Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ-చర్ల
కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రైతులకు అధికంగా నష్టం చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. గత సంవత్సరం నవంబర్ 26 నుండి ఢిల్లీలో లో రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా ఈ నెల ఒకటో తారీఖు నుండి తెలంగాణ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బస్సు యాత్ర ప్రారంభమై తెలంగాణ రైతు సంఘం, ప్రజానాట్య మండలి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగడుతూ రైతులను చైతన్య పరుస్తూ తెలంగాణ 33 జిల్లాలలో గ్రామగ్రామాన బస్ జాతా కార్యక్రమాలు కలవని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ ఏరియాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సహాయకారదర్శి, తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యలమంచిలి రవి కుమార్ మాట్లాడుతూ.. గతయాడాది జూన్ 5న ఆర్డిన్స్ రూపంలో ఒంటెద్దు పోకడలతో 2020 సెప్టెంబరు 17 నుండి 24 తేదీలలో పార్లమెంట్లో బిల్లును ఆమోదించి, సెప్టెంబర్ 27న రైతు వ్యతిరేక బిల్లును రాష్ట్రపతితో సహా ఆమోదింపజేసి మోడీ ప్రభుత్వం బిల్లును చట్టబద్దం చేశారని వారు విమర్శించారు. నిరంకుశత్వంగా ఆమోద ముద్ర పొందిన ఆ మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికే నూతన చట్టాలను తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు.
తొలుత మండలానికి చేరుకున్న తెలంగాణ రైతు జాతకు తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ జిల్లా కమిటీ నేతత్వంలో ఘన స్వాగతం పలికి నాయకులకు పూలమాలలు వేసి సత్కరించారు. మండలంలో రెండు చోట్ల రెండేసి గంటల పాటు రైతు జాతా కార్యక్రమాలు సాగాయి. చర్లలో సుమారు 100 మోటార్ బైకులతో మండల కేంద్ర పొలిమేర నుండి చివరి వరకు రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదిస్తూ భారీ ర్యాలీ సాగింది. అనంతరం ప్రజానాట్యమండలి యాదగిరి నేతృత్వంలో పాటల నృత్యాలతో రైతులను ఉత్తేజపరుస్తూ చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్, వైస్ ఎంపీపీ కుంజా చిన్నక్క, నాయ కులు కొండ చరణ్, రామారావు రాంపండు, దుమ్మగూడెం రైతు సంఘం కార్యదర్శి బొల్లి సూరి, ఉప సర్పంచ్ శివ, వార్డుసభ్యులు దొడ్డి హరి నాగ వర్మ, కుంజా వెంకటేశ్వర్లు, వీర్రాజు, ప్రజా నాట్య మండలి కళాకారులు గణేష్, రూపా, రాజశేఖర్, వినరు, మహేంద్ర, శిరీష, శైలజ పాల్గొన్నారు.