్తున్న రైతుల ముందు నా సమస్య చాలా చిన్నదనిపించింది.. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నా ఈ బాబుని, నా బంగారాన్ని రైతుల్ని చేయాలని.. రైతు లేని ప్రపంచాన్ని ఊహించగలమా.. అనుకుంటూ రేపటి రైతులను నా భుజాల కింద దాచుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లా..

- అమూల్య చందు కప్పగంతు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గచ్చామీ..
గోధుమ రంగు పాము
సురభి...
పోలికతో అగచాట్లు...!!
నా నమ్మకాన్ని ఓమ్ము చెయ్యకు నాన్న...
నీళ్ల బావి
ఒక్క మాట
చెల్లి త్యాగం
వృద్ధాశ్రమం
అమ్మ కోరిక
సింధూరం
బతుకు నడక
అపరాధ భావం
తుది నిర్ణయం
గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు

తాజా వార్తలు

08:47 PM

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం

08:41 PM

లంచం కేసులో పోలీసులకు బిగుసుకుంటున్న ఉచ్చు

08:13 PM

కరోనా పాజిటివ్‌.. యువకుడు ఆత్మహత్య

07:57 PM

మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్

07:37 PM

లవర్స్ ను తుపాకితో కాల్చిన పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో

07:27 PM

ఏపీలో భారీగా పెరిగిన కేసులు..కరోనాతో 20 మంది మృతి

07:20 PM

డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి ప్రజలకు తీరని లోటు : సీపీఐ(ఎం)

07:18 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

07:12 PM

సీపీఐ మాజీ ఎంఎల్‌ఏ సుబ్బరాజు మృతికి సీపీఐ(ఎం)సంతాపం

07:10 PM

నా ఆరోగ్యం బాగుంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కల్యాణ్

07:06 PM

బాలిక‌పై లైంగికదాడి..సెల్ఫీ తీసి

06:58 PM

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా..

06:33 PM

తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్

06:07 PM

స్వచ్ఛందంగా లాక్ డౌన్..మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు

05:50 PM

యువ‌కుడి దారుణ‌ హ‌త్య

05:47 PM

కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం

05:25 PM

విశాఖలో ఈదురు గాలుల బీభత్సం

05:15 PM

పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

04:47 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ..ప్రతి 10 నిమిషాలకు..

04:09 PM

మంత్రి ఈటలకు సొంత జిల్లాలోనే షాకిచ్చిన నిరుద్యోగులు

04:06 PM

తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

03:59 PM

తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల

03:55 PM

ఈరోజు రాత్రి నుంచి రెండ్రోజుల పాటు లాక్‌డౌన్‌

03:04 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌కు గుండెపోటు, పరిస్థితి విషమం

02:53 PM

సీఎంకు కరోనా..ఆస్ప‌త్రిలో చికిత్స‌

02:05 PM

లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

01:50 PM

మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే ప‌దివేల జ‌రిమానా

01:37 PM

ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్

01:23 PM

చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.