Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ ఇటీవల కరోనాను జయించి కల్లూరు చేరుకున్న సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచులు గురువారం ఆయన్ని పరామర్శించారు. త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. పరామర్శించిన వారిలో సర్పంచ్లు రావి సూర్య నారాయణ, గంగావరపు శ్రీనివాస్‌రావు, శీలం సత్యనారాయణరెడ్డి, బైరెడ్డి నరసింహారెడ్డి, ధరావత్ మోహన్, నామా రాధమ్మ వెంకటేశ్వర్లు, సింగిసాల పద్మ ప్రసాద్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్య నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సారాబు వెంకటేశ్వర్రావు, జక్కంపూడి కిషోర్, వల్లభనేని రవికుమార్, కృష్ణా, గుగులోత్ ప్రసాద్, వల్లపునేని పుల్లారావు, తలపు రెడ్డి అనివిరెడ్డి, కష్టాల రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. జడ్పీటిసి తండ్రి కట్టా వెంకటనర్సయ్య మృతికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అదేవిధంగా మండలం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో కట్టా అజయ్ కుమార్‌ని పరామర్శించి, వెంకటనర్సయ్యకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉబ్బన ప్రభాకర్‌రావు, బొల్లం రామారావు, పాటిబండ్ల సాంబశివరావు, గంగుల గోపి, కె.బలరామ్, వి.రాంబాబు, వినుకొండ శ్రీనివాసరావు, డీవీఎస్ వర్మ, కాగితాలు రామారావు ఉన్నారు.