Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-బోనకల్/చింతకాని/ ముదిగొండ/ మధిర
కొత్త వ్యవసాయ చట్టాలను కార్మిక కోడ్ లను విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను కార్మిక కోడ్ లను విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక పోరుయాత్ర గురువారం బోనకల్, చింతకాని, ముదిగొండ, మధిర మండలాలకు చేరుకుంది. ఆయా మండల కేంద్రాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరల చట్టం తేవాలని అనేక సంవత్సరాలుగా రైతాంగం ఆందోళన చేస్తుంటే చివరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్రంగా నష్టం జరిగే చట్టాలను తీసుకు వచ్చిందని విమర్శించారు. బీజెపి ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల రైతుల సామాన్య ప్రజల హక్కులపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగ సంస్థల ప్రభుత్వరంగ సంస్థలు ఇతర రంగాల్లో ప్రైవేటీకరణ ఆపాలని కరోనా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా వేయాలని రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అందరికీ సామాజిక భద్రత కల్పించాలని, అందరికీ సామాజిక భద్రత కల్పించాలని, అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా రైతు రుణ విమోచన చట్టాన్ని దేశమంతా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరు యాత్ర అ ఫిబ్రవరి 2వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు తుమ్మా విష్ణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు నవీన్ రెడ్డి, రమ్య, సీఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, మండల కో కన్వీనర్ గుగులోతు నరేష్, సీఐటియు నాయకులు పిల్లలమర్రి వెంకట అప్పారావు పాల్గొన్నారు.
ముదిగొండ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గ్రామ గ్రామాన రైతు ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గత 60 రోజుల నుండి ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక పోరుయాత్ర గురువారం ముదిగొండ చేరుకుంది. ఈసందర్భంగా ముదిగొండలో పోరుయాత్ర ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మండల రైతు సంఘం అధ్యక్షులు కందుల భాస్కర్ రావు, ఐద్వా మండల కార్యదర్శి పయ్యావుల ప్రభావతి, సిఐటియు మండల కన్వీనర్ టిఎస్ కళ్యాణ్, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, నాయకులు యుగంధర్ కూరపాటి శ్రీను, తేరాల నాగేశ్వరరావు, వట్టికూటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మధిర : సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్న రాష్ట్ర జీపుజాతా గురువారం మధిర చేరుకుంది. ఈ జీపుజాతాకు మధిర మండల, పట్టణంలో హమాలీలు, బిల్డింగ్ వర్కర్స్, సివిల్ సప్లై వర్కర్లు, వివిధ ప్రజా సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ, మహిళా సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఈజీపుజాతా మధిర పట్టణంలో ఆర్‌వి కాంప్లెక్స్ వద్ద టి.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సభ లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు. భాస్కర్ మాట్లాడారు.కార్యక్రమంలో రైతురాష్ట్ర సంఘం నాయకులు కట్టా గాంధీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం నరసింహారావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, సిఐటియు జిల్లా నాయకులు పడకంటి మురళి, ఎస్‌ఎఫ్‌ఐ మధిర డివిజన్ కార్యదర్శి వడ్రాణపు మధు, హమాలీ రాష్ట్ర నాయకులు నామాల శ్రీనివాసరావు, రెడపంగి ప్రసాద్, అనంత రాములు, దుర్గయ్య, మాధవరావు, పోతురాజు, శ్రీను, రాము, నాగమల్లేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా కార్యదర్శి వెంకయ్య, ఆవుల శ్రీనివాసారావు పాల్గొన్నారు.