Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న జరిగే ధర్నాను జయప్రదం చేయండి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణ అభివద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్లు నిధులు కేటాయించాలని కోరుతూ ఈ నెల 25న కొత్తగూడెంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం కామ్రేడ్ చందర్ రావు భవన్‌లో పట్టణ కార్యవర్గ సభ్యులు బండారు శరత్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణం పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. పట్టణ అభివద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఏడు సంవత్సరాలు దాటినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. అదేవిధంగా పట్టణంలో ఇండ్లులేని వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లతో ఈనెల 25న కొత్తగూడెంలో సభ, ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణానికి ప్రమాదం ఉందని, ఈ సమస్యపై భవిష్యత్తు ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, యంబీ నర్సారెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో నుండి ప్రజలను కొత్తగూడెం సభకు పెద్ద సంఖ్యలో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట రెడ్డి, వై.వి.రామారావు, పట్టణ కమిటీ సభ్యులు ఎన్.లీలావతి, బి.కుసుమ, డి.లక్ష్మి, సున్నం గంగా, ఎస్డి ఫిరోజ్, యు.జ్యోతి, కుంజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.