Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 జిల్లాలో బస్సు యాత్ర పూర్తి
- టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలి
- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ-భద్రాచలం
వ్యవసాయ నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర భద్రాచలం చేరుకుంది. ఈ సందర్భంగా భద్రాచలంలో సీపీఐ(ఎం), వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బస్సు యాత్ర బందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టి.సాగర్ మాట్లాడుతూ... అన్నదాతలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని ఆయన అన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు. రైతులు చేస్తున్న న్యాయమైన ఆందోళనకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఈ బస్సు యాత్ర చేపడుతున్నామని, ఇప్పటికి 19 జిల్లాలో ఈ బస్సు యాత్ర పూర్తి అయిందని ఆయన అన్నారు. బస్సు యాత్రకు ఆయా జిల్లాల్లో విశేష స్పందన వుందని అన్నారు. ఈ బందంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి రవి కుమార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు కోట రమేష్, తదితరులు ఉన్నారు. ఈ బందంకు స్వాగతం పలికిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక, నాయకులు వెంకటేశ్వర్లు, నర్సారెడ్డి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు, సీఐటీయూ నాయకులు బి.వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లక్ష్మీదేవిపల్లి మండలం, రేగళ్ల పంచాయతీ పరిధిలోని పెద్దతండా గ్రామంకు బస్సు యాత్ర చేరుకుంది. గ్రామస్తులు బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘము రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో రైతు, వ్యవసాయం బతికి ఉండాంటే కేంద్రం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వనికి పతనం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర రైతు సంఘం నాయకులు కసాని ఐలయ్య మాట్లాడుతూ... ఏజన్సీ ప్రాంతంలో గిరిజనుల పోడు కొట్టి కొన్ని సంవత్సరాలుగా భూమి సాగు చేస్తున్నారన్నారు. హరితహారం పేరుతో జిల్లాలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల నుండి వెల్లగొట్టే కుట్రలు రాష్ట్ర ప్రభుత్వం చేసూ,్త ఏజన్సీ ప్రాంతంలో దాడులు చేస్తూ నిర్బంధానికి గురిచేస్తుందన్నారు. పోడు సాగు రైతులకు అండగా ఉంటామని, ఎన్ని నిర్బంధలు వచ్చిన ముందుండి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మూడ్ శోభన్‌బాబు, కేవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కై లాబ్ బాబు, వాంకుడోత్ కోబల్, బి. ధర్మ, జాటోత్ కృష్ణ, యూ.నాగేశ్వరరావు, నల్లమల్ల సత్యనారాయణ, వెంకన్న, సూర్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం సంఘటిత పోరాటాల ద్వారా కార్పొరేట్ శక్తుల నుండి వ్యవశాయ రంగాన్ని కాపాడుకుందామని తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి యం.శోభన్ నాయక్, జిల్లా అధ్యక్షులు యలమంచి రవికుమార్ పిలుపు నిచ్చారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు జాతా గురువారం దుమ్ముగూడెంకు చేరుకుంది. ములకపాడు సెంటర్‌లో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన రైతు జాతా సభలో వారు మాట్లాడారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, రైతులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ నెల 25న కలెక్టరేట్ ముందు జరిగే ముట్టడి కార్యక్రమానికి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సభకు ముందు కళాకారులు కార్పొరేట్ శక్తులనుండి వ్యవశారంగాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు యలమంచి శ్రీనుబాబు, బొల్లి సూర్యచందర్‌రావు, వ్యకాస మండల కార్యదర్శి యలమంచి వంశీకృష్ణ, నాయకులు చంద్రయ్య, చిలకమ్మ, శ్రీనివాసరెడ్డి, చిన్ననల్లబల్లి సర్పంచ్‌లు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.