Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలోని ఏదుళ్ళచెర్వు గ్రామంలో ఆరు చెరువులున్నా, ఒక్క దానిలో కూడా సక్రమంగా నీళ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే లింక్ కాల్వలు ఏర్పాటు చేసి భక్త రామదాసు ద్వారా చెరువులు నింపాలని కోరుతూ ఏదుళ్ళచెర్వు గ్రామం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు సీపీఐ(ఎం), టిఆర్‌ఎస్ పార్టీల ఆధ్వర్యం లో పాదయాత్ర నిర్వహించి, ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం ఎమ్మార్వో, జెడ్పీటీసీ, ఎంపీపీలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి అంగిరేకుల నర్సయ్య, నాయకులు కొమ్ము శ్రీను మాట్లాడుతూ భక్త రామదాసు ద్వారా వెంటనే చెరువులు నింపాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెగినాటి వెంకట్రావు, దొండేటి సుగుణమ్మ, కాంపాటి శ్రీదేవి, కుంట వెంకటేశ్వర్లు, వెంకటప్పయ్య, జానీ, టిఆర్‌ఎస్ నాయకులు నేరడ సత్యం, శ్రీకాంత్, సిహెచ్ దర్గయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.