Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
ఇండ్ల పట్టాల కోసం సీపీఎం అధ్వర్యంలో మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో పేదలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, సీపీఎం నాయకులు మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ పేదలందరూ ఇండ్ల దగ్గరే ఉండండి పట్టాలు ఇస్తామని చెప్పారని, పనులకు వెళ్ళకుండా ఉన్నారని తీరా ఉదయం నుండి వస్తున్నాం అంటూ రాకపోతే విసుగు చెందిన పేదలు ఆందోళనకు దిగారన్నారు. రెవిన్యూ సిబ్బంది స్పందించి పట్టాలు పంపిణీ ప్రారంభించగా ఆందోళనను విరమించినట్లు తెలిపారు.