Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలులో భాగంగా వైరా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం వైరా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాదావత్ శంకర్ నాయక్ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై కళాజాత నిర్వహించి అవగాహన సదస్సు నిర్వహించారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు వాహనాలు నడుపు కోవాలని సూచించారు. అనంతరం యూనిట్ ఆఫీస్ కి హెల్మెట్ ధరించుకొని వచ్చిన వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రత్యేక ఆహ్వానం తెలిపారు. వాహనదారులందరకి రోడ్డు భద్రతా మాసోత్సవం కరపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టూవీలర్ వాహనదారులు, మరియు ఆటో డ్రైవర్లు, ట్రాలి డ్రైవర్లు మరియు రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.