Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అవృద్ధి.. | కథ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి
  • Feb 20,2021

అవృద్ధి..

ఒరేయ్.. తాగుబోతోడా.. అని గట్టికేక వినపడగానే కచ్చితంగా తననే అన్నట్టు వెనక్కి చూశాడు రవణయ్య.. మాసిన ప్యాంటూ చొక్కా అట్టకట్టిన జుట్టు, నింపాదిగా నడిచేది తక్కువ తూలుతుండటమే ఎక్కువ.. గుబురుగా పెరిగిన గడ్దం నిమురుకుంటుంటాడెప్పుడూ అతనిపేరు రవణయ్యో, రమణయ్యో కానీ ఆ కాలనీలో తాగుబోతోడన్న పేరుతోనే అతన్ని గుర్తిస్తారంతా... వెనుకటికెపుడో డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఏదో వామపక్ష విద్యార్థి సంఘంలో పని చేశాడంటారు..
ఏందన్నట్టు చూడగానే సందకాడ మార్కొట్టుకాడ మీటింగుందంట బిరియాని ప్యాకెట్లిత్తరు వత్తవా.. అనేసరికి నీళ్ళూరుతున్న నోటితో తలాడిచ్చాడు..
కొత్తగా నిర్మించిన మార్కెట్టును ఎమ్మెల్యే హనుమంతరాయుడు మునిసిపల్‌ చైర్‌పర్సనైన తన భార్యతో కలిసి ప్రారంభిస్తూ తాను చేసిన అభివృద్ధిని ఏకరువు పెడుతూ ప్రసంగిస్తున్నాడు.
వృధి అంటే ఏంది సారూ గుంపులో నుంచి తూలుతూ ముందుకొస్తూ అడిగాడు రవణయ్య.. అతని మాట వినపడలేదో వినిపించుకోకూడదనుకున్నాడో ఎమ్మెల్యే అవిగో రోడ్లు ఇవిగో డివైడర్లు కూడళ్లు, అంటూ తనప్రసంగం ఆపకుండా కొనసాగిస్తున్నాడు.. రవణయ్య ప్రశ్న తమకు ధైర్యాన్నివ్వటంతో ఎంతకాలం నుంచో చేయలేకపోయిన సాహసం చేశారు మరో ఇద్దరుముగ్గురు మహిళలు వాళ్లు సైతం అదే ప్రశ్న సంధించటంతో ఎమ్మెల్యే చికాగ్గా మొఖంపెట్టి ప్రసంగం ఆపేసరికి సభలో కలకలం రేగింది. ఎమ్మెల్యే వైపే చూస్తూ మరేదో అడిగేందుకు సిద్ధమవుతోన్న రమణయ్య సహా ఆ మహిళలను అదుపు చేసేందుకు పోలీసులు చురుగ్గా కదిలారు..
హే కూర్చోండి కూర్చోండంటూ సీఐ గద్దిస్తుండగా...
అయ్యా మా నోళ్లకు తాళాలేయకండి.. అమాసకు పున్నానికన్న ఒక్క మాట మాట్లాడనీయ్యండి బాంచెన్‌ అంటూ తమ మీదకు రాబోతున్న పోలీసులకు రెండు చేతులెత్తి దండం పెడుతూ అన్నారు మహిళలు ..
ఇంతలో సభ మరింత గందరగోళమవుతుండటంతో.. అభివద్ధి అంటే మార్పు.. కొత్త రోడ్లేయించాం, సైడ్‌ కాల్వలు ఏర్పాటు చేయించాం, వీధి లైట్లేయించాం.. అని ఎమ్మెల్యేగా తాను చేసిన అభివద్ధిని, బియ్యం ఇస్తున్నాం పించనిస్తున్నాం అంటూ తమ ప్రభుత్వ ఘనత చాటేందుకు యత్నిస్తుండగా.. లైట్ల వల్ల ఈదిలో సీకటి తొలుగుతుందేమో గానీ మా బతుకుల్లో సిమ్మసీకటి ఇంకా అట్టాగే ఉంది.. అన్నాడు రమణయ్య జారిపోతున్న తన ప్యాంటుపైకి మొలతాడెక్కిచ్చుకుంటూ ..
ఏరు చెప్తుంటే మీక్కాదా.. అంటూ సీఐ మరింత గద్దించే ప్రయత్నం చేస్తుండగానే అక్కడే అధికార పార్టీ కార్యకర్తలు రమణయ్యను అతని పక్కనున్న మహిళలవైపు గుర్రుగా చూశారు.. ఏరు ఎవరు మీరు ఆ ఎర్రజెండలోళ్లా.. ఇంత అభివద్ధి మీ కళ్లకు గానొత్తలేదా అని బెదిరించేందుకు పూనుకుంటుండటంతో.. అయ్యా మేమేం తప్పు మాట్టాడినం అని అన్నారు..
