Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్ కమర్షియల్ డైరెక్టర్ టిఆర్‌కె.రావు
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీటీపీఎస్ మూడో యూనిట్ సింక్రనేజేషన్ పూర్తి అయిన అనంతరం త్వరంలోనే సీవోడీ నిర్వహించనున్నాన్నట్టు, బీటీపీఎస్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కోల్ కమర్షియల్ డైరెక్టర్ టిఆర్‌కె.రావు సింగరేణి అధికారులతో డైరెక్టర్ సివిల్ అజరు, సీఈ బాలరాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు, కాం ట్రాక్టర్లకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. రోజుకు 10వేల టన్నుల బొగ్గు అందింజేందుకు సింగరేణి సిద్ధంగా వున్నదన్నారు. బీటీపీఎస్‌కి అన్ని వేళలా సహకరించేలా, బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాలు లేకుండా చూడాలన్నారు. మూడో యూనిట్ సీవోడీ నిర్వహించేందుకు పనుల వేగం పెంచాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణీ జీఎం జక్కం రమేష్, ఏవ్వోటు జీఎం బోగ వెంకటేశ్వర్లు, బెల్ మేనేజర్ ఆగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.