Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లాఠీ | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Feb 07,2021

లాఠీ

ఒక్కోసారి మనకు ఏమీ కానీ వ్యక్తులు మన ఆలోచనల్లో చోటు చేసుకుని మనలను కలవర పెడ్తుంటారు. మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంటారు. మనోహర్‌ ట్రైన్‌ దిగి ఇలా బయటకు వచ్చాడో లేదో బయట ఆటో వాళ్ళు చుట్టుముట్టారు. స్టేషన్‌ పరిధిలో ఉన్న ఆటోవాళ్ళు ఇరవై రూపాయాల్లో వెళ్లాల్సిన దూరానికి వందా, నూట యాభై అడుగుతారు. రోజూ రైల్లో ప్రయాణం చేసే ఉద్యోగస్తుడైన మనోహర్‌కి ఇది అలవాటే. అందుకే ఆటో వాళ్ళ మధ్య నుండీ దూసుకుని బయటకు నడవడం ప్రారంభించాడు. కొంత దూరం నడిచివెళ్ళి షేర్‌ ఆటో దొరకగానే ఎక్కాడు.
సాయంత్రం సమయమేమో రోడ్డు చాలా రద్దీగా ఉన్నది దారిలో ఇంకో ఇద్దరు ఆటో ఎక్కారు. కొంత దూరం వెళ్ళగానే ఒక కానిస్టేబుల్‌ ఆటో ఆపి దూకుడుగా ముందు కూర్చోబోయాడు.
'సార్‌ పదిహేను రూపాయలు చిల్లర ఉందా?' అని అడిగాడు ఆటో డ్రైవర్‌. ఆటోలో ఉన్న ముగ్గురూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సర్వీస్‌ చార్జ్‌ పదిహేను రూపాయలే.. కానీ ఛార్జీ ఎంతైనా సరే కనిపించిన ఆటో ఎక్కేసి ఎంత దూరమైనా వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా దిగిపోయే అలవాటున్న ఓ పోలీస్‌కి అతను ఇవ్వవలసిన డబ్బుల గురించి హెచ్చరించడం.. ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఎక్కండి అన్న ధోరణిలో మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించింది.
అతను వెంటనే 'నేనెవరినో కనిపిస్తలేదా?' అని అన్నాడు దురుసుగా ..
'కనిపిస్తున్నది సర్‌. మీరు ఎవరైనా సరే.. నా ఆటో ఎక్కినప్పుడు మీరు నాకు పాసింజరే. ఈ ఆటో ఫైనాన్స్‌లో తీసుకున్న. నెలకు ఇంతా అని డబ్బులు కట్టాలి సర్‌. ఫ్రీగా తీసుకెళ్ళడాలు లేవు' నిర్మొహమాటంగా చెప్పాడు.
ఇప్పుడా వ్యక్తి ఆటో ఎక్కితే అలవాటుకు విరుద్దంగా పదిహేను రూపాయలు ఇవ్వాలి. ఆటో ఎక్కకుంటే ఫ్రీగా ఎక్కుతూ ఆటోవాళ్ళకు అన్యాయం చేస్తున్నట్లు ఒప్పుకుంటున్నట్టే. పైగా చేతిలో కూరగాయల సంచీ ఉండడం వల్ల అతను డ్యూటీకి కాకుండా ఇంటికే వెళ్తున్నట్టు అర్థమవుతున్నది. చేసేదేమీ లేక అతను తప్పనిసరిగా ఆటోలో కూర్చున్నాడు, మిగితా ఇద్దరు దిగాక అతని స్టేజ్‌ రాగానే ఆటో దిగి డబ్బులు ఇచ్చేశాడు.
మనోహర్‌కి ఆటో అతన్ని చూస్తే భయం వేసింది చాలా చిన్నవాడు. చూస్తానికి ఆటో డ్రైవర్‌లా కాకుండా కాలేజ్‌ కుర్రాడిలా ఉన్నాడు. ఆటో దిగి డబ్బులు ఇస్తూ.. 'బాబూ నీ పేరేమిటో గానీ వాళ్ళతో నీకెందుకు? రేపటి నుండీ అతను నిన్నేమన్నా ఇబ్బంది పెడతాడేమో' అన్నాడు.
'నా పేరు ప్రకాష్‌ సర్‌.. నాకు ఏమీ కాదులెండి సర్‌' అంటూ ఆటో వెనక్కు తిప్పుకుని వేగంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుండీ ప్రకాష్‌ మనోహర్‌ ఆలోచనల్లో ఒక భాగమై పోయాడు.