పోరి పొయ్యి గారోడ్లను జూడండి అభివద్ధేంటో అవుపడుద్ది అంటూ స్థానిక నాయకుడు తన జులుం చూపుతుండటంతో.. మట్టి రోడ్లను నున్నబరుసుడు గాదయ్యా మా మట్టి బతుకుల్నేం అభివద్ధిలోకి దెచ్చిన్రని అడుగుతున్నం.. అని ఈ సారి సూటిగ ప్రశ్నించాడు రమణయ్య.. రోడ్లు కాలవలతోనే సరిపుచ్చుడా.. ఒక ఫ్యాక్టరీ దెప్పిచ్చిన్రా కొత్త కొలువులిప్పిచ్చిన్రా.. మా ఆదాయా మార్గాలు మెరుగు పర్శిన్లా.. పక్కా ఇళ్లిత్తమన్నరు ఇదుగో అదుగో అని కాలం ఎళ్లదీత్తన్నరు.. మా బతుకులు గుడిసెలు గుడారాల్లోనే మగ్గుతున్నరు.. అని నిలదీస్తుండగా.. ఇచ్చినం గదా.. పక్కా ఇళ్లు అని లోకల్‌ లీడర్‌ ఖండించే సరికి.. మీ అనుకూలమైనోళ్లు ఏ పది మందికో ఇచ్చి అదే పథకం అంటే ఎట్టా సారూ అవసరమైనోళ్లందరికీ కేటాయిచ్చినప్పుడే అది పథకమైతది.. అని తిప్పికొట్టాడు రమణయ్య.
బియ్యమిత్తన్నం పించన్లిత్తన్నం అంటూ మరో కార్యకర్త ఏదో చెప్పబోతుండగా.. గాఉచిత పదకాలు వద్ది అయితయా.. మాగావలసింది ఆత్మగౌరవం ఉచిత పదకాల కోసం దేబిరించటం గాదు మా ఆదాయ స్థితిగతులు మెరుగుపడి మేం వద్ధి చెందితే మాకు అయ్యన్నీ అవసరం లేదు.. అని అంటుండగా పోలీసులు రమణయ్యను బలవంతంగా లాక్కెళ్లి వ్యానెక్కించారు.. అదుపుతప్పిన సభను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఎమ్మెల్యే.. ఒక్కడికైతే సనాధానం చెప్పగలం అతనిలో ఇద్దరున్నారు.. అలాంటోళ్ల మాట మనం పట్టించుకోవాల్సిన అవసరంలేదు అనేసరికి సభలో నవ్వులు విరిసి జనం అప్పటివరకూ జరిగిన తతంగం మరిచిపోవటంతో యధావిధిగా తన ప్రసంగంలో లీనమయ్యాడు..
కారులో ఇంటికి వెళుతున్నప్పుడు.. ఏదన్న ఫ్యాక్టరీ ఏర్పాటు జేయిస్తే ఈ అపవాదుగూడ పోద్దికదండీ అప్పుడన్న అభివద్ధిజేశినం అంటరేమో అంది ఎమ్మెల్యే సతీమణి జరిగిన గలాభాకు నొచ్చుకుంటూ.. ఆ మాటకు పెద్దగా నవ్వి ఊరుకున్నడు ఎమ్మెల్యే.. ఆ నవ్వుకు అర్థం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు.. పోలీసులు రమణయ్యను సాయంత్రం దాకా స్టేషన్లో ఉంచి విడిచిపెట్టాక ఆబగా బెల్టు దుకాణం వైపు దారి తీశాడు రమణయ్య..
ఆరు నెలల తరువాత ప్రభుత్వ పదవీకాలం ముగిసి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావటంతో తిరిగి టికెట్‌ సంపాదించి నామినేషన్‌ వేశాడు హనుమంత రాయుడు.. ఎన్నికల ప్రచారంకోసం కబురు చేయగానే కాలనీలు శివారు ప్రాంతాలు మురికివాడల నుంచి జనం వేలాదిగా తరలి వచ్చారు.. జెండాలు పట్టుకొని ఎన్నికల చిహ్నం ప్రదర్శిస్తూ హనుమంతరాయుడికే ఓటెయ్యమని అర్థిస్తూ ప్రచారం చేస్తూ సాయంత్రమయ్యే సరికి ఎమ్మెల్యే ముందు చెయ్యి చాపుతున్నారు కూలీ డబ్బుకోసం..
వాళ్లకు డబ్బిచ్చిపంపుతూ భార్యవైపు తిరిగి.. చూశావా.. ఏ జనమైతే నా పని తీరును తప్పు పట్టారో వాళ్లతోనే నా ప్రచారం చేయించుకుంటున్నా.. ఒక్క వేలెత్తి చూపబోయినోళ్లతోనే రెండుచేతులెత్తి దండం పెట్తిచ్చుకుంటున్నా, వాళ్ల నోళ్లతోనే నా గురించి మిగతా ఓటర్లకు మంచిగా చెప్పించుకుంటున్నా.. ఇదేనోరు రాజకీయమంటే.. అయినా.. ఈ లేబరోళ్లు చిల్లుగాబు లాంటోళ్లు ఎల్తిపడతనే ఉంటరు గానీ ఎప్పటికీ వాళ్లకు నిండుదనం రాదు..
నువ్వు ఆ మధ్య అన్నట్టు ఫ్యాక్టరీ పెట్తిస్తే మనకేమొస్తదే.. రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు, కూడళ్ల అభివద్ధి మనకు కాసులు కురిపిస్తది.. కోట్లాది రూపాయల టెండర్లలో కాంట్రాక్టర్లు మనవాటా మనకిస్తరు.. ఆ రోజు ఆ తాగుబోతోడు జెప్పింది నిజమేనే.. ఈ జనానికి అదాయ మార్గాలు, జీవనోపాధుల లోటే.. వాళ్లకు మనకూ మధ్య అదే నియంత్రణ రేఖ.. ఆ వద్ధి కల్పిస్తే ఇంకేమన్నా ఉందా.. నువ్వెంతో నేనంత అంటరు.. మన ముందే కాలరెగరేసుకొని తిరుగుతరు కాలు మీద కాలేసుకుంటరు.. అంతదాక ఎందుకు వీళ్ళు వద్ధి సాధిస్తే.. ఎన్నికల ప్రచారానికి తండోపతండాలుగా ఇంత మందొస్తారా.. వద్ధి కల్పిస్తే.. ఓటును మందుసీసాకు రెండువేల నోటుకు అమ్ముకుంటారా వీళ్లు.. వీళ్ళకే గనక వద్ధి దక్కితే సభలు సమావేశాలు శంఖుస్థాపనలకు ఒక్కడైనా కనపడతాడా.. సమాజం రోడ్డులాంటిదైతే అసమానత డివైడర్‌ లాంటిదే.. మన వైపు నుంచి మనకు అది అభివద్ధి, వాళ్లవైపు నుంచి వాళ్లకది అవద్ధి.. మనకూ వాళ్లకూ ఆ రెండు ముఖాల అడ్డుగోడ ఉండాల్సిందే.. అన్నాడు తన భార్యకు రహస్యం విడమరుస్తూ..
పోలింగ్‌ తేదీ దగ్గరపడటంతో ప్రచారాలు ముమ్మరమయ్యాయి.. హనుమంతరాయుడికే మన ఓటు నినాదాలతో మరుసటి రోజు పెద్ద ఎత్తున ర్యాలీ సాగుతోంది ఆ దారినే బెల్టు షాపు ముందు రమణయ్య శవం పడి ఉంది.. తెరిచి ఉన్న అతని కళ్లనిండా అతను సంధించిన ప్రశ్నలే నిలదీతలే.. మద్యానికి బానిసత్వం మాటకు విలువ లేకుండా చేసింది.. అతని నాయకత్వ లక్షణం పోరాట గుణం వధా అయ్యింది.. రమణయ్య హనుమంతరాయుడికి వ్యతిరేక ఓటే కానీ అది చెల్లుబాటు కానిది.. చెల్లుబాటు కాని వ్యతిరేక ఓట్లున్నంత కాలం హనుమంతరాయుడు గెలుస్తూనే ఉంటాడు.. హనుమంతరాయుడులాంటోళ్లు తమ రాజకీయపుటెత్తుగడల్లో భాగంగా వ్యతిరేక ఓట్లను అలా మత్తుకు గురి చేస్తూనే ఉంటారు.. వాళ్ల ఆక్రోశాన్ని మత్తు పేరున చెల్లుబాటు కాకుండా చేస్తుంటారు..

- శ్రీనివాస్‌ సూఫీ
9346611455

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా
'వృక్షో రక్షతి రక్షితః'
లాఠీ
చెప్పుడు మాటలు
స్వల్పకాలిక తిరుగుబాటు
ముగ్గు
ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు
ఒక అమ్మ కథ
మర్రి విత్తనం
పెద్దాయన
బలి
ఓడిపోయిన దేవుడు...!
విద్య విలువ
పుట్టిన ఊరు
ముసుగు
మృగరాజు ఎన్నిక
పరిమళించిన మానవత్వం
అమ్మమ్మ కథ..!!

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.