రోజూ సాయంత్రం ట్రైన్‌ దిగగానే కొద్ది దూరంలో అప్పుడప్పుడూ ప్రకాష్‌ ఆటో కనపడడం ఆ పక్కన వేరే ఏదయినా ఆటో ఉన్నా ప్రకాష్‌ ఆటోనే ఎక్కడం మనోహర్‌కి అలవాటై పోయింది. ఆ సమయానికి ఏ కానిస్టేబుల్‌ ఆటో ఎక్కినా ప్రకాష్‌ ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తుండడం వాళ్ళు ఏమీ అనలేక కోపంగా డబ్బులు ఇస్తుండడం గమనిస్తూనే ఉన్నాడు.
ఆ రోజు ఒక కూలి స్త్రీ చంటిపిల్లను తీసుకుని ఆటో ఎక్కింది. తాను చెప్పిన చోట దిగి డబ్బులు లెక్క చూసుకుంటుంటే.. 'వద్దులేమ్మా..' అని ఆటో ముందుకు తీసుకెళ్ళాడు.
'అదేంటి ప్రకాష్‌..?' అని అడిగాడు చనువుగా మనోహర్‌.
'ఆమె తన బిడ్డను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వస్తున్నది సార్‌. అక్కడ ఎన్ని పైసలైనాయో ఏమో పాపం. ఛార్జీలకు లెక్క జూసుకుంటున్నది సర్‌' అన్నాడు.
డబ్బుల దగ్గర అంత ఖచ్చితంగా ఉండే ప్రకాష్‌ ఇలా ముసలివారికి కూలివారికి సాయపడుతుండడం గొప్పాగా అనిపించింది. మరి పోలీసులతో ఈ వైరం ఏమిటి అనిపించింది. ఈ కోపం మనసులో పెట్టుకుని వాళ్ళు ప్రకాష్‌ని ఏదయినా చేస్తేనో అని భయం వేసింది. ఈ ఆలోచన పెరిగి పెరిగి మనోహర్‌ని నిలువనివ్వడం లేదు. ప్రకాష్‌ని మెల్లగా మార్చాలి అనిపించింది.
అయినా ఆటో నడుపుతూ బతుకు వెళ్లదీస్తున్న ఒక యువకునికి పోలీసుల మీద కోపం ఏమిటి? వాళ్ళ పేరులోనే ఉన్నది కదా వాళ్ళు రక్షక భటులు అని. వాళ్ళున్నదే ప్రజల రక్షణ కోసం కదా! నిజానికి పోలీసులు ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్ళకు స్వంత వెహికల్స్‌ ఉండాలి.. కేవలం ఉన్నతాధికారులకే కాకుండా ఆ శాఖలోని చిన్న ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వమే టూ వీలర్స్‌ ఇస్తే బాగుండు అని అనిపించింది. ప్రకాష్‌ చిన్నవాడు. యువత ఇలా తెలిసీ తెలియక ప్రవర్తిస్తున్నప్పుడు పెద్దవాళ్ళన్నా వాళ్ళను సరిదిద్దాలి, లేకుంటే మానవ సంబంధాలు, విలువలూ ఇలాగే మారిపోతాయి అని అనిపించింది.
ప్రకాష్‌తో కాస్త నింపాదిగా మాట్లాడే సంధర్భం కోసం చూస్తున్నాడు మనోహర్‌.
ఆ రోజు ఆటోలో మరో పోలీస్‌ ఎక్కాడు. దారిలో దిగిపోయి ప్రకాష్‌ అడిగినా కూడా డబ్బులు ఇవ్వలేదు. ప్రకాష్‌ 'ఆటో చార్జ్‌ ఇవ్వండి సార్‌..' అన్నాడు
'ఏంట్రా నన్ను పైసలడుగుతున్నావ్‌. అసలు ఇక్కడి నుండీ ఇక్కడికే నీకు పైసలు ఇవ్వాలా?' అన్నాడు.
'అవును సర్‌. ఇక్కడికే అని మీరు నడిచి రాలేదు కదా.. నా ఆటోనే ఎక్కారు కద సార్‌!' అన్నాడు.
'ఏంటిరా నకరాల్‌ చేస్తున్నావ్‌..?' అరిచాడతాను. మనోహర్‌కి భయం వేసింది.
'ఎందుకు సార్‌ ఏంట్రా అంటున్నారు..'
'మరి ఏమనాలిరా. కళ్ళు నెత్తి మీదకు వచ్చినాయా? సార్‌! ఆటో డైవర్‌ గారూ.. అని పిలవాలా?'
పౌరుషంతో ప్రకాష్‌ ముఖం ఎర్రబడింది. 'అంత వద్దులెండి సార్‌. నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు' పంతంగా అన్నాడు. చేసేదేమి లేక అతను పదిరూ పాయాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
ఆటోలో మనోహర్‌ ఒక్కడే మిగిలిపోయాడు. 'సార్‌ మీరు నా గురించే ఆలోచిస్తున్నారు. నన్ను ఏమీ అనలేక కోపంగా ఉన్నారు కదా సార్‌' అన్నాడు ప్రకాష్‌.
మనోహర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. 'వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు అనె నా బాధ ప్రకాష్‌. మీరు యువకులు కదయ్యా మీకు ఏమి చెప్తాం చెప్పు?'
'ఒక రెండునెలలుగా నన్ను గమనిస్తున్నారు కద సార్‌. ఒక యువకుడు చేయకూడని పనులు చేస్తున్నంత చెడ్డోడిగా కనిపించానా సార్‌..'
'అయ్యో ఆదేమీ లేదు ప్రకాష్‌'
'అసలు ఒక రోజేమయ్యిందో తెలుసా సర్‌..' ప్రకాష్‌ చెప్పడం ఆరంభించాడు..
'మామూలుగా నేను పొద్దున్నే పల్లెటూర్ల నుండీ కూర గాయలు, ఆకు కూరలు తెచ్చే ఆడోళ్ళను ఆటోలో ఎక్కించు కుని రైతు బజార్‌ దగ్గర దింపుతుంటా. ఒక రోజు ఒకామెకు కూర గాయల గంప దింపడానికి సాయం చేస్తూ.. మట్టి అంటుకుంటదని గబ గబా నా యూనిఫామ్‌ షర్ట్‌ తీసి సీట్‌ మీద వేసి ఆ గంపలు దింపాను సర్‌.. ఇట్ల ఆటో స్టార్ట్‌ చేస్తున్న సార్‌.. అంతలోనే ఒక కానిస్టేబుల్‌ వచ్చి.. 'యూనిఫామ్‌ ఏదిరా?' అని ఫటా ఫట్‌మని నా భుజాల మీద అయిదారు దెబ్బలు కొట్టాడు సర్‌.
'సార్‌ యూనిఫామ్‌ ఉన్నది' అని.. యూనిఫాం చూపించుకుంటూ అప్పుడే ఎందుకు తియ్యవలసి వచ్చిందో వివరించబోయాను. వెంటనే వేసేసుకుంటాను అని చెప్పాలని చూశాను. నేను చెప్పేది అస్సలు వినిపించుకోవడం లేదు సార్‌. మల్లా నాలుగు దెబ్బలు వేశాడు సార్‌. ఆ దెబ్బల నెప్పిని వారం రోజులు అనుభవించాను సర్‌.
'ఏమయిందిరా అని అడుగుతుంటే అమ్మకు చెప్పుకోలేను.. ఏం చెప్తాను సార్‌ నేనమన్నా తప్పు చేశానని చెప్పనా? నా దగ్గర లైసెన్స్‌ లేదా? ఆర్‌సీ బుక్‌ లేదా? బండికి ఇన్సూరెన్స్‌ చేయించలేదా? అన్నీ విషయాలల్లో పక్కా ఉంటాను సార్‌ నేను. తప్పు చేయకుండా ఒక పోలీస్‌ చేతిలో దెబ్బలు తిన్నానని తెలిస్తే మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా సర్‌? అసలు మా అమ్మ ఎవరో తెలుసా సర్‌? విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఒక పోలీస్‌ భార్య. నేను రూల్స్‌ పాటించకుండా ఉంటే ఆమె ఊరుకుంటదా?
మా నాన్న చనిపోయినప్పుడు నేను చాలా చిన్నోడిని సార్‌.. మా అమ్మకు ఉద్యోగం ఇస్తాము అంటే మా తాత పంపించలేదు. 'నా ప్రాణాలున్నంత వరకు మిమ్ముల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వు మాత్రం ఉద్యోగానికి వెళ్లొద్దమ్మా' అన్నాడట. మా అందరినీ అట్లాగే ఎంతో ప్రేమగా పెంచాడు సర్‌. నన్నూ మా చెల్లినీ బాగా చదివించాడు కూడా. కానీ మా చదువులింకా పూర్తి కానేలేదు. ఏదో పని ఉన్నట్టే ఆ దేవుడు మా తాతను తీసుకెళ్ళిపోయాడు. ఇక కుటుంబం బాధ్యత నేను మోయాల్సి వచ్చింది సర్‌. సరదాగా ఫ్రెండ్‌ దగ్గర నేర్చుకున్న ఆటో డ్రైవింగ్‌ మా కుటుంబాన్ని నిలబెట్టింది. ఎంతో జాగ్రత్తగా ఆటో నడుపుకుంటూ ఇంటిని మెయింటైన్‌ చేస్తున్నా సార్‌. నాకూ బాధ్యతలు తెలుసు సార్‌. నా దగ్గర డ్రైవింగ్‌ లైసన్స్‌ ఉన్నది. బండికి సంభందించిన అన్నీ పేపర్లు ఉన్నాయి సర్‌. యూనిఫామ్‌ లేకుండా ఏ రోజు ఉండను సార్‌. నన్ను ఎందుకు కొట్టాలి సార్‌? నాకు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏడుపు వచ్చింది సర్‌.. ఫట్‌ ఫట్‌ మని కొట్టాడు సార్‌. నేను తప్పు చేస్తే కొట్టాలి కానీ.. తప్పు చేయకుండా కొట్టాడు సార్‌' ప్రకాష్‌లో ఎక్కడలేని ఉక్రోషం కన్నుల నీరై పొంగు తున్నది. ముఖ్యం ఎర్రగా మారింది మళ్ళీ కొనసాగించాడు.
''నేను అప్పటిదాకా యూనిఫామ్‌ వేసుకునే వున్నాను.. మరో నిముషమైతే మళ్ళీ వేసుకునే వాడినే.. ఇంతలోనే ఎందుకు కొట్టాలి సార్‌? మా నాన్న ఎట్లా ఉంటారో కూడా నాకు గుర్తులేదు. మా అమ్మా, మా తాతా నన్ను ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచారు. అవి ఎంత బలమయిన దెబ్బలని కాదు సార్‌. అసలు ఎందుకు కొట్టాలి అన్నదే నా ప్రశ్న..
సర్‌ నేను తప్పు చేయలేదు.. ఒకవేళ నేను తప్పు చేసినా వాళ్ళకు కొట్టే హక్కు ఎక్కడిది సార్‌? నాకు ఫైన్‌ వేయవలసింది కట్టుకునే వాడిని.. అంతేగానీ ఈ కొట్టడడం ఏమిటి సార్‌?
ఎవరికయినా ఏదయినా అన్యాయం జరిగితే ఊర్లో పెద్ద మనుషుల దగ్గరకు వెళ్ళి పంచాయితీ పెట్టించి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఎంత పెద్ద ఆపద వచ్చిన పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళి కంప్లైంట్‌ ఇవ్వాలంటే మన వాళ్ళు భయపడుతుంటారు ఎందుకో తెలుసా సార్‌? ఇదిగో ఇట్లాంటి ట్రీట్‌మెంట్‌ వల్లనే కదా సార్‌.
అదిగో సార్‌ ఆ నాలుగు రోడ్ల నడుమ చిన్న పిల్లలు వంటి మీద సరైన బట్టలు లేకుండా వచ్చే పోయే బండ్ల మధ్య చేరి అడుకుంటుంటే.. వాళ్ళు ఎక్కడ మన బండ్ల కడ్డంబడి టక్కరైతదో అని మనం టెన్షన్‌ పడతాం. అక్కడే వున్న వీళ్ళు ఏమీ అనరు.. వాళ్ళకేమైనా అయితే బాధ్యులెవరు సార్‌?
ఇదే రూట్‌లో మంత్రిగారి అబ్బాయి ఓవర్‌ స్పీడ్‌లో వెళ్తుంటే నమస్కారం పెడతారే గానీ ఒక్కరూ పట్టుకోరు.. ఇవి పెద్ద విషయాలు కావు.
మా ఇంట్లో మమ్ముల్ని ఏమి చెప్తూ పెంచారో తెలుసా సార్‌.. యాక్సిడెంట్‌ కేసుల్లో రక్తాలు కారుతున్న వారిని హాస్పిటల్‌లో చేర్చిన మా నాన్న గురించి, ఎన్నికలు వచ్చినప్పుడు మూడు రాత్రులు కంటి మీద కునుకు లేకుండా డ్యూటీ చేసిన మా నాన్న దోస్త్‌ల గురించి.. తగలబడిపోతున్న ఇళ్ళ నుండీ ముసలి వారిని పసి పిల్లలను కాపాడిన గొప్ప గొప్ప పోలీస్‌ల గురించి చెప్తుంటాడు మా తాత.
మా చిన్నమ్మ తాను బీఈడీ చేస్తున్నప్పుడు.. అక్కడ పని చేసిన డీఎస్పీ గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది సార్‌. అక్కడ లోకల్‌ నాన్‌ లోకల్‌ గోడవలు వచ్చి వాళ్ళ బ్యాచ్‌ వాళ్ళు దారుణంగా కొట్టుకున్నారట. కొందరిని అరెస్ట్‌ చేసినా.. ఆ ఉదయమే వాళ్ళను వదిలి పెట్టి అందరినీ వాళ్ళ కాలేజ్‌లో సమావేశపరిచారట సార్‌. మీరు కాబోయే ఉపాధ్యాయులు కదా! మీకసలు ఎఫ్‌ఐఆర్‌ గురించి తెలుసా అని అడిగారట. మీలో కొందరు గ్రూప్స్‌కి రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తూ గ్యాప్‌లో బీఈడీ చేస్తున్నారని, కొందరు ప్రిలిమ్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నారని విన్నాను. నిన్న మీరు చేసిన గొడవకి మీ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామే అనుకోండి. మీలో ఎవరికి ఉద్యోగం వచ్చినా ముందు ఎంక్వైరీకీ మా దగ్గరకే వస్తారు. ఒకసారి ఇక్కడ మీ పేరు కనపడితే మీకు ఫ్యూచర్‌ ఉండదని తెలుసా! ఇది మీ ప్రథమ తప్పుగా భావించి ఎవ్వరి మీద కేస్‌ పెట్టడం లేదు. మీ అందరినీ నా తమ్ముళ్లుగా భావించి చెప్తున్నాను. బాధ్యతగా మెలగండి అని చెప్పారట.. జీవితంలో ఎవరైనా అతన్ని మరచిపోతారా సర్‌..
కిందటి నెల కదులుతున్న రైలుతో పాటు వేగంగా పరుగెత్తి చంటి పాపకు పాలందించిన ఆర్‌ఎఫ్‌ జవాన్‌ గురించి చెప్పి సంబరపడుతుంటుంది మా చెల్లి.. మొన్నటికి మొన్న ఏడుస్తున్న రోజుల పాపకు సెలవులో వున్న ఒక కానిస్టేబుల్‌ అక్క స్టేషన్‌కి వచ్చి మరీ తన పాలు ఇచ్చి కాపాడిందని ఎంత మురిసిపోతూ చెప్తూంటుంది నా తల్లి. అలాంటి మంచి వార్తలు వింటూ పెరగాలని అనుకునే నాకు.. వట్టి పుణ్యానికి లాఠీ దెబ్బలు తింటే ఎట్లా ఉంటుంది సార్‌? ప్రతి చిన్న కారణానికి లాఠీ దెబ్బలు తింటుంటే యువతకు పోలీస్‌ వ్యవస్థ మీద గౌరవం ఎట్లా ఉంటుంది సార్‌? నేను తప్పు చేస్తే నాకు ఫైన్‌ వేయకుండా కొట్టడం అబ్యూజింగ్‌ కిందకు రాదా సార్‌.. ఇక పీపుల్‌ ఫ్రెండ్లీ అన్న మాటకు అర్ధమేముంది సార్‌..'
ప్రకాష్‌ చాలా పౌరుషపడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు. అతనికి కలిగిన అనుభవానికి గాయపడ్డ చిన్నవాడు. మొత్తము రక్షణ వ్యవస్థ మీదే ద్వేషం కలుగకుండా అతనికి నాలుగు మంచి మాటలు ఎలా చెప్పాలో మనోహర్‌కి అర్థంకాలేదు. అతను ఏదైనా చెప్పేలోగానే అతను దిగే స్టేజ్‌ వచ్చింది. పర్స్‌లో నుండి డబ్బులు తీసి ఇస్తూ మనోహర్‌ ఏదో అనబోయెంతలో మళ్ళీ ప్రకాష్‌ అన్నాడు
''ఇప్పటిదాకా ఇట్లా ఏదేదో అంటున్నాడు. వీడు ఏమయిపోతాడో అని వర్రీ అవుతున్నారా సార్‌. ఆటో నడుపుతూనే కరస్పాండెన్స్‌ కోర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను సార్‌. నాకే కాదు మా తాతకూ, మా అమ్మకూ, మా చెల్లెలికీ నేను యస్‌ఐని కావాలనే కోరిక సర్‌. ఆ పరీక్షలకే ప్రిపేర్‌ అవుతున్నాను. ఒకరో ఇద్దరో పొరపాటు చేస్తే అది మొత్తం వ్యవస్థకే ఆపాదించలేను సార్‌. నేను ఎస్‌ఐ అయితీర్తాను సార్‌.. ఈ సంవత్సరం కాకున్నా వచ్చే సంవత్సరమయినా మీకు ఎస్‌ఐ అయి మా నాన్న వారసుడిగా మీకు మళ్ళీ కనిపిస్తాను సార్‌.. ప్రకాష్‌లో ఉక్రోషం అతని ఆశయాన్ని దెబ్బ తియ్యనందుకు సంతోషపడుతూ తప్తిగా వెనుతిరిగాడు మనోహర్‌.

- సమ్మెట ఉమాదేవి,
9849406722

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గచ్చామీ..
గోధుమ రంగు పాము
సురభి...
పోలికతో అగచాట్లు...!!
నా నమ్మకాన్ని ఓమ్ము చెయ్యకు నాన్న...
నీళ్ల బావి
ఒక్క మాట
చెల్లి త్యాగం
వృద్ధాశ్రమం
అమ్మ కోరిక
సింధూరం
బతుకు నడక
అపరాధ భావం
తుది నిర్ణయం
గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు

తాజా వార్తలు

08:13 PM

కరోనా పాజిటివ్‌.. యువకుడు ఆత్మహత్య

07:57 PM

మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్

07:37 PM

లవర్స్ ను తుపాకితో కాల్చిన పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో

07:27 PM

ఏపీలో భారీగా పెరిగిన కేసులు..కరోనాతో 20 మంది మృతి

07:20 PM

డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి ప్రజలకు తీరని లోటు : సీపీఐ(ఎం)

07:18 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

07:12 PM

సీపీఐ మాజీ ఎంఎల్‌ఏ సుబ్బరాజు మృతికి సీపీఐ(ఎం)సంతాపం

07:10 PM

నా ఆరోగ్యం బాగుంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కల్యాణ్

07:06 PM

బాలిక‌పై లైంగికదాడి..సెల్ఫీ తీసి

06:58 PM

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా..

06:33 PM

తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్

06:07 PM

స్వచ్ఛందంగా లాక్ డౌన్..మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు

05:50 PM

యువ‌కుడి దారుణ‌ హ‌త్య

05:47 PM

కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం

05:25 PM

విశాఖలో ఈదురు గాలుల బీభత్సం

05:15 PM

పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

04:47 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ..ప్రతి 10 నిమిషాలకు..

04:09 PM

మంత్రి ఈటలకు సొంత జిల్లాలోనే షాకిచ్చిన నిరుద్యోగులు

04:06 PM

తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

03:59 PM

తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల

03:55 PM

ఈరోజు రాత్రి నుంచి రెండ్రోజుల పాటు లాక్‌డౌన్‌

03:04 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌కు గుండెపోటు, పరిస్థితి విషమం

02:53 PM

సీఎంకు కరోనా..ఆస్ప‌త్రిలో చికిత్స‌

02:05 PM

లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

01:50 PM

మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే ప‌దివేల జ‌రిమానా

01:37 PM

ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్

01:23 PM

చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!

01:13 PM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

01:10 PM

చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ప‌లు పర్యాటక స్థలాలు మూసివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